మెయిన్ ఫీచర్

యవ్వన విలాసం.. సహజ సిద్ధ వికాసం ( నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్ల ముందు సీతాకోక చిలుక లా పెరిగిన అల్లారు ము ద్దుల ఆడపిల్ల కాస్తా నునుసిగ్గుల యవ్వనవతిగా మారే క్రమం అద్భుతంగా కనిపించినా ఈ సమయంలోనే అమ్మాయి ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వయసుకు రాగానే యవ్వన మార్పులనేవి సహజం. యువతుల వయసు 20 ఏళ్లు రాగానే వారి శరీరంలో రావాల్సిన మార్పులన్నీ వచ్చేస్తాయి. ఈ దశలో శరీరంలో కనిపించే హార్మోన్ల ప్రభావం అత్యంత కీలకం. యవ్వన మార్పులకు మూలమైన సెక్స్ హార్మోన్లను స్రవించేవి ఆడపిల్లల్లో అండాశయాలు. రజస్వల అయిన రెండేళ్లకల్లా ఎత్తు పెరగటం ఆగిపోతుంది. ఇది సాధారణంగా ఆడపిల్లలు యవ్వనవతిగా మారే క్రమం. దాదాపు 90 శాతం ఆడపిల్లల్లో పెరుగుదల ఇదే క్రమంలో జరుగుతుంది.
ప్రకృతిలో మొగ్గ పువ్వుగా..పువ్వు కాయగా..కాయ పండుగా ఎలా మారుతుందో అదే క్రమంలో తమ ముద్దుల కూతురు యువతిగా యవ్వన పరవశం పొందుతున్న వేళ వచ్చే మార్పులను గమనించి తల్లిదండ్రులు ఆమె ఆరోగ్యం పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆమే రేపటి తల్లి, విజేయురాలు, వ్యాపార సామ్రాజ్ఞి, కలలరాణి, కుటుంబం అనే వ్యవస్థకు ప్రధాన భూమిక.
ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు యుక్తవయసు రాకుండానే పెళ్లి చేసేసి అత్తారింటికి పంపాలని తల్లిదండ్రులు తాపత్రయం పడటంలేదు. వారిని ఓ స్థాయికి తీసుకువచ్చి సమాజంలో గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. సామాజికంగా వారిని సమర్థవంతంగా ఎలా తీసుకురావాలని అనుకుంటామో అలాగే శారీరకంగా వచ్చే మార్పుల దృష్ట్యా బలమైన, ఆరోగ్యకరమైన మూలాలను పాదుకొల్పాల్సిన అవసరం ఉందని, అపుడే భవిష్యత్తులో సంభవించే అనేక అనారోగ్య సమస్యలను వారు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని గైనకాలజిస్టులు అంటారు. 20 ఏళ్ల యవ్వన ప్రాయంలో హార్మోన్ల సమతుల్యత లోపించకుండా చూసుకోవాలి. మొటిమలు వస్తుంటాయి. అండాశయం విడుదల క్రమంలో సంభవించి విపరీత పరిణామాల వల్ల ఋతుక్రమం సరిగా రాదు. ప్రతిరోజూ నిద్ర లేచిన దగ్గరు నుంచి ఉరుకులు పరుగుల సమయంతో కూడుకున్న యువతుల జీవితంలో ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. ఇంటిలో వండిన ఆహారపదార్థాలను వేళకు తినే పరిస్థితి లేదు. దీంతో కాలేజీలకు వెళ్లిన యువతులు జంక్ ఫుడ్‌కు అలవాటుపడుతున్నారు. ఇది ఈ వయసులో ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. 20 ఏళ్ల యవ్వన ప్రాయంలో ప్రతి యువతి క్రమం తప్పకుండా గ్లాసు పాలు, పెరుగు, తాజా పళ్లు, డ్రై ఫ్రూట్స్, పప్పు్ధన్యాలను ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిది. దీనివల్ల శరీరంలో అనవసర కొవ్వు చేరదు. జంక్‌ఫుడ్ ఎంత ఎక్కువగా తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషకాలు అంత ఎక్కువగా కోల్పోతున్నామని గ్రహించాలి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దశలో ఉండే యువతులు రక్తహీనతతో బాధపడుతుంటారు. పది 10మంది యువతులలో ముగ్గురు ఈ రక్తహీనతతో బాధపడుతుంటారు. కాబట్టి రక్తం పెరిగే ఆహారపదార్థాలు అంటే దానిమ్మ, బీట్‌రూట్, పచ్చటి ఆకుకూరలు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే కడుపు, నడుము నొప్పులు మూడ్స్ తదితర ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో ఎవరికివారు వ్యక్తిగత శుభ్రత తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నెలసరి సమయంలో ఎక్కువుగా నీరు తీసుకుంటే పిరియడ్స్ సమయంలో శరీరంలోని కణాలు హార్మోన్ల ప్రభావం వల్ల ఎక్కువ నీటిని తీసుకుంటాయి. దీని వల్ల కడుపు ఉబ్బరంగా మారుతోంది. కాళ్లు వాపులు వస్తుంటాయి.
ఇరవైలో అరవైలా కాకుండా ఈ వయసులో ఫిట్‌నెస్ మంత్రాన్ని జపించాలి. ఒత్తిడిని దూరం చేసి మానసిక ప్రశాంతతను చేకూరుస్తోంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తోంది. ఫలితంగా శారీరంగా, మానసికంగా తాజాదనాన్ని పొందవచ్చు. ఆడపిల్ల ఆకృతిని ఆకర్షణీయంగా మార్చే వయసు. అందువల్ల ఈ వయసులో శరీరంలోవచ్చే ఏ మార్పునైనా చాలా జాగ్రత్తగా గమనించాలి. అసాధారణంగా ముఖం, ఛాతి, మెడ తదితర భాగాలలో పెరిగే వెంట్రుకలు, అకస్మాత్తుగా బరువు పెరగటం, తగ్గటం, జుత్తు ఊడిపోవటం, ఋతుక్రమం సరిగా ఉండకపోవటం సంభవిస్తుంటాయి. ఈ సమయంలో సమతుల్య ఆహారం, అరగంట పాటు వ్యాయామం, సమాయాను సారం భోజనం, రాత్రి ఎక్కువ సేపు మేలుకోకండా నిద్రించటం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సెక్స్‌పరమైన వ్యాధులు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. యువతి మహిళగా మారే క్రమంలో యవ్వన మెరుపులు పోకుండా, తమకు తెలియకుండానే తమ ఒంట్లో జరిగిపోతున్న మార్పులకు తబ్బిబ్బై తడబడిపోకుండా, వేదన అనుభవించకుండా అవగాహన కలిగి ఉండటం ఎంతైనా మంచిది. *

మధుమేహాన్ని
తరిమికొడదాం..
ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా మధుమేహం వ్యాధిని తరిమికొట్టాల్సిందిగా అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తున్న మధుమేహం వ్యాధి చిన్నవయసువారిని కూడా పట్టిపీఢిస్తోంది. వాస్తవానికి మధుమేహం వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తారు. కాని మారుతున్న జీవనశైలి దృష్ట్యా నేడు చిన్నవయసు నుంచే మధుమేహం బారిన పడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల జనాభా ఈ వ్యాధినబారిన పడ్డారు. రానున్న 20 ఏళ్లలో ఇది రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2012లో షుగర్ వ్యాధి వల్ల 1.5 మిలియన్ల మంది చనిపోయారు. దక్షిణ ఆసియాలో 96 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయి. యూరోపు, అమెరికా దేశాలలో 64,62 మిలియన్ల కేసులు నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యాధి పేద, అభివృద్ధిచెందిన దేశాలలో విరివిగా వ్యాపిస్తోంది. టైప్-2 మధుమేహవ్యాధితో 90శాతం మంది బాధపడుతున్నారు. ఇది నేడు చిన్నారులలో వ్యాపించటం ఆందోళన కలిగించే అంశం.
వ్యాధిని అదుపులో
ఉంచుకోవటం మన చేతుల్లోనే..
మధుమేహ వ్యాధి రాకుండా ముందే జాగ్రత్తపడితే మంచిది. ఒకవేళ వస్తే దీనిని అదుపులో ఉంచుకోవటం మనచేతుల్లోనే ఉంది. చాలామంది పళ్లు తినరు. కాని జామ, నేరేడుపళ్లు, అవకోడ, ఆరంజ్,స్ట్రాబెర్రీ, పీర్స్, పుచ్చకాయ తదితర పళ్లు తింటే మధుమేహం అదుపులోనే ఉంటుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, జీవనశైలిలో మార్పులు చేసుకోవటం, అవసరమైన మేరకు మందులు వాడితే మధుమేహం అదుపులో ఉంటుంది.