మెయిన్ ఫీచర్

దేశాయ్ దివ్యానందం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడికి, భక్తురాలికి అనుసంధానమైనది ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు. భగవంతుడి పట్ల ఎల్లలు లేని భక్తిని కనబర్చమని ఓ వైపు చెబుతూనే కొన్ని దేవాలయాలలోకి వారికి ప్రవేశం లేదు అంటూ విధిస్తున్న ఆంక్షలపై గళమెత్తిన అతివలు తొలి విజయం సాధించారు. మహారాష్టల్రోని శని దేవాలయం ప్రవేశం, పూజలు చేయటంతో నమోదు చేసుకోబోతున్నారు. ఈ విజయానికి కారకురాలైన దేశాయ్ పూణెలో ఓ సామాజిక కార్యకర్త. ఎస్‌ఎన్‌డిటి కాలేజీలో హోమ్ సైన్స్ చదువు మధ్యలో ఆపేసి సామాజిక సేవలో నిమగ్నమైన ఆమెకు చిన్ననాటి నుంచి మీటింగ్‌లు తదితర వాటికి వెళ్లి నాయకుల ప్రసంగాలు వినటం అలవాటు. ఆ ప్రసంగాలే ఆమెను ఓ సామాజిక కార్యకర్తగా మలిచాయి. ఆది నుంచి సామాజిక సమస్యలపై గళమెత్తేది. 2009లో తొలిపోరాటం ఆమె కో-ఆపరేటివ్ బ్యాంక్ అక్రమాలపై ఆరంభించింది. అజిత్ పవార్‌కు చెందిన ఈ కో-ఆపరేటివ్ బ్యాంక్ బాధితులకు అండగా నిలిచి పోరాడటం ఓ సవాల్. ఓ వైపు బెదిరింపులు, మరోవైపు ప్రాణ భయం. అయినప్పటికీ వెరవక బాధితుల కోసం కోర్టులో కేసు వేసింది. ఆ సమయంలో అజిత్‌పవార్ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అధికార అండ మెండుగా ఉన్న అజిత్ పవార్‌ను ఎదిరించి తొలి విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆమెకు ఎన్నో బెదిరింపులు వచ్చినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆమె చేసిన పోరాటం వల్ల దాదాపు 29,000 మంది కస్టమర్లు వారి డబ్బు తిరిగి పొందగలిగారు. రెండవ పోరాటం శని ఆలయంలో మహిళల ప్రవేశం, పూజలు చేసుకునే కనీస ప్రాధమిక హక్కుపైనా పోరాడి హైకోర్టు తీర్పుతో రెండవ విజయాన్ని పొందారు. కో-ఆపరేటివ్ బ్యాంక్ విజయం తరువాత భూమాత బ్రిగేడ్ అనే సంస్థను స్థాపించారు. ఇందులో సభ్యులంతా యువ రక్తంతో తొణికసలాడేవారే. దేశాయ్ వయసు మూడు పదులు దాటగా, జగ్తప్ ఆరేళ్ల కిందట ఈ సంస్థలో చేరేటప్పడు ఆమె వయసు పదహారేళ్లు మాత్రమే. సభ్యులు ఎవ్వరూ కూడా 40 ఏళ్లుదాటిన వారు లేకపోవటం విశేషం. ఆలయ ప్రవేశం కోసం పోరాడిన దేశాయ్ నాస్తికురాలు అనుకుంటే పొరపాటే. ఆమె ఇంట్లో హిందూ దేవుళ్ల ఫొటోలు గోడల నిండి దర్శనమిస్తాయి. శని దేవుని చిత్రపటం కూడా దర్శనమిస్తోంది. శని ఆలయ ప్రవేశం కోసం దేశాయ్ చేసిన ఉద్యమానికి మహిళా సాధువులు సైతం మద్దతు పలికారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ సైతం వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఆధ్యాత్మిక జ్ఞానం అందరి సొత్తు అంటూ వివక్షత చూపటం తగదని హితవు పలికారు. సృష్టికి మూలమైన ఋతుస్రావం తనకు లభించిన వరంగా భావించే మహిళను ఈ నెపంతో ఆమెను భగవంతుని దరచేరనీయకపోవటం సహేతుకం కాదంటూ దేశాయ్ చేసిన ఆందోళన మహిళాలోకం సాధించిన విజయం అని అనటంలో అతిశయోక్తి కాదు. *
chitram...
1. విజయానందంలో భూమాత బ్రిగేడ్ సభ్యులు

2. భగవంతుని పూజలోనూ వివక్షతేనా?