మెయన్ ఫీచర్

యుఎస్-రష్యా చర్చలతోనే శాంతి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల అధినేతలు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తుంటే అది యాదృచ్ఛికం కాదని, కావాలనే ఆవిధంగా వ్యవహరిస్తున్నారన్నది అవగతమవుతుంది. ఇందుకు ఉదాహరణగా బ్రిటన్‌కు చెందిన న్యాయమూర్తి ఒకరు రష్యా మాజీ గూఢచారి హత్యకు సంబంధించిన కేసులో ఇచ్చిన తీర్పును వివరించవచ్చు. ‘‘మాజీ రష్యా గూఢచారి అలెగ్జాండర్ లిట్వెనెన్కోను ఇద్దరు రష్యా ఏజెంట్లు హత్య చేశారన్నది అక్కడ కనిపిస్తున్న అప్రత్యక్ష సాక్ష్యాలను బట్టి చూస్తే తెలుస్తున్నది. లండన్‌లోని ఒక హోటల్‌లో, రష్యన్ ఏజెంట్లు అతనికి రేడియోథార్మిక ఫ్లూటోనియంను టీలో కలిపి ఇవ్వడం ద్వారా హతమార్చారన్నది అర్ధమవుతోంది. ‘బహు శా’ దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతి ఉండి ఉండవచ్చు,’’ అని తన తీర్పులో పేర్కొంది. టీ తాగిన తర్వాత 22 రోజులకు అలెగ్జాండల్ లిట్వెనెన్కో మరణించాడు.
ఇక రెండవది బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, రష్యన్లతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నారు. సిరియా సంక్షోభమే ఇందుకు ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అంటే మాటలో స్నేహం, హృదయంలో కరుకుదనం నిండిన వ్యవహారశైలిని బ్రిటన్ ప్రధాని పుతిన్ పట్ల ప్రదర్శిస్తున్నారు. ఇక తర్వాతి వంతు, అమెరికా వాణిజ్య అధికారి, ఆడమ్ జుబిన్‌ది. ‘చాలాకాలంగా పుతిన్ బహుశా అవినీతికి పాల్పడుతున్నారనే చెప్పాలి’.. అన్నాడు.
కామెరూన్ వ్యవహారశైలిపై రష్యా స్పందన ఊహించిన విధంగానే ఉంది. ‘‘ఒక పశ్చిమ దేశానికి చెందిన ప్రధానమంత్రి, మాజీ అగ్రరాజ్యానికి అధినేతగా ఉన్న వ్యక్తితో వ్యవహరించాల్సిన విధానం ఇదేనా?’’ అంటూ తీవ్రంగా స్పందించింది. అయితే అమెరికా ప్రభుత్వ ఆశీస్సులతో ఆ దేశ వాణిజ్య అధికారి చేసిన విమర్శను మాత్రం ఎందుకనో రష్యా తిప్పికొట్టలేదు. బహుశా వాటిని పట్టించుకొని ఉండకపోవచ్చు. పై సంఘటనలను పరిశీలిస్తే..అసలు పుతిన్‌ను ఎందుకని రాక్షసుడిగా చిత్రించే యత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇందుకు సమాధానం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ ప్రస్తుతం రష్యా- పశ్చిమ దేశాల మధ్య కొరుకుడు పడని సమస్యగా ఉంది. ఉక్రెయిన్ పశ్చిమప్రాంతంలో రష్యా వ్యతిరేక ఉద్యమాలు చోటు చేసుకోగా, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా అనుకూల తీవ్రవాదులకు పుతిన్ మద్దతు పలుకుతున్నారు. చివరకు క్రిమియాను రష్యా తనలో కలిపేసుకోగానే, పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. క్రిమియా ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగం. అప్పటి సోవియట్ యూనియన్ అధినేత నికిత కృచ్చేవ్ క్రిమియాను ఉక్రెయిన్‌కు బహుమానంగా ఇచ్చారు.
ఇక పశ్చిమ దేశాలతో రష్యా స్నేహసంబంధాలు ఇప్పటి వరకు అనేక దశలు దాటాయి. చివరకు గోర్బచేవ్ కాలంలో, పెరిస్త్రోయికా, గ్లాస్‌నాస్త్ పేరుతో ప్రకటించిన సంస్కరణల నేపథ్యంలో సోవియన్ యూనియన్ విచ్ఛిన్నమై అనేక చిన్న దేశాలుగా విడిపోవడంతో పశ్చిమ దేశాలకు ఎదురు లేకుండా పోయింది. నిజంగా వాటికి కావలసింది కూడా అదే. ఇక యూరోపియన్ దేశాలు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తూర్పు యూరప్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు దేశాలను, యూరోపియన్ యూనియన్ దేశాలు తమ కూటమిలో చేర్చుకోవడం మొదలు పెట్టాయి. ఇక రష్యా సమాఖ్యకు అతి సమీపంలో ఉన్న ఉక్రెయిన్‌ను కూడా కలుపుకోవడం కోసం కాచుక్కూర్చున్నాయి. రష్యాకు ఆనుకొని ఉన్న ఉక్రెయిన్, మత, సాంస్కృతిక, భాషాపరంగా రష్యాకు అత్యంత సన్నిహిత దేశం. మరి ఉక్రెయిన్ కోసం ఆబగా ఎదురుచూస్తున్న యూరోపియన్ దేశాలు తమకు గతంలో జార్జియా, మాల్డోవాల్లో ఎదురైన పరాభవాలనుంచి పాఠాలు నేర్వకపోవడం గమనార్హం. ఈ రెండు దేశాల విషయంలో ప్రాంతీయ ప్రయోజనాలకోసం పోరాటానికి అప్పట్లో రష్యా సిద్ధమైంది కూడ.
ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిపోయింది కనుక ఇక రష్యా బుద్ధిగా పశ్చిమ దేశాల్లో అమల్లో ఉన్న సరళీకృత ప్రజాస్వామ్యాన్ని అనుసరించక తప్పదని యూరోపియన్ యూనియన్ దేశాలు భావించాయి. అందుకనుగుణంగానే నాటి రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్‌స్తిన్, పశ్చిమ దేశాలతో వ్యవహరించిన శైలి కూడా ఆ దేశాల్లో పై భావనే దృఢంగా నాటుకొని పోవడానికి కారణమైంది. అమెరికా వైఖరి ఇందుకు పూర్తి భిన్నం. ప్రపంచ వ్యాప్తంగా తమ పలుకుబడిని బలీయంగా విస్తరింపజేయడానికి ఏవిధమైన అడ్డంకులు లేవన్న భావనలో యుఎస్ ఉండిపోయింది. అమెరికాకు చెందిన పెట్టుబడిదార్లు, ఎల్‌స్తిన్ నాయకత్వంలోని రష్యాకు క్యూలు కట్టారు. కానీ అమెరికా కలలు కల్లలు కావడానికి ఎంతోకాలం పట్టలేదు. వారు భావించినట్టు రష్యా సోమరి కాదని వారికి స్పష్టం కావడం మొదలైంది. ఎల్‌స్తిన్ తర్వాత అధికారంలోకి వచ్చిన పుతిన్ అప్పటి వరకు గాల్లో తేలిపోతున్న అమెరికాకు గట్టి సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. సూపర్ పవర్ స్థాయి నుంచి రష్యా ఒక్కొక్కమెట్టే కిందికి దిగజారుతున్నదన్న భావనలో ఉన్న అమెరికన్లకు పుతిన్ వ్యవహారశైలి ఏమాత్రం మింగుడుపడలేదు.
మాస్కోలో నేను సోవియన్ యూనియన్ యుగంలో విదేశీ కరస్పాండెంట్‌గా వ్యవహరించిన కాలానికి, ఎలిస్తిన్ కాలానికి చాలా తేడా కనిపించింది. ఎలిస్తిన్ పశ్చిమ దేశాల తరహాలోని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి వార్షిక సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినప్పటికీ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. ఎలిస్తిన్ సకుటుంబంగా పాల్గొన్న ఆ కార్యక్రమాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. అయితే వీటిపై వాషింగ్టన్ ఏవిధమైన విమర్శలకు దిగకుండా దూరంగా ఉండిపోయింది. ఇక పశ్చిమ దేశాల మీడియా కూడా అంచనాలకతీతంగా రష్యా పట్ల వ్యతిరేకతను ప్రదర్శించలేదు.
పుతిన్ విలాసవంతమైన జీవితం గురించి ఛలెసియా యజమాని రోమన్ అబ్రమోవిచ్ ఒక నివేదికను తయారుచేశారు. ఈ నివేదిక గురించి అమెరికా చెబుతున్న దాని ప్రకారం పుతిన్‌కు ఒక విలాసవంతమైన నౌక ఉన్నది. దాని ఖరీదు 45 మిలియన్ల పౌండ్లు. ఈ విలాసవంతమైన నౌక నిర్వహణ సాతం రష్యా ప్రభుత్వమే భరిస్తుందట! నిజానికి అమెరికా సన్నిహిత దేశాలు, ఇతర స్నేహదేశాలు పుతిన్ గురించి చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి. మరి వీరి ప్రచారంలో చిత్తశుద్ధి ఎంతనేది కూడా ఆలోచించాల్సిందే. అయితే పశ్చిమ దేశాలు ఎందుకని పుతిన్‌ను ఒక అవినీతి పరుడిగాప్రచారం చేస్తున్నాయనే ప్రశ్నకు సమాధానం లభించాల్సి ఉంది.
ప్రస్తుతం పశ్చిమ దేశాలు మాస్కోతో సంబంధాల విషయంలో తీవ్ర నిరుత్సాహంతో ఉన్నాయనేది మాత్రం తిరుగులేని సత్యం. రష్యా కూడా ఇప్పుడు తీవ్ర కష్టాల్లో పీకల్లోతు కూరుకుపోయ ఉంది. ముడిచమురు ధరలు దారుణంగా పడిపోయాయి. మరోవైపు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ రష్యాను ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఇంతటి తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ సిరియాలో ప్రత్యక్షంగా కలుగజేసుకోవడానికి రష్యా ఎంతమాత్రం వెనుకాడలేదు. సిరియా అంతర్యుద్ధ పలితం తేల్చడంలో రష్యా ప్రధాన పాత్ర వహిస్తోంది. యుద్ధం మిగిల్చే విషాదాన్ని తలకెత్తుకోవడానికి పుతిన్ సిద్ధంగా లేరు. నిజంగా అమెరికాకు నిజాయతీ ఉంటే, పుతిన్‌తో చర్చలు జరిపి అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు యత్నించాలి. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా కనీస కర్తవ్యమిది. చర్చలు లేకుండా ప్రపంచ శాంతి ఎలా సాధ్యం? సిరియా సంక్షోభానికి ఒక ముగింపు పలకడం తక్షణావసరం. ఇప్పటికే లక్షలాది మంది శరణార్ధులు యూరోపియన్ దేశాలకు వలస వెళ్లారు. వెల్లువలా వచ్చిపడుతున్న శరణార్థులను అంగీకరించనూలేక, అట్లాగని వెళ్లగొట్టనూ లేక యూరోపియన్ యూనియన్ దేశాలు సతమతమవుతున్నాయి. ఊరుకుంటే అంతకంతకూ పెరుగుతున్న శరణార్థులతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కావడంతోపాటు, జనాభాపరంగా పలు మార్పులు చోటుచేసుకునే పరిస్థితి దాపురించింది. అందువల్ల సిరియా సమస్యకు తక్షణ పరిష్కారం కనుకొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు రష్యా సహకారం లేకుండా అసలు సాధ్యం కాదు.
నిజానికి ఈ విషయంలో అమెరికా విద్యావేత్తలు వాస్తవిక కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఉక్రెయిన్ నాయకత్వం తన బలాన్ని సరీగ్గా అంచనా వేసుకొని, మిన్‌స్క్-2 ఒప్పందం ప్రకారం తూర్పు ప్రాంతానికి స్వాతంత్య్రం ప్రకటించాలని వారు సలహా ఇస్తున్నారు. ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలన్న విషయంలో రష్యా తన వైఖరిని సడలించుకుంటోంది. ఇక రెండవది క్రిమియాను ఆక్రమించడం వల్ల రష్యా సరిహద్దులను గౌరవించాలన్న అంశాన్ని ఉల్లంఘించినట్లు అవుతోంది. కానీ క్రిమియాను రష్యా తిరిగి ఇస్తుందన్న ఆశ ఎవరిలో ఏ కోశానా లేదన్నది వాస్తవం. అందువల్ల క్రిమియాను రష్యాలో అంతర్భాంగంగా అంగీరించక తప్పదు. ఇందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు. అక్కడ నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి కావడమే అందుకు ప్రధాన కారణం.
ఇక సిరియా సమస్య పశ్చిమ దేశాలకు కొరకరాని కొయ్యగా మారింది. దీనివల్ల రష్యాతో వాటికి సరికొత్త సంఘర్షణాత్మక పరిస్థితి ఏర్పడింది. రష్యా ప్రత్యక్ష ప్రమేయంతో ఇప్పటికే సిరియా అధ్యక్షుడు బషర్-అల్- అసాద్ మరింత బలోపేతమయ్యాడు. దీనివల్ల ఆయనకు చర్చల్లో మంచి గట్టిగా బేరసారాలాడే అవకాశం దక్కింది. ఏది ఏమైనప్పటికీ శాంతి నెలకొల్పడానికి సమయం ఆసన్నమైందన్నది మాత్రం సత్యం.

-ఎస్. నిహాల్ సింగ్