మెయన్ ఫీచర్

విద్యాలయాలా? విద్రోహ కేంద్రాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కన్హయ కుమార్‌ను ఏ చట్టం కింద అరెస్ట్ చేయాలి? అసలు అరెస్టు చేయాలా? వద్దా? అతడు నిర్దోషి - ఎవరో కావాలని దొంగ వీడియో సృష్టించారు’’..ఇండియా టుడేలో ప్రచురితమైన కథనమిది. జెఎన్‌యులో అల్లర్లు జరిగినప్పుడు కన్హయ అక్కడ లేడు. ఎవరో దుర్మార్గులు క్యాంపస్‌ను అల్లరిపాలు చేయాలని-విద్యార్థులలో దూరి ఇలా చేశారు. ఇట్లా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నచిన్నవాళ్లే కాదు సోలీ సొరాబ్జీ, కపిల్ సైబల్, ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు కూడా ఇదే విధంగా వాదించడమే విచి త్రం!
బ్రిటీషు వారు భారదేశాన్ని పాలించేటప్పుడు ‘సెడిషన్’ చట్టం వచ్చింది. ఇప్పుడు వారు లేరు కాబట్టి దేశద్రోహ చట్టం ఎట్లా వర్తిస్తుంది? అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా అన్‌లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్-1967, ఐపిసి-124 ఇలాంటి చట్టాలు ఉన్నాయి కదా అని కొందరు సూచిస్తున్నారు. ఇక్కడ ప్రజల దృష్టికి రాని ఒక ముఖ్యమైన అంశం ఒకటుంది. దీన్ని ఘనత వహించిన సీనియర్ సుప్రీంకోర్టు లాయర్లు కూడా మరచిపోయినట్టు నటిస్తున్నారు. డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ఒక నిషిద్ధ మావోయిస్టు అనుబంధ సంస్థ! కాంగ్రెస్ వారే లోగడ ఈ విద్యార్థి సంస్థను నిషేధించారు! జెఎన్‌యులో అల్లర్లు చేసిన విద్యార్థులలో కొందరు జిహాదీ ఉగ్రవాద సంస్థకు, మరికొందరు డి.ఎస్.యు సంస్థకు చెందినవారు. వీరిని కేజ్రీవాల్, రాహుల్ గాంధీ, నితీశ్ కుమార్, సమర్ధిస్తున్నారు. చైనా ఛైర్మన్ మా ఛైర్మన్ అన్నారు. అంటే భారత రాజ్యాంగం తమకు వర్తించదని ఈ నినాదానికి అర్థం. జాతీయ జెండాను తగలబెట్టి ‘‘చైనా ఛైర్మన్ మా ఛైర్మన్’’ అని నినాదాలు ఇస్తున్న విద్యార్థులు ఇప్పుడు భారత జాతీయ పతాకాన్ని విద్యాసంస్థల మీద ఎగుర వేయడాన్ని నిరసిస్తున్నారంటే గత అరవై సంవత్సరాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఈ దేశాన్ని ఎంతగా భ్రష్టు పట్టించారో తెలిసిపోతున్నది. జెఎన్‌యు- జెఎన్‌టియు, జవహర్ భారతి ఇలా నెహ్రూ పేరున్న ప్రతి చోట పాక్-చైనా అనుకూల శక్తులు పుట్టుకొస్తున్నా యి. ఎందుకని? దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతాడు? నిజానికి రాహుల్ గాంధీ రాజకీయ లబ్దికోసం దేశద్రోహులకు మద్దతునిచ్చే స్థాయికి ఎదిగాడు. లేకపోతే అఫ్జల్ గురు వర్ధంతి ఉత్సవాలు జరుపుకున్న వారికి రాహుల్ మద్దతివ్వడమేంటి?
జవహర్‌లాల్ యూనివర్సిటీలో ఫిబ్రవరి 10న ఒక సాంస్కృతికోత్సవం జరిగింది. సంస్కృతి అంటే నృత్య గీతాలు అని మనం భ్రవించకూడదు. అక్కడ విదేశీ ప్రేరిత ఉగ్రవాద విద్యార్థులు ఊరేగింపు జరిపారు. ‘‘్భరతదేశం విధ్వంసం అయ్యే వరకు మా సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది,’’ అని నినాదాలిచ్చారు. ఆఫ్జల్ గురు అమర్ హై అన్నారు- ఒక అఫ్జల్ గురును ఉరి తీస్తే ఇంటింటా అఫ్జల్ గురులు జన్మిస్తారు’ అని నినాదాలు ఇచ్చారు. ఇక్కడ ‘అఫ్జల్ గురూ అమర్ హై-్భరత్ విధ్వంసానికి సంఘర్షించండి’ అని పిలుపునిచ్చింది స్టూడెం ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే వామపక్ష విద్యార్థి సంఘం. అందులో నిర్మలాంశు ముఖర్జీ తృప్తి విజయాసింగ్ జిలానీ ఉన్నట్లు సమాచారం. ఈ ఘనమైన సాంస్కృతిక కార్యక్రమం వీడియో ప్రముఖ ఆంగ్ల ఛానల్స్ ప్రదర్శించాయి. ఇది ఒక్క న్యూఢిల్లీ విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం కాదు. మొత్తం జెఎన్‌యుల పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడి అధ్యాపకులు షాంపెయిన్ చప్పరిస్తూ కాక్‌టైల్ పార్టీలు జరుపుకుంటారు.
జెఎన్‌యులో లోగడ ఇలాంటి ఊరేగింపులు చాలా జరిగాయి. అప్పుడు యుపిఎ పట్టించుకోలేదు. అరుంధతీ రాయ్, భాను జోత్స్న, లాహిరి జిలానీ, ఉమర్ వంటి మహిళామణు ఇక్కడికి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఆధారాలున్నాయి. ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కన్హయ్య మరో 14 మందిపై విడియో ఆధారంగా దేశ ద్రోహం కేసు పెట్టారు. ఇలా విద్యార్థులపై నేరం మొపకూడదంటూ ఎచూరి సీతారాం వాదించారు. కారణం ఈ విద్యార్థి సంస్థలు సిపిఎం, సిపిఐలకు చెందినవి కావడమే. భాను జోత్స్నా లాహిరి అనే ఉగ్రవాద విద్యార్థిని సెమినార్ పేరుతో జెఎన్‌టియులో విద్యార్థులను రెచ్చగొట్టింది. ఈమె డిఎస్‌యు అనే సంస్థకు చెందినది. భారత రాజ్యాంగం 19-1-ఎ ద్వారా ప్రసాదించబడిన ప్రాథమిక హక్కులల్లో ఒకటైన భావ స్వాతం త్య్రం ఇలా దుర్వినియోగం చేయబడింది. రాజ్యాంగంలోని 124వ అధికరణం జాతి సమగ్రతకు భిన్నంగా ప్రకటన చేయడం దేశద్రోహం కిందికి వస్తుందని చెప్పిన అంశం. భావ ప్రకటనా స్వేచ్ఛ పరిధిని గుర్తించడం లేదు. భారత్‌ను తిట్టి, పాకిస్తాన్‌ను పొగడడం భావ ప్రకటనా స్వేచ్ఛ కిందికి ఎట్లా వస్తుంది?
ఫిబ్రవరి 9న పాక్‌లోను కాశ్మీర్‌లోను ఇలాం టి ప్రకటనలు వెలువడ్డాయి. ‘‘జెఎన్‌యు విద్యార్థులకు కృతజ్ఞతలు. మన అఫ్జల్ గురుకు అనుకూలంగా ఈ విద్యార్థులు రాజధాని న్యూఢిల్లీలోనే మద్దతివ్వడం అంటే న్యాయం మనవైపు ఉన్నదని అర్థం’’- దేశభక్తులకు ఈ ఉదంతంలోని తీవ్రత ఇప్పటికి అర్థమైందని అనుకుంటాను. మళ్లీ ఫిబ్రవరి 18 రాత్రి పాకిస్తాన్ టీవీ ఛానళ్లు ఇలా వార్తలు ప్రసారం చేశా యి,‘‘్భరత దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు మనలను (పాకిస్తాన్‌ను) బలపరుస్తున్నారు. కశ్మీరు ప్రత్యేక దేశంగా అంగీకరిస్తున్నారు. మన అఫ్జల్ గురును ఉరి తీయడం దుర్మార్గం అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.’’అంటే పాక్ ఏం ప్రయోజనం ఆశించిందో అది సాధించింది.
ఈ అఫ్జల్ గురు ఎవరు? భారత పార్లమెంటు మీద బాంబుదాడి యత్నం కేసులో నేరం రుజువై ఉరిశిక్ష విధించబడిన వాడు. చైనాలో సమ్మర్ రీట్రీట్స్ ఉంటాయి. ఒకడు దేశద్రోహం చేస్తే వెంటనే సైనిక న్యాయస్థానంలో విచారించి ఉరితీస్తారు. అక్కడ సమ్మెలు, ధర్నాలు చెయ్యడానికి వీలులేదు. అక్కడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టడానికి ఒప్పుకోరు. మరి ఇండియా అఫ్జల్ గురు, మగ్దుల్ భట్ వం టి వారి ఉరిశిక్షలు రద్దు చేయాలని చైనా ప్రేరిత ఉగ్రవాదులు ఆందోళన చేస్తున్నారు.
రష్యావలె భారత్ చిన్న దేశాలుగా విడిపోతుంది అని 2012లో చైనా తన వెబ్‌సైట్‌లో ఒక కథనాన్ని విడుదల చేసింది. అంటే వారి వ్యూహమేంటో స్పష్టంగా ఎట్టి రహస్యమూ లేకుండా తెలుస్తూనే ఉంది. విద్యాలయాల్లో తరగతి శిక్షణపై విద్యార్థులకు ఆకర్షణ లేదు. వేలకోట్ల బడ్జెట్ వృధా అవుతోంది. జెఎన్‌యులు, కేం ద్రీయ విశ్వవిద్యాలయాలను ఇప్పుడు ఏకపక్షంగా చైనాయే నడుపుతున్నది. మరి మోదీ ఏం చేస్తున్నట్టు? చైనాకు జాతీయత ఉంది, రష్యాకు జాతీయ విద్యావిధానం ఉంది. కాని భారత దేశానికి మాత్రం జాతీయత, జాతీయ విద్యావిధానం ఉండకూడదట.
అమెరికా రాజ్యాంగంలోని ఆరవ అధికరణం ప్రకారం ప్రతి విద్యా సంస్థ మీద తప్పనిసరిగా అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేసి తీరాలి. పోలింగ్ సమయలో పోలింగ్ బూత్ వద్ద జాతీయ పతాకం ఎగురవేయాలి. అప్పుడు పౌరులకు, విద్యార్థులకు ఓటర్లకు తమ బాధ్యత తెలుస్తుందని ఆ రాజ్యాంగ నిర్మాతల భావన. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 20న ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి విశ్వవిద్యాలయం మీద భారత జాతీయ పతాకం ఎగురవేయాలి. దీనివల్ల విద్యార్థులకు దేశం మీద గౌరవం పెరుగుతుందని ఈ నిర్ణయంలోని భావం. విచిత్రమేమంటే కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులు దీన్ని వ్యతిరేకించారు. ఇలా దేశభక్తిని మామీద రుద్దవద్దని కోరారు. ఒక ఇంగ్లీషు ఛానల్‌లోని చర్చా కార్యక్రమంలో డాక్టర్ విజయకుమార్ అనే కమ్యూనిస్టు నాయకుణ్ణి యాంకర్ ఇలా ప్రశ్నించింది. ‘‘మీరు జాతీయ పర్వదినాల్లో మీ పార్టీ ఆఫీసుపై జాతీయ జెండా ఎందుకు ఎగురవేయరు?’’ అందుకు విజయ్‌కుమార్ సమాధానం ఇలా ఉంది, ‘‘మాది ప్రభుత్వ ఆఫీసు కాదు. ఇదొక ప్రైవేటు భవనం. ఒక రాజకీయ పార్టీ ఆఫీసు.’’
షబ్‌నంలోనీ అనే కాశ్మీరీ చట్టంలో ఇలా ఉంది,‘‘మా కాశ్మీరుకు కాశ్మీరు జాతీయ జెండా ఉంది. ఇండియన్ ఫ్లాగ్ ఎందుకు? దీనివల్ల మతకల్లోలాలు చెలరేగుతాయి.’’ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఏ మతానికి చెందినది? ఏ రాజకీయ పార్టీకి చెందిందో షబ్‌నంలోనీకి మనీష్ తివారీ, బృందా కారత్ వంటి వారు చెప్పగలరా?
నెల్లూరు జిల్లా కావలిలో ఒక కళాశాల ఉంది. కె.వి. రమణారెడ్డి కొంతకాలం అక్కడ పనిచేశారు. ఈ కాలేజీ చాలా సంవత్సరాలు తీవ్రవాదుల బ్రీడింగ్ సెంటర్‌గా ఉండేది. ఈ కాలేజీ పేరు జవహర్ భారతి. అలిగఢ్ ముస్లిం యూనివర్సిటీ మీనియేచర్ పాకిస్తాన్-ఇక్కడ సెమీ కార్యకర్తలు తయారవుతారు. వారందరికీ సమాజ్ వాదీ పార్టీ ప్రత్యక్ష మద్దతు ఉంటుంది. సోషలిస్టు పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా, పివిజి రాజు వంటి వారు దేశ భక్తులు. 1975లో దేశంపై ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి జయప్రకాశ్ నారాయణ్‌ను అరెస్టు చేసి దాదాపు మూడు సంవత్సరాలు జైల్లో పెడితే ఈ సూడో సెక్యులరిస్టులు నోరెత్తలేదు.
భారత ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి సాలీనా మూడున్నర లక్షలు స్కాలర్‌షిప్ కింద వినియోగిస్తున్నది. ప్రతి లెక్చరర్ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. మరి ఈ ధనమంతా పేదవాళ్లు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించేదే. మరి విదేశీ శక్తులను, కాశ్మీర్ వేర్పాటు వాదులను ఈ పుర్రచేతి మేధావులు సమర్థించడమేంటి? దేశాన్ని వెండి పళ్లెంలో పెట్టి చైనాకు, పాకిస్తాన్‌కు అప్పగించాలని ప్రయత్నించడం కాదా ఇది. ఇదేనా ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్యమంటే?
పాక్-చైనాలు కలిసి భారత్‌పై ద్విముఖ యుద్ధం చేస్తున్నాయి. ఒకటి సరిహద్దులకు అవతలి వైపు నుండి సాగించే యుద్ధం, రెండవది అంతర్గతంగా వివిధ విద్యాలయాల్లో విద్యార్థులను ఉగ్రవాదులుగా మార్చే య త్నం. ఆ ప్రయత్నంలో చైనా ప్రభుత్వం విజయం సాధించింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను విద్యాలయాలను ప్రక్షాళన చేస్తారని అంతా ఆశించారు. అలాంటిదేమీ జరగలేదు. రొమిల్లా థాఫర్ అర్‌ఎస్ శర్మ, బిపిన్ చంద్ర, అరుంధతీ రా య్, వకుళాభరణం రామకృష్ణలు రాసిన పుస్తకాలే ఉన్నాయి.
ఏచూరి సీతారాం (సిపిఎం), రాజా (సిపి ఐ)లు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. విద్యార్థిని విడుదల చేయాలని కోరారు. దీన్నిబట్టి ఈ విద్యార్థుల ఆందోళనను చైనా వెనుక ఉండి నడిపిస్తున్నదని తేలిపోవడం లేదా? జెడియు అధికార ప్రతినిధి త్యాగి కూడా విద్రోహ విద్యార్థులకు మద్దతు పలికాడు. జెడియు బిహార్‌లో అధికారంలో ఉంది. వీరికి ఆర్‌జెడి మద్దతుంది. ఆర్‌జెడి అంటే లల్లూ యాదవ్ జంగిల్ రాజ్. ఢిల్లీ సంఘటన జరిగిన రోజే రాజ వల్లభ యాదవ్ అనే జెడియు ఎమ్మెల్యేను, మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అరెస్టు చేశారు. ఇవీ మన భారత రాజకీయాలు. ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ జగదీశ్ కుమార్‌కు, యూనివర్సిటీలోని నలుగురు డీన్‌లు, తమ నిరసన తెలుపుతూ లేఖలు ఇచ్చారు. అంటే ప్రొఫెసర్లు, డీన్‌లు, ప్రిన్స్‌పాల్స్ స్థాయిలో కూడా వివిధ విశ్వవిద్యాలయాల్లో దేశద్రోహులు ఉన్నారు. ఇటువంటి వారు చాలాకాలంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారనేది స్పష్టం. కావున ఇవన్నీ చైనా ప్రేరిత విద్రోహ కేంద్రాలు.

- ముదిగొండ శివప్రసాద్