ఆంధ్రప్రదేశ్‌

ఇదెక్కడి న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డెక్కిన మిర్చి రైతు
సిండికేట్లతో ధరలు మరింత పతనం
కేంద్రం మద్దతుపై అందని మార్గదర్శకాలు
గుంటూరు యార్డులో లోడు లారీలతో నిరసన

గుంటూరు, మే 4: దేవుడు వరమిచ్చినా.. అనే చందంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చికి మద్దతు ధర ప్రకటించినా వ్యాపారుల సిండికేట్ కారణంగా ధరలు మరింత పతనమయ్యాయి. దీంతో గురువారం గుంటూరు యార్డు వద్ద పెద్ద ఎత్తున రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. చిలకలూరిపేట-గుంటూరు మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సుమారు గంటకు పైగా ఆందోళన చేసిన రైతులు, చివరికి అధికారుల హామీతో విరమించారు. గతనెల 20 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా క్వింటాల్‌కు గరిష్ఠంగా 8 వేల ధర ప్రామాణికంగా 15 వందల రాయితీతో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మిర్చి తరలించారు. యార్డులో ప్రస్తుతం 6 లక్షల టిక్కీల నిల్వలు పేరుకు పోయాయి. కొనుగోళ్లు చేసిన మిర్చిని కూడా వ్యాపారులు యార్డులో ఉంచడంతో అదనపు లోడు నిల్వచేసే అవకాశాలులేవు. దీంతో యార్డు పాలకవర్గం సెలవులు ప్రకటిస్తోంది. కొత్తగా యార్డుకు సరకు తీసుకు రావద్దని వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని కొద్దిరోజులుగా మార్కెటింగ్ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆలస్యం చేస్తే మద్దతుధర వర్తించదనే భయంతో రైతులు రవాణా కొనసాగిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి క్వింటాల్‌కు 5వేలు, రవాణా ఖర్చుల కింద 1250 చెల్లిస్తామని కేంద్రం ప్రకటించింది. కేంద్రం మద్దతుధర ప్రకటించి 24 గంటలు తిరక్కముందే వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాల్ 15 వందల నుంచి 2500 రూపాయల వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు యార్డు వద్ద లోడు లారీలతో బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరకు సంబంధించిన విధి, విధానాలు ఇంకా ఖరారు కాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. నాణ్యత కలిగిన మిర్చికే మద్దతుధర వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. అదీ ఈనెల 30వ తేదీ వరకే అమలులో ఉంటుందని తెలియటంతో రైతులు రోడ్డెక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా జూన్ నెలాఖరు వరకు కేంద్రం మద్దతు ధర పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో వేసవి సెలవులు ప్రకటిస్తారు. తిరిగి వచ్చేనెల 11వ తేదీన యార్డులో కొనుగోళ్లు పునరుద్ధరణ జరుగుతాయి. తమకు వెసులుబాటు కల్పించినట్టే కల్పించి నెలరోజులు సెలవుప్రకటిస్తే ఏ రకంగా గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, పల్నాడు ప్రాంతాలకు చెందిన రైతుల ఆవేదనకు అంతులేదు. కేంద్రం ప్రకటించిన మద్దతుధర, రాష్ట్ర ప్రభుత్వం రాయితీతో కలుపుకుని ప్రతి ఒక్క క్వింటాల్‌కు 7750 రూపాయల ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. త్వరలో విధి విధానాలను కేంద్రం ప్రకటిస్తుందని, ఈలోపు రాష్ట్ర ప్రభుత్వ రాయితీతో మిర్చిని అమ్ముకోవాలని మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు రైతులను కోరారు. మిర్చి రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, మార్కెటింగ్ అధికారులు, యార్డు పాలకవర్గంతో కలెక్టర్ కోన శశిధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాపారులు రైతులకు సహకరించాలన్నారు. యార్డులో ఎప్పటికప్పుడు సరకును తరలించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.నాణ్యతా ప్రమాణాలు కలిగిన మిర్చికి ధర తగ్గిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల కొద్దిపాటి నష్టం కలిగిందని, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోక ముందే యార్డును ఖాళీ చేయాలన్నారు.

chitram...

గుంటూరు యార్డు వద్ద మిర్చి లారీలతో ఆందోళనకు దిగిన రైతులతో మాట్లాడుతున్న అధికారులు