మెయిన్ ఫీచర్

నిజమైన నేస్తం ( నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం ఓ మంచి నేస్తం. ఊసుపోవడానికి కొందరికి, విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మరికొందరికి సాయపడుతుంది. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి దారి చూపెట్టే సాధనమూ అదే. మనోవికాసానికి, మార్గనిర్దేశానికి గురువులా ఉపయోగపడుతుంది. అందుకే జీవితంలో నిజమైన నేస్తం.. పుస్తకం. మానవజీవన గమనం, విధానంలో పుస్తకాలు వచ్చాక విప్లవాత్మక మార్పులు వచ్చాయంటే నమ్మాల్సిందే. ఆధునిక జీవన విధానం చుట్టుముడుతున్న ఈ రోజుల్లోనూ పుస్తక పఠనాన్ని ఇష్టపడేవారూ గణనీయంగానే ఉన్నారు.
యునెస్కో చెప్పింది
ప్రముఖ ఆంగ్ల రచయిత విలియం షేక్స్‌పియర్ వర్థంతి సందర్భంగా ప్రతిఏటా ఏప్రిల్ 23వ తేదీనాడు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించాలని యునెస్కో నిర్ణయించింది. ఈ పుస్తక దినోత్సవాన్ని 1995 నుంచి నిర్వహిస్తున్నారు. పుట్టిన బిడ్డ మొదలు పెద్దలు వరకు ఏదో ఒకటి నేర్చుకోవాలని తపనపడేవారే. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థే. విద్యతో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే పుస్తకాల దుకాణానికి వెళ్లి మంచి పుస్తకం కొని చదవటం వల్ల విజ్ఞా న ప్రపంచంలోకి అడుగుపెడతారు. పుస్తక భాండాగారం గురించి తెలుసుకోవాలంటే మనదేశంలో ఐదు ప్రముఖ పుస్తక మార్కెట్లు ఉన్నాయి. ఇక్కడ కొత్త పుస్తకాలే కాదు పాత పుస్తకాలు మరెక్కడ దొరకని అరుదైన గ్రంథాలు లభిస్తాయి. అవేమిటో తెలుసుకుందాం.
పుస్తకాల కొలువులు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు పుస్తక మార్కెట్లు ఉన్నాయి. దరియాగంజి, నైసాదక్ మార్కెట్లు ప్రసిద్ధి. దరియాగంజి పుస్తకమార్కెట్ ప్రముఖ రచయిత కుష్వంత్‌సింగ్ అభిమాన కేంద్రం. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు సరసమైన ధరకు లభిస్తాయి. ఓ చిన్న భేరం ఆడితే చాలు మీకిష్టమైన పుస్తకం మీ చేతుల్లో ఉంటుంది. ఆదివారం అయితే చాలు పుస్తకప్రియులు ఇక్కడ వాలిపోతారు. ఇక నైసాదక్ పుస్తక మార్కెట్ అన్ని రోజుల్లో ఉంటుంది. ఆదివారం మాత్రం ఇక్కడ ఉండదు. ఇక్కడ హోల్‌సేల్, రిటైల్ ధరలలో స్కూలు, కాలేజీ విద్యార్థుల పుస్తకాలు లభిస్తాయి.
కోల్‌కతా:
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉండే పుస్తక మార్కెట్ వారసత్వం గా వస్తున్న ఆస్తిగా పేర్కొంటారు. ఇక్కడి బుక్‌మార్కెట్‌ను ప్రపంచంలోనే పొడవైన పుస్తక మార్కెట్‌గా పరిగణిస్తారు. మనదేశంలో అతి పెద్ద పుస్తక మార్కెట్ ఇది. పొడవైన ఫుట్‌పాత్‌లపై పుస్తకాలు విక్రయించేవారితో ఈ మార్కెట్ సందడిగా ఉంటుంది. కోల్‌కతా నగరం మధ్యలో ప్రముఖ కాలేజీ స్ట్రీట్‌మార్గ్‌లో ఉండే ఈ పుస్తక మార్కెట్‌లో ఓ మంచి పుస్తకాన్ని శోధించి కొనుక్కుని చదవగలిగితే జీవితం ధన్యమైనట్లే.
పూణె:
పూణెలోని అప్పా బల్వంత్ చౌక్‌లో ఉండే పుస్తక మార్కెట్‌లో ప్రపంచంలో విలువైన పుస్తకాలన్నీ లభ్యమవుతాయి. ఈ పుస్త క మార్కెట్ ప్రపంచ ప్రసిద్ధిచెందిం ది. ఎక్కడా దొరకని పుస్త కం ఇక్కడ లభ్యమవుతుంది. విద్యార్థులు ఎక్కు వ మంది ఇక్కడకు వస్తుంటారు. ఏదైనా కొత్త పుస్తకం ఎక్కడైనా విడుదలైందంటే అది ఇక్కడ తప్పకుండా దొరుకుతుందని భావిస్తారు. పుస్తక ప్రియులు ఈ మార్కెట్‌కు వస్తే ఖాళీ చేతులతో వెళ్లరు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కోఠి కూడా ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రం గా పరిగణిస్తారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలన్నీ ఇక్కడ దొరుకుతాయి. హైదరాబాద్ సంస్కృతిలో కోఠి పుస్తకాల మార్కెట్ ఒక భాగం. అలాగే చెన్నైలోని మూరీ మార్కెట్, లక్నోలోని అమినాబాద్ బజార్ కూడా పుస్తక విక్రయ కేంద్రాలుగా ప్రసిద్ధి. ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసే, వ్యక్తిత్వ వికాసానికి పదునుపెట్టే పుస్తకాల్లోని ప్రతి అక్షరం జీవంతో తొణకిసలాడుతుందని మరువద్దు. పుస్తకాలను ఎంపిక చేసుకునేటపుడు సమకాలీన సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తూ మార్గనిర్దేశం చేసేవాటిని ఎంపిక చేసుకుని ఆనందమయ జీవితానికి యువత బాటలు వేసుకోవాలి.

పుస్తకం అంటే విజ్ఞాన భాండాగారం. మహాసముద్రంలాంటిది. అందుకే సంఘ సంస్కర్త కందుకూరు విరేశలింగం పంతులుగారు చిరిగిన చొక్క అయినా తొడుక్కోగానీ మంచి పుస్తకం కనుక్కో2అని అన్నారు. కాని నేడు సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్ది ఇంటర్నెట్, వాట్సాప్ సంభాషణలతో పసి పిల్లాడి నుంచి పెద్దల వరకు విలువైన కాలాన్ని వృధా చేస్తున్నారే గానీ ఎవ్వరూ కూడా మంచి పుస్తకం చదవటానికి మక్కువ చూపటం లేదు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో కథలు పుస్తకాలు చదివే అలవాటు చేస్తే అదే అలవాటుగా మారి యువతరం అన్ని విషయాల్లో పోటీపడినట్లే పుస్తకాలు చదవటంలో పోటీపడతారు.

చిత్రం...ప్రపంచవ్యాప్తంగా 77.4 కోట్ల మంది ప్రజలు పుస్తకం చదవటల్లేదని యూనెస్కో సర్వేలో వెల్లడైంది. ఆఫ్రికాలోని ప్రజలకు
సొంత పుస్తకాలు అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయి.