పర్యాటకం

అభయప్రదాత.. అవనిగడ్డ లక్ష్మీనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు ఒక్కడే అయనా ఎవరి విశ్వాసా నికి తగ్గట్టు వారు భగవంతుణ్ణి శివునిగాను, విష్ణువుగాను, బ్రహ్మగాను, పరాశక్తిగాను అభి వర్ణిస్తారు. వారి భక్తి సామ్రాజ్యంలో మహా విష్ణువును సర్వాంతర్యామిగా భావించి ఆయన దశావతారాలను వర్ణిస్తూ కొందరు ఎన్నో కావ్యాలు కథలు అల్లారు. మరికొందరు వైష్ణవాలయాలను వారి అభిరుచికి తగ్గట్టుగా కట్టారు. మహాశివుని పూజించేవారు శివుని అవతారాలను వర్ణిస్తూ శివాలయాలను నిర్మించారు. శివక్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలే కాక ఆదిపరాశక్తి క్షేత్రాలు కూడా ఉన్నాయ. అష్టాదశపీఠాలు, పంచలక్ష్మీ నారాయణ క్షేత్రాలు, పరశురామక్షేత్రాలు, పంచభూత లింగక్షేత్రాలు, జ్యోతిర్లింగక్షేత్రాలు, భావనారాయణ క్షేత్రాలు ఇలా ఎన్నో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు లెక్కపెట్టలేనన్ని క్షేత్రాలు మన భారతదేశంలో ఉన్నాయ. వాటిల్లో అవనిగడ్డ, నడకుదురు, నల్లూరు, రాచూరు- పెద్దముత్తేవి ఈ ఐదింటిని పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలంటారు. పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలలో అవనిగడ్డ నల్లూరు ఉండగా ఈ రెంటిని మరల ఉభయ నారాయణ క్షేత్రాలుగా అభివర్ణించారు. దివిసీమ అవనిగడ్డలో శ్రీ లక్ష్మీనారాయణస్వామివారిని శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించిఉన్నారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరులో కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించడంతో ఈ రెండు గ్రామాలు ఉభయ నారాయణ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయ.
అవనిగడ్డకు విశేషమైన స్థలచరిత్ర కూడా ఉంది. ఓసారి శ్రీరామచంద్రమూర్తి తన కులగురువగు వశిష్ఠుని ఆశ్రమంలో తన భార్యయైన సీతాదేవికి ధర్మశ్రవణము చేయించారు. దానివల్ల నేటి అవనిగడ్డను ‘అవనిజాపురం’ తర్వాత ‘అవనీపురం’గా పిలిచే వారు. కాలక్రమేణ అవనిజాపురమే నేడు అవనిగడ్డగా మారింది. నాడు సీతాయిలంక అని వశిష్ఠాశ్రమమును వశిష్టమెట్ట అని, వ్యాఘ్య్రమహర్షి ఆశ్రమాన్ని వ్యాఘ్రేశ్వరపురంగా (దివిసీమ, పులిగడ్డ) పిలుస్తున్నారు.
స్కాందపురాణాంతర్గత సహ్యాద్రి ఖండ కృష్ణామహాత్య్మంలో అవనిగడ్డను ఉభయ నారాయణ క్షేత్రమని, అవనిజపురమని వ్యాఘ్రేశ్వరమని వర్ణించి ఉన్నారు.
అలాగే పెదకళ్లేపల్లిని దక్షిణకాశి అని దానికి పశ్చిమాన సీతారాములు నివసించిన క్షేత్రాన్ని ‘సీతారామ పురమనీ’ నాటి సీతారామ పురమే నేటి అయోధ్య అని పిలుస్తుంటారు.
అవనిగడ్డలో వున్న శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం చారిత్రక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆలయ శిల్పకళా వైభవానికి నిలయం. ఆలయం ముందు ఉన్న గాలిగోపురం శాతవాహనుల కాలంలో ప్రసిద్ధమైన రేవుపట్టణం. శ్రీ లక్ష్మీనారాయణ, రాజశేఖర, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. తొలుత శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన స్థలమునకు ‘లక్ష్మీపతిలంక’ అని పేరు. ఆ ఆలయాలు ఎప్పుడో నదీపాతమైనవి. ఈ ఆలయ గోపురాలను రెండవ కులోత్తుంగ బోడగొంక దేవుడు ప్రతిష్ఠించినట్టు చారిత్రికాధారాలు చెబుతున్నాయ. దానితోనే ఈ స్వామిని ‘చోడ నారాయణ దేవర’ అనీ అంటారు. ఆలయం క్రీ.శ. 1060 ప్రాంతంలో కట్టబడింది. ఆలయంలో ఆరు శిలాశాసనాలు లభ్యవౌతున్నాయ.
ఈ దేవాలయ స్తంభాలు కృష్ణానదిలో కలసి పోయాయని అట్లా కలువగా మిగిలిన స్తంభాలు ఇపుడు కనిపించేవని అంటారు. ఈ స్తంభములనిండా రామాయణ, భాగవతములు చిత్రితములై చూపరులను ఆకట్టుకుంటాయ.
దక్షిణ మండప పైభాగమున శ్రీరామ పట్ట్భాషేకం, దీనికింద సుందరమైన గజలక్ష్మి విగ్రహం రూపం కనిపిస్తుంది. హయగ్రీవాది మహామంత్రములు దేవనాగరిక భాషలోను, వేంగి లిపిలోను, హళ కన్నడములోను చెక్కి ఉన్నారు.
ఒక రాతి కొలనును ఏక రాతిలో చెక్కడం చూస్తే ఆనాటి శిల్పుల శైలీ విన్యాసాలు ఎంత గొప్పవో కన్నులకు కట్టుతాయ. ఇవేకాక దక్షిణోత్తర పార్శ్వములలో ఏనుగులను అశ్వములను అమర్చి చక్రములోని ఇరుసులు గిరగిర తిరుగునట్లు నిర్మిం చారు. ఇటువంటి శిల్పము సింహాచలంలో మనకు కన్పిస్తాయ. గోష్టీ మండపమును డోలోత్సవము కొరకు నాలుగు స్తంభములుపైన 4 సింహములు అమర్చబడి వున్నాయి. ఈ కట్టడాల్లోని అమరిన మూర్తులు, జంతువులలో చిత్రకళలో జీవకళ ఉట్టిపడుతుంటుంది. ఆలయం ముందు 99 అడుగుల ఎత్తుగల ఏడు అంతస్తుల గాలిగోపురం ఉంది. దీనికింద స్తంభములు ఉన్నాయి. దీనిపైన లక్ష్మీనృసింహ గరుడ-పంచ ముఖముగ చక్కని విగ్రహకట్టు గలదు. ఈ ఆలయానికి వెనుక కృష్ణానది ప్రవహించినపుడు నారాయణ ఘట్టమని పిలిచేవారట. దానికే శ్రీవాసుదేవానంద సరస్వతీస్వాములు వారు నారాయణ సరస్సని పేరుపెట్టారని ఇక్కడి వారు చెబుతారు. శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలోనే ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంది.
రాజముఖీ హనుమంతస్వామి
గాలిగోపురం ఉత్తరంవైపు ముందు భాగాన రాజముఖీ హనుమంతమను వీరాంజనేయ విగ్రహం ఉంది. ఈ స్వామిని దర్శించిన అనంతరమే ఆలయ ప్రవేశం చేస్తారు. పండిత పరిషత్‌లు- వేద పరీక్ష- కవితాగోష్టులు సంగీత సభలు నాటక ప్రదర్శనములు ఈ గోపురం ముందు వీరాంజనేయ సన్నిధిన అతి ప్రాచీనకాలంనుండి జరుపుతారని ఇక్కడి నివాసితులు చెబుతారు.
ఈ వీరాంజనేయునికి దర్శించి మొక్కినట్లయతే అనుకొన్న విద్యలన్నీ కరతలామలకంగా అబ్బుతాయని అంటారు. ఏ పరీక్షలోనైనా ఈ వీరాంజనేయుని అనుగ్రహంతో విజయాన్ని పొందవచ్చునని అంటారు. ఇక్కడ జరిగే పండితగోష్ఠుల్లో పాల్గొనేవారు ఈ స్వామికి నమస్కరించితే వారు ఈ పండితసభల్లో అఖండ విజయాన్ని చవిచూసేవారని చెబుతారు. ఇప్పటికీ నేటి విద్యార్థులందరూ అపారవిద్యా సంపన్నుడైన శ్రీ రాజముఖీ హనుమంతుని నమస్కరించి విజయులై వారి అభిలాషను పూరి తచేసుకొంటారనే నానుడి ఇక్కడ ప్రాచుర్యాన్ని పొంది ఉంది.

- చివుకుల రామమోహన్