మెయిన్ ఫీచర్

అందాల హరివిల్లు.. ఆనందాల కోలాహలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీలి రంగులో కనిపించే ఆకాశం ఆరోజు సప్తవర్ణాలు కలబోసినట్లు చిద్విలాసం చేస్తోంది. ఆడ మగా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చిందేస్తూ, కోలాటాలాడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే రోజు. గౌరవసూచకంగా నిలబడిన పెద్దలను సైతం రంగుల ప్రపంచంలోకి దింపేసి చిన్నపిల్లలను చేసేస్తారు. అందరి ముఖాల్లో ఆనందం తాండవిస్తూ సంతోషం వెల్లివిరుస్తోంది.
రంగు పడని ముఖం అంటూ ఆ రోజు ఉండదు. అదే రంగుల పండుగ హోలీ. హిందూ సాంప్రదాయ పండుగలలో అతి ప్రముఖమైనదిగా చెప్పే హోలీని ఫాల్గున మాసం పౌర్ణమినాడు జరుపుకుంటారు. ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో విభిన్నరీతులలో జరుపుకుంటారు. ఏ రీతిన జరుపుకున్నా అన్ని చోట్ల కనిపించేది అంతిమంగా వివిధ రంగుల మేళవింపే.
సృష్టిలోని రంగులన్నింటినీ కుప్పపోసారా? అన్నంత అందంగా.. ఆహ్లాదంగా, వేడుకగా జరుపుకునే పండుగ. ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంతరుతువు ప్రవేశించిన తరువాత జరుపుకునే తొలి వేడుక హోలీ. అంటే శీతాకాలం వెళ్లిపోయి వేసవి కాలం అడుగుపెడుతున్న తొలిరోజులలో హోలీ ఆడతారన్నమాట.
హోలీ పండుగు ఈనాటిదీ కాదు ద్వాపర యుగంలోనే ఆరంభమైందని చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉండటంతో కినుకవహించిన కృష్ణుడు ఈ విషయాన్ని తల్లి యశోదకు చెప్పి వాపోతాడు. అపుడు యశోద ఓ సలహా ఇస్తుంది. రాధ ఒంటి నింటా రంగులు పోయమని తరుణోపాయం చెబుతుంది. వెన్నదొంగ కన్నయ్య వెంటనే రాధ మీద వివిధ రంగులు కుమ్మరిస్తాడు. దీనికి ప్రతీకగా రాధ కూడా కృష్ణుడి మీద వసంతం కుమ్మరించింది. ఆ రోజు నుంచి స్నేహితులు, బంధువులు ఒకరి మీద ఒకరు ఆనందంగా రంగులు చల్లుకోవటం ఆరంభించారు.
హోలీకి ముందు కాముని దహనం చేస్తారు. కామం అంటే కోర్కె, బాధ అనే అర్థాలు కూడా చెప్పవచ్చు. సుఖం, దుంఖం, సంతోషం, విచారం మేలు కలయిక ఈ జీవితం. కాబట్టి ఈ వసంతోత్సవాన్ని వివిధ ప్రాంతాలవారు విభిన్న రీతులలో జరుపుకుంటారు. అవి ఏమిటో తెలుసుకుందాం.