మెయిన్ ఫీచర్

ఖర్చులో మగాళ్లదే పై చేయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రేమికులు స్వేచ్ఛాజీవులు.. ఆంక్షల సంకెళ్లు వారిని ఏ విధంగానూ బంధించలేవు.. ప్రేమమత్తులో తేలియాడే కుర్రకారు తమదైన లోకంలో విహరిస్తుంటారు.. ఏటా ‘వాలెంటైన్స్ డే’ వస్తోందంటే చాలు- ప్రేమైకజీవుల సంబరాలకు సరిహద్దులే ఉండవు.. ఫిబ్రవరి 14న విశ్వవ్యాప్తంగా ‘వాలెంటైన్స్ డే’ జరుపుకోనున్న తరుణంలో వారం రోజుల ముందే ‘వాలెంటైన్ వీక్’ పేరిట సర్వత్రా కోలాహలం మిన్నంటుతోంది. ఏడురోజుల పాటు వేడుకలను జరుపుకుంటూ ఎనిమిదో రోజున ‘వాలెంటైన్స్ డే’ పాటించడం ఇపుడు దేశదేశాల్లో ఆనవాయితీగా మారింది. ఈ వారం రోజుల్లోనూ ప్రేమికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా గడుపుతారు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాకొలెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే పేరిట సంతోషాన్ని పంచుకుంటూ 14వ తేదీన ‘వాలెంటైన్ డే’తో సంబరాలకు తెరపడుతుంది.

‘వాలెంటైన్స్ డే’ సంబరాల సందర్భంగా కానుకలు కొనడంలో, డబ్బు ఖర్చు చేయడంలో మహిళల కంటే మగరాయుళ్లే ముందంజలో ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. ప్రియసఖి మనసును గెలుచుకునేందుకు పడే ఆరాటంలో పురుషుడు ఎంతటి ఖర్చుకైనా సిద్ధపడుతున్నాడట! ‘గిఫ్ట్‌ఈజ్ డాట్ కామ్’ అనే ఆన్‌లైన్ వ్యాపార సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 18 నుంచి 45 ఏళ్లలోపు వయసు కలిగిన సుమారు మూడువేల మందిని వాలెంటైన్స్ డే కానుక గురించి ఆరా తీయగా మగాళ్లే బహుమతుల కోసం తెగ ఖర్చుచేసినట్లు తేలింది. దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలకు చెందిన వారు ఈ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొన్నారు. ప్రేమికుల మనోభావాలు, కానుకలు కొనే తీరు వంటి అనేక అంశాలపై ప్రశ్నించగా, 68 శాతం మంది తాము ఈ సంబరాలను భిన్నమైన రీతిలో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఏకాంతంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు 37 శాతం మంది తమ అంతరంగాలను ఆవిష్కరించారు. స్నేహితుల సమక్షంలో వేడుకలు జరుపుకుంటామని 22 శాతం మంది, తొలిసారి కలుసుకున్న సందర్భంగా మనసులు కలబోసుకుంటామని 8 శాతం మంది తెలిపారు.
మనదేశంలో పురుషుల కంటే మగువల్లోనే ‘వాలెంటైన్స్ డే’ ఉత్సవాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. అయితే, ఖర్చుకు సంబంధించి మాత్రం పురుషులదే పైచేయిగా కనిపిస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా బహుమతులు కొనేందుకు పురుషులు సగటున 740 రూపాయలు ఖర్చు చేస్తే, మహిళలు మాత్రం సగటున 670 రూపాయలు మాత్రమే కేటాయిస్తున్నారట! కానుకల ఎంపికలోనూ స్ర్తి, పురుషుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. పుష్పగుచ్ఛాలు కొనేందుకు 47 శాతం మంది, చాకొలెట్లు కొనేందుకు 27 శాతం మంది, విభిన్నమైన గిఫ్ట్‌లు కొనేందుకు 17 శాతం మంది మగాళ్లు ఉత్సాహం చూపుతున్నారని సర్వేలో తేలింది. ఇక, మహిళలకు సంబంధించి చూస్తే కానుకల ఎంపికలో వైవిధ్యం కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కొనేందుకు 37 శాతం మంది, పెర్‌ఫ్యూమ్స్ కొనేందుకు 19 శాతం మంది, దుస్తులు వంటివి కొనేందుకు 16 శాతం మంది మగువలు మనసు పడుతున్నారు. భిన్నమైన రీతిలో ప్రేమను వ్యక్తం చేసే గిఫ్ట్‌లను కొనేందుకు మాత్రం యువతులు సుముఖత చూపడం లేదు. 41 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు బహమతులను ఆన్‌లైన్ షాపింగ్, యాప్స్ ద్వారా కొనుగోలు చేస్తూ తమకు ఇష్టమైన వారికి పంపుతున్నారు. కానుకలు ఎలాంటివైనా, ఖర్చు ఎలా ఉన్నా ప్రేమానురాగాలను తెలియజేసేందుకే తాము కొనుగోలు చేస్తున్నామని అధిక శాతం మంది వెల్లడించారు. కానుకలు కొనకపోతే తమ మధ్య బంధం కొనసాగదేమోనన్న అనుమానాన్ని ప్రతి ఏడుగురు మహిళల్లో కనీసం ఒకరు వ్యక్తం చేయడం గమనార్హం. వివాహిత పురుషుల్లో 41 శాతం మంది, పెళ్లికాని యువకుల్లో 31 శాతం మంది ‘వాలెంటైన్స్ డే’కి చాలాముందుగానే బహుమతులను కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ కారణంగానే ఫిబ్రవరి మొదటి వారంలోనే షాపింగ్ మాల్స్, బహుమతులు విక్రయించే దుకాణాలు కిటకిటలాడుతున్నాయని ‘గిఫ్ట్‌ఈజ్ డాట్ కామ్’ సంస్థ చెబుతోంది.
పల్లెలకూ పాకింది...
ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన వాలెంటైన్స్ డే సంస్కృతి ఇపుడు దేశవ్యాప్తంగా చిన్న చిన్న పట్టణాలు, పల్లెసీమలకు సైతం విస్తరిస్తోంది. దీంతో కానుకలు కొనేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పుష్పగుచ్ఛాలు, చాకొలెట్లు, టెడ్డీ బొమ్మలు, స్వీట్లు, నగలు, ఆధునిక వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. సరదా పుట్టించేలా విభిన్నమైన గిఫ్ట్‌లు కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. కాగా, ఈ సంబరాలకు మరీ మితిమీరి ప్రచారం చేస్తున్నారని 42 శాతం మంది మహిళలు, 47 శాతం మంది పురుషులు అభిప్రాయపడుతున్నారు. ‘వాలెంటైన్స్ డే’ను సెలవు దినంగా ప్రకటించాలని సర్వేలో పాల్గొన్నవారిలో 15 శాతం మంది చెప్పడం గమనార్హం.
ఏడు రోజుల సంబరాలు..
ప్రేయసి తలపుల్లో తాను నిండిపోవాలని ఆశిస్తూ ప్రియుడు ఆమెకు గులాబీలు సమర్పించుకోవడమే ‘రోజ్ డే’ ఆంతర్యం. ఒకరికొకరు నచ్చినట్లు తెలియజేసేందుకే ‘ప్రపోజ్ డే’. తియ్యటి రుచులతో వేడుక చేసుకునేందుకే ‘చాకొలెట్ డే’. ఇష్టమైన వారిని ఆకట్టుకునేందుకు బొమ్మలు ఇచ్చేందుకే ‘టెడ్డీ డే’. ఎన్ని సమస్యలొచ్చినా బాసటగా ఉంటామని బాసలు చేసుకునేందుకే ‘ప్రామిస్ డే’. ఆత్మీయతను ఆలింగనం ద్వారా తెలియజేసేందుకే ‘హగ్ డే’. తీయనైన మధుర క్షణాలు నిరంతరం ఉండాలని కోరుకోవడమే ‘కిస్ డే’. చివరగా- ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయతానురాగాలను చాటుకోవడమే ‘వాలెంటైన్స్ డే’.
ఏం కొనాలి..?
‘వాలెంటైన్స్ డే’ వేడుకల నేపథ్యంలో పుష్పగుచ్ఛాలు, టెడ్డీ బొమ్మలు, కేకులు, గ్రీటింగ్ కార్డులు, ఇతర కానుకలు కొనే ప్రేమికులతో మార్కెట్లు అపుడే కళకళలాడుతున్నాయి. ‘ఆన్‌లైన్’లో సైతం ‘ప్రేమకానుకల’ను విక్రయించే సంస్థలు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ప్రేమను చాటుకోవడానికి కానుకలు కొంటే చాలదు.. ప్రేయసి ఇష్టాయిష్టాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా గిఫ్ట్ కొనడంలోనే ప్రియుడి నైపుణ్యం దాగి ఉంటుంది. ఎప్పటిలా కాకుండా కానుకలు భిన్నమైన రీతిలో ఉంటే ‘వాలెంటైన్స్ డే’ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. పుష్పగుచ్ఛాలు, చాకొలెట్ బాక్సులు, గ్రీటింగ్ కార్డులు కాకుండా కొన్నాళ్లయినా పదిలంగా ఉండే కానుకలను యువతులు కోరుకుంటారని మార్కెట్ విశే్లషకులు చెబుతున్నారు. డిజైనర్ హ్యాండ్‌బాగ్‌లు, ఆభరణాలు, మంచి పుస్తకాలు, కొత్త ఫ్యాషన్లను చాటిచెప్పే దుస్తులు, అలంకరణ సామగ్రి, గదికి అందాన్నిచ్చే పెయింటింగ్స్, సువాసన వెదజల్లే స్ప్రేలు వంటి వాటిపై మగువలు ఎక్కువగా మనసుపడుతుంటారు.

-తులసి