మెయిన్ ఫీచర్

ఔషధ పంటల హరివిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి సేద్యంలో పాఠాలు
రెండు వేల మొక్కలతో నర్సరీ
ముదిమి వయసులోనూ తగ్గని ఆసక్తి
స్ఫూర్తినిస్తున్న మాజీ ఉద్యానవన
అధికారిణి కుసుమ

ఆమెకు మొక్కలంటే ప్రాణం.
రోగాలకు చెక్‌చెప్పే ఔషధ మొక్కల పెంపకమంటే ఇష్టం. ఆసక్తి ఉన్నవారికి పాఠాలు చెప్పడం అంటే మరీ ఇష్టం. సొంతంగా ఓ నర్సరీని, ఓ సంస్థను నడుపుతున్న ఆమె ఓ పర్యావరణ ప్రేమికులకు ప్రేరణ.
***
రెండంతస్తుల మేడ అది. రకరకాల పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో ఆ ఇంటి ఆవరణ స్వాగతం పలుకుతూంటుంది. సిమెంట్ తొట్లలో పెంచే కూరగాయ మొక్కలు, తీగజాతి కూరలు, పండ్ల చెట్లు రకరకాల పళ్లతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తాయి. ఎన్నో జబ్బులను నయం చేసే ఔషధ మొక్కల గని అది. పచ్చటి మొక్కతోనే ఈ ప్రపంచాన్ని పదికాలాలపాటు పదిలంగా కాపాడుకోవచ్చని త్రికరణశుద్ధిగా నమ్మిన అరవై ఏళ్ల కుసుమ దహివాల్కర్ పొదరిల్లు అది. మహారాష్టల్రోని నాసిక్ ఉద్యానవన శాఖ అధికారిణిగా పనిచేసి పదవీ విరమణ పొందిన కుసుమ ముదిమి వయసులోనూ ప్రకృతి సేద్యంపై పాఠాలు చెబుతూ పలువురికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఆమె ఇంటికి వెళితే పచ్చటి మొక్కలు రమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి. పసిప్రాయం నుంచి మొక్కలతో మమేకమైన ఆమె అనుబంధం జీవిత చరమాంకం వరకు వాటి ని పెంచుతూనే ఉండాలన్నది ఆమె కోరిక. అందుకే పదవీ విరమణ తరువాత వచ్చిన డబ్బుతో ఊరి చివర అర ఎకరం భూమి కొనుగోలు చేసి ఆయుర్వేద మొక్కల నర్సరీ, ఓ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు.
అందం.. ఆరోగ్యం
కుసుమ దహివాల్కర్ ఇంటి వాతావరణం అందం.. ఆరోగ్యంతో ఆహ్లాదకరంగా ఉం టుం ది. నిశ్శబ్ద వాతావణంలో వాయుకాలుష్యం లేకుం డా మానసిక ప్రశాంతత చేకూర్చేలా ఉంటుంది. రెండున్నరేళ్ల మనవరాలు యశశ్రీని ఎత్తుకుని మొక్కల గురించి ఆ చిన్నారికి చెబుతూ వాటి సంరక్షణలో ఆమె నిమగ్నమవుతూంటారు. నేటీ కాంక్రీట్ జంగిల్ కాలం లో మొక్క లు, జంతువులను పిల్లలు టీవీల్లోనూ, బొమ్మల్లోనే చూస్తా రు. కాని యశశ్రీకి అలాంటి బాధ లేదు. మొక్కలు, ఇక్కడ పూచే పూల కోసం వచ్చే రకరకాల సీతాకోకచిలుకు లు, కీటకాలు, రంగు రంగుల పక్షులు తదితర వాటిని ప్రత్య్పుక్షంగా చూస్తూంటుంది. నేర్చుకుంటుంది.
పసి వయసు నుంచే..
కుసుమ దహివాల్కర్‌కు చిన్నప్పటి నుంచి మొక్కలతో అనుబంధం ఉంది. ఆమె కుటుంబం సభ్యులంతా గుజరాత్- మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన నిజార్‌లో ఆయుర్వేద పం డింట్లు. దీంతో మొక్కలు, వేర్లు, పూలను చూస్తూ పెరుగుతూ ప్రకృతితో మమేకమయ్యారు. అదృష్టం కొద్దీ ఉద్యానవన శాఖ అధికారిణిగా పనిచేయటం, రైతులకు వాటికి సంబంధించిన విషయాలు చెప్పటం వల్ల ఆమెకు ప్రకృతి సేద్యం పట్ల మరింత అభిలాష ఏర్పడింది. అందుకే ఈ వయసులోనూ ప్రకృతి పాఠాలను పదిమందికి తెలపాలనే ఉద్దేశ్యంతో ఊరు శివారులో అర ఎకరం భూమి కొనుగోలు చేసే నర్సరీని ఏర్పాటు చేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో లభ్యమయ్యే వివిధ జాతుల ఆయుర్వేద మొక్కలను అక్కడ పెంచుతున్నారు. అంతేకాదు యాభైమంది కూర్చునే విధంగా ఓ ప్రాంగణాన్ని నిర్మించారు. ఇక్కడ వర్క్‌షాపులు నిర్వహిస్తు ఆయుర్వేద మొక్కల విశిష్టతను, ఇళ్లల్లో మొక్కల పెంపకం గురించి వివరిస్తుంటారు. బం ధువులు, సన్నిహితులు మొక్కల కోసం ఇంత స్థలాన్ని వృథా చేయవద్దని ఒత్తిడితెచ్చి నా.. నాకు చిన్నప్పటి నుం చి ఇలా నర్సరీ, ఇన్‌స్టిట్యూట్‌ను నడపాలనే అభిలాష ఉండటం వల్ల ఎంతోమంది ఒత్తిడి తేవ టం వల్ల ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు.
సదస్సులకు స్పందన
కుసుమ నిర్వహించే వర్క్‌షాపులకు పర్యావరణ ప్రేమికలు విపరీతంగా వస్తుంటారు. కాసేపు కుసుమతో మాట్లాడితే చాలు మొక్కల పెంపకంపై మక్కువ తప్పకుండా పెరుగుతుందని బాబర్ అనే న్యాయవాది అంటారు. ఆయుర్వేద వైద్యు లు సైతం ఈ నర్సరీని సందర్శిస్తుంటారు. బీపీ, షుగర్, దగ్గు తదితర రోగాలతో బాధపడేవారు ఈ నర్సరీకి వచ్చి కావల్సిన మొక్కలను తీసుకువెళ్లి పెంచుకోవటమే కాదు వాటి నుంచి విముక్తి పొందుతున్నారు. వరండాలో ఎన్నో రకాలు తులసి మొక్కలు ఉంటాయి. సుబాబుల్, యూకలిఫ్టస్ వంటి చెట్లు సైతం ఇక్కడ పెంచుతారు. ఈ పచ్చటి మొక్కలకు సీతాకోకచిలుకలు, పలురకాల పక్షులు, కీటకాలు వస్తుంటాయి. ఇలా ప్రకృతితో అనుబంధాన్ని పెంచుకుని నలుగురికి ఈ విషయాలను వెల్లడిస్తూ తన శేష జీవితాన్ని గడుపుతున్నారు.