సంపాదకీయం

పతన ‘కళ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో అమితవేగంగా సంభవిస్తున్న ఘటనాక్రమం అవినీతి రాజకీయం పాలిట అశనిపాతం! అఖిల భారత అన్నా ద్రవిడ మునే్నత్ర కడగం-అభాఅద్రముక-నుంచి శశికళ బహిష్కరణ ఈ క్షిప్ర పరిణామ క్రమంలో వర్తమాన ఘట్టం! తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, ‘అభాఅద్రముక’ అధినేత్రి జె.జయలలితకు తాను మరో రూపమన్నట్టు అభినయించిన శశికళ ‘నాటకం’ మూడు నెలల ముచ్చటగా ముగిసిపోవడం ఊహించని అద్భుతం! ఇంతవేగంగా రాజకీయం ఇన్ని మలుపులు తిరగడం తమిళనాడులో మాత్రమే కాదు, దేశంలోనే అభూతపూర్వం! ‘చిన్నమ్మ’గా వేషం వేసిన శశికళను జయకొట్టిన పార్టీ అనుచరులు ఆమెను ఛీకొడుతున్నారు. జయ కొట్టడాలు, జయ కొట్టిన వారిని ఛీకొట్టడాలు రాజకీయాలలో సర్వసాధారణం.. ఆశ్చర్యకరం కాదు! కేవలం రెండున్నర నెలల వ్యవధిలో జయనాదాలు ఛీత్కారాలుగా మారిపోవడమే రాజకీయ చమత్కారం. ఫిబ్రవరి ఐదవ తేదీన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికై ‘చిన్నమ్మ’గా చెలామణి అయిన వి.కె.శశికళా నటరాజన్ ముస్తాబయింది! ఆమె అధికార పీఠం వైపుకాక కారాగృహం వైపు అడుగులు వేయవలసి రావడం ఎనిమిది రోజుల తరువాత మొదలైన ప్రహసనం. పార్టీ కార్యకర్తలు ప్రధానంగా శాసనసభ్యులు మాత్రం ఆమెకు జయ కొట్టడం మానలేదు. గతంలో జయలలిత వలె శశికళ కూడ జైలులోనుంచి అధికార రాజకీయ చక్రం తిప్పగలిగింది. ఎడప్పడి పళనిస్వామిని ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోబెట్టగలిగింది. తన సన్నిహిత కు టుంబ సభ్యుడైన టి టివి దినకరన్‌ను పా ర్టీకి ఉపప్రధాన కార్యదర్శిగా నియమించగలిగింది. రెండున్నర నె లలు గడవక ముందే ఊహకు అతీతమైన రీతిలో ‘అన్నాద్రముక’ అంతర్గత దృశ్యం మా రిపోయింది. శశికళ ప్రధాన కార్యదర్శి పదవిని కోల్పోయింది. దినకరన్ సహా శశికళ ఆమె కుటుంబం పార్టీనుంచి గెంటివేతకు గురి కావడం మూడు రోజుల క్రితం కూడ ఎవ్వరూ ఊహించని పరిణామం. ఇదీ రొదలేని విప్లవం!
తమిళ రాజకీయాలలో అవినీతి పట్ల పెద్ద వ్యతిరేకత లేదు. ద్రవిడ మునే్నత్ర కడగం, అన్నాద్రవిడ మునే్నత్ర కడగం అగ్ర నాయకులలో అత్యధికులు అవినీతి ఆరోపణలకు గురైనవారే. ఆ ఆరోపణలు ధ్రువపడిన తరువాత జయలలిత జైలుకు వెళ్లినప్పుడు ‘అమ్మ’ విడుదల కోసం పార్టీ కార్యకర్తలు ఎలుగెత్తి ఏడ్చారు. కానీ అవినీతిని నిరసించలేదు. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం జయను దోషిగా నిర్ధారించాక ‘అమ్మ’ భక్తులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరసనలు నిగడించారు! తమిళనాడు రాజకీయ అగ్నిగుండంగా మారింది. హైకోర్టు జయను నిర్దోషిగా నిర్ధారించడం, సుప్రీం కోర్టు తీర్పు వెలువడే లోపల ఆమె మరణించడం వేరే కథ. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా మితిమీరి అభినయించిన ‘చిన్నమ్మ’ వాతల నక్కగానే మిగిలిపోయింది, పులి రాలేదు! ఇది కూడ అనూహ్య పరిణామం. అవినీతి ఆరోపణలు ధ్రువపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన శశికళ జైలుకు వెళ్లినప్పుడు తమిళనాట ఒక కన్నీటి బొట్టు కూడ రాలలేదు. జయకు శశికళకూ మధ్య నాగలోకానికి నక్కకూ మధ్య ఉన్నంత అంతరం ఉందని ఫిబ్రవరిలో ఆమె జైలుకు వెళ్లినప్పుడే స్పష్టమైంది. జయను దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా హైకోర్టులోను సుప్రీంకోర్టులో అప్పీలు చేయడానికి అవకాశం లభించింది. అందువల్ల జయలలిత ‘నిర్దోషిత్వం’ ఋజువు కాగలదన్న ఆశతో ఆమె అభిమానులు అలా ఆక్రోశించి ఉండవచ్చు! శశికళను జైలుకు పంపింది సర్వోన్నత న్యాయస్థానం కనుక ‘అభిమానులు’ ఆశలు వదులుకున్నారు, కన్నీళ్లు పెట్టలేదన్నది మరోవైపు జరిగిన ప్రచారం. అభిమానుల కళ్లలో నీరు లేదన్నది శశికళా విధేయుల వాదం. అభిమానులే లేరన్నది వాస్తవం! పార్టీలో సైతం ఆమెకు విధేయులు లేరన్నది ఇప్పుడు బయటపడిన రహస్యం! ఆమెవల్ల ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన ఓ.పన్నీర్ సెల్వం, ఆమెవల్ల ముఖ్యమంత్రి పదవిని పొందిన ఇ.పళని స్వామి ఒకటైపోతారని ఆమె కలలో కూడ ఊహించి ఉండదు. ఈ ‘వాతల నక్క’ నుంచి పార్టీకి ఇంత త్వరగా విముక్తి లభించగలదని కార్యకర్తలు, ప్రజలు ఊహించి ఉండరు! ఆమె పతన వేగం రాజకీయ చరిత్రలో ‘అనితర సాధ్యం’! స్వయం ప్రకటిత ‘చిన్నమ్మ’ బిరుదు గొప్ప అపహాస్యం!!
అన్నా ద్రవిడ మునేత్ర కడగం సంస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.రామచంద్రన్ మరణించిన సమయంలో జయలలిత అమలు జరిపిన వ్యూహాన్ని, జయలలిత మరణం తరువాత శశికళ అమలు జరుప యత్నించడం చారిత్రక పునరావృత్తి! శశికళ వ్యూహం ఇలా ఆరంభంలోనే బెడిసికొట్టడం అభూతపూర్వం! వ్యూహం అమలు జరిగిన తీరులో కూడ పోలికలేదు! ఎమ్.జి. ఆర్ మరణించాక ఆ యన భార్య జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రి కాగలిగింది. అధికారం దక్కని జ యలలిత జనానికి చే రువైంది. జయ మ రణం తరువాత ‘అధికారాన్ని’ సర్వం సహా స్వాహా చేయగలిగిన శశికళ జనానికి దూరమైంది! ఇదీ తేడా! ఎమ్.జి.ఆర్ మరణం తరువాత అన్నా ద్రవిడ మునే్నత్ర కడగం చీలిపోయింది. ఒక వర్గం జయలలిత నాయకత్వంలోను మరో వర్గం జానకీ రామచంద్రన్ నాయకత్వంలోను ఎన్నికలలో పోటీ చేసాయి. ఫలితంగా 1975 నాటి ‘అత్యవసర పరిస్థితి’-ఎమర్జెన్సీ-సందర్భంగా అధికారం కోల్పోయిన ఎమ్.కరుణానిధి నాయకత్వంలోని ‘ద్రవిడ మునే్నత్ర కడగం’ 1989 జనవరిలో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఘనవిజయం సాధించింది! ఆ తరువాత జానకీ రామచంద్రన్ వర్గం వారు జయలలిత నాయకత్వాన్ని అంగీకరించారు. ఉభయ వర్గాలు జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. జయ మరణం తరువాత ఇప్పుడు కూడ ‘అన్నాద్రవిడ మునే్నత్ర కడగం’ రెండుగా చీలిపోవడం చారిత్రక పునరావృత్తి! శశికళ వర్గం ఉపప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ అవినీతి రట్టయిన నేపథ్యంలో ‘ఉభయ వర్గాలు’ ఏకం అవుతుండడం కూడ పునరావృత్తి! ఉభయ వర్గాలు కలిసి శశికళని పార్టీనుంచి బహిష్కరించడం ఒక్కటే- అప్పటికీ ఇప్పటికీ మధ్య ఏర్పడిన అంతరం...
ఈ అనుహ్య ఘటనాక్రమాన్ని రగిలించిన దినకరన్ అవినీతి కూడ అనూహ్యమే! రెండాకుల గుర్తు పొందడం కోసం ‘ఎన్నికల కమిషన్’ అధికారులకే లంచం ఇవ్వడానికి యత్నించడం దినకరన్ దౌష్ట్యానికి వికృతంగా ఆవిష్కరించిన విపరిణామం, అవినీతి శశికళ మారని ప్రవృత్తికి పశ్చాత్తాపం పొందని మానసిక స్థితికి నిదర్శనం!!