మెయిన్ ఫీచర్

మొటిమలపై పోరాటం.. యువత ఆరాటం (అందమె ఆనందం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసారి నా దగ్గరకి 24 ఏళ్ల కుర్రాడొచ్చాడు కన్సల్టేషన్‌కి. చాలా ‘డల్’గా ఉన్నాడు. ‘ఏమైంది బ్రదర్..?’ అని ఆసక్తిగా అడిగా. ‘పండక్కి ఇంటికి వెళ్లా.. చాలా ఆనందంగా ఇంటికెళ్లిన నాకు అక్కడ నిరాశ ఎదురైంది. నా గర్ల్‌ఫ్రెండ్ నాతో విడిపోయింది’- అని కన్నీరు పెడుతూ చెప్పాడు. ‘మీరు విడిపోవటానికి కారణం ఏమిటి?’ అని ఆరా తీస్తే- అప్పటిదాకా తలదించుకొని వౌనంగా మనసులో బాధపడుతున్న అతడు ఒక్కసారి తలఎత్తి- ‘మీకు కనిపించిందా..?’ అని అడిగాడు. తన రియాక్షన్ నన్ను కదిలించింది. తన ముఖమే తన ప్రాబ్లమ్. ముఖం నిండా మొటిమలే. కుడి చెంపపై Eastern Ghats లా, ఎడమ చెంపపై Western Ghatsలా, నుదుటిపై Himalayaల్లా మొత్తం మొహాన్ని మొటిమలు ఆక్రమించేశాయి. ఇది ఆ అబ్బాయి కథ.
అయితే- ఓ అమ్మాయి వ్యధ ఇలా ఉంది...
చాలామంది నేటితరం అమ్మాయిల్లానే ఆ యువతికీ ‘21వ సెంచరీ జబ్బు’ సోకింది. దాని పేరే సెల్ఫీస్. మాటిమాటికీ సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుని, ఫేస్‌బుక్‌లో లేదా ట్విట్టర్‌లో అప్‌డేట్ చేయాలనే జబ్బు. ఒకప్పుడు రోజుకి ఇరవై సెల్ఫీలు తీసుకునే ఈ అమ్మడు మూడు నెలల నుంచి ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు. కారణం- ముఖం నిండా మొటిమలు. ఇలానే ఉంటే పెళ్లికాదేమో..? అన్నది వాళ్ళమ్మ బాధైతే, ఇక సెల్ఫీలు తీసుకోలేనన్నది అమ్మాయి వ్యధ. మొటిమల్ని నిర్మూలించడానికి తన కూతురు పడుతున్న కష్టాల్ని సమర్థిస్తూ వాళ్లమ్మ ఇలా అంది. ‘నా కూతురు మొహానికి పేడ తప్ప మార్కెట్‌లో దొరికే అన్ని క్రీములూ వాడేసింది. అయినా తగ్గలే..’
ఫొటో దిగాలంటే భయం.. పదిమందిని కలవాలంటే బెరుకు.. విందులు, వినోదాలకు వెళ్లాలంటే బిడియం.. పాఠాలు నేర్చుకోవడానికి కాలేజీకి వెళ్లాలంటే దడ.. ఈ భయం ఆమెలో నానాటికీ కొండలా పెరిగిపోతోంది. కొన్ని కేసుల్లో కుంగుబాటు (డిప్రెషన్), Extreme కేసుల్లో (sucidal tendencies) ఆత్మహత్యల ధోరణి కనిపిస్తుంది. ఇంతలా భయపెట్టే ఈ చర్మవ్యాధి పేరు ‘అక్నీ’.
అక్నీ అంటే : మొటిమలు (pimples), ప్యూబర్టీ తరువాత హార్మోనల్ మార్పుల వల్ల అందరిలోనూ వస్తాయి. మొదట కొద్దికొద్దిగా వచ్చి వారం లేక పదిరోజుల్లో తగ్గిపోతాయి. కానీ, కొంతమందిలో ఈ మొటిమలు తగ్గవు సరికదా మరీ ఎక్కువవుతాయి. వాపువల్ల ఎర్రగా అవుతాయి, పెద్దగా పెరుగుతాయి. మొటిమలు చిట్లిపోయి వాటి నుంచి చీము మొహంపై కారుతూ అంతటా వ్యాపిస్తాయి. ఇలా మారే మొటిమలనే షశళ అంటారు.
మొటిమలు ఎందుకు వస్తాయి? : మన చర్మం ఎండిపోకుండా మన శరీరం ‘సీబమ్’ అనే నూనెని తయారుచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న రంధ్రాల నుంచి బయటకు వచ్చి చర్మాన్ని పొడిబారనీయకుండా కాపాడుతుంది. ఈ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు (Black heads/White heads వల్ల) ‘సీబమ్’ బయటకి రాలేక చర్మం కిందే ఉండిపోయి మొటిమలు పుడతాయి. సీబమ్‌లో propionibacterium acnes అనే క్రిములు పెరగడం మొదలవుతాయి. కొంతమందిలో ఈ క్రిములు అత్యధిక సంఖ్యలో పెరిగిపోతాయి. అప్పుడు మన శరీరం ఆ క్రిముల్ని అంతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నమే వాపుకీ, చీముకి దారితీస్తాయి.
వేరే కారణాలు: ఆడవాళ్లలో poly cystic ovary syndrome ఉంటే మొటిమలు వస్తాయి. ఇక, కండలు పెంచుదామని జిమ్‌కి వెళ్లే కుర్రాళ్లు ఎవరైతే అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటారో వారిలోనూ ఇవి వస్తాయి.
ఏ వయసులో..? : 12-25 ఏళ్ల మధ్య వయసులో యువతీయువకుల్లో మొటిమల సమస్య మొదలవుతుంది. అమ్మాయిల కంటే అబ్బాయిల్లో ఎక్కువగా వస్తాయి. 20 శాతం మందిలో మొటిమలు acneగా మారుతాయి. ఇంట్లో పెద్దవాళ్లకి ఉంటే వాళ్ల సంతతికి కూడా అనువంశికంగానూ ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ. (positive family history).
ఎక్కడ వస్తాయి? : ముఖంపై 99 శాతం, వీపుపై 60 శాతం, ఛాతిపై 15 శాతం (వీపు లేదా ఛాతిపై వస్తే శిరోజాల్లో ‘చుండ్రు’ ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి)
ఎక్కువ చేసే కారణాలు : కొన్ని గర్భనిరోధక మాత్రల వల్ల (progestrogen only) ఆఢవాళ్ల నెలసరి సమయంలో ఇవి ఎక్కువ అవుతాయి. అధిక చెమటని కలిగించే పనుల వల్ల కూడా మొటిమలు ఎక్కువవుతాయి. (వంటింట్లో పొయ్యి దగ్గరగా ఉంటూ వంట చేయడం లాంటివి) షశళపై బిగువైన బట్టలు వేయడం వల్ల ఎక్కువవుతాయి.
ఏం చేయకూడదు : మొటిమల్ని గుచ్చడం కానీ , గిల్లడం కానీ చేయరాదు. ఎక్కువ సార్లు మొహం కడగడం వద్దు. రోజుకి రెండుసార్లు, అతి వేడి, అతి చల్లటి నీటిని వాడరాదు. (గోరువెచ్చని నీళ్లు వాడాలి) Abrasive soaps/Exfoliative Agents వాఢొద్దు (mild soap వాడండి). గట్టిగా మొటిమల్ని రుద్దకూడదు. (సున్నితంగా మొటిమల్ని శుభ్రం చేసుకోవాలి)
చికిత్స : మామూలు మొటిమలకి చికిత్స అక్కర్లేదు. వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ, ‘అక్నీ’ ఉంటే నిపుణుడైన డాక్టర్ని సంప్రదించడం మంచిది.
దీనికి చాలా ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవి పేషెంటుని బట్టి, మొటిమల స్థితిని బట్టి మారుతుంటాయి.
చివరిగా ఓ చిట్కా : ఘషశళ పై విజయం సాధించడానికి మూల రహస్యం ఓర్పు. కనీసం ఆరువారాలు గడవనిదే డాక్టర్ ఇచ్చిన చికిత్స పనిచేయడం లేదన్న అభిప్రాయానికి రాకండి. ఆ తరువాత కూడా మార్పులేకపోతే, వేరే చికిత్సకి మారొచ్చు. అక్నీ మానిన తరువాత మచ్చలు ఉండడం సహజం. వాటికి మళ్లీ చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. *

-డాక్టర్ రమేష్ శ్రీరంగం, సర్జన్, ఫేస్ క్లినిక్స్ సెల్ నెం: 92995 59615