మెయిన్ ఫీచర్

హౌస్‌ప్లాంట్స్ హోయలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో పచ్చని మొక్క ఒక్కటుంటే చాలు ఆ ఆనందమే వేరు. కాంక్రీట్ జంగిల్ నేపధ్యంలో గార్టెన్‌ను పెంచటం గగనమవుతున్న ఈ రోజులలో చాలామంది అపార్ట్‌మెంట్స్‌వారు ఇళ్ళలో చిన్నపాటి మొక్కల్ని పెంచటానికి మక్కువ చూపుతున్నారు. గాలి, వెలుతురు రాకున్నా ఈ హౌస్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు. బెడ్‌రూమ్‌లో వీటిని పెట్టుకుంటే...గాలికి హోయలుపోతూ ఈ మొక్క పలకరిస్తే చాలు ఆరోజంతా పని వల్ల కలిగిన అలసటను మర్చిపోతాం. హౌస్‌ప్లాంట్స్ వల్ల పలురకాల ప్రయోజనాలున్నాయని సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. ఈ మొక్కల్ని ఆఫీసులలో కూడా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
టెన్షన్ సైతం 80శాతం వరకు తొలగిపోతుందని టెక్సాస్‌కు చెందిన వ్యవసాయ యూనివర్శిటీ నిపుణులు చేసిన సర్వేలో వెల్లడైంది. కార్యాలయాలలో పనిచేసే ప్రాంతాలలో వీటిని ఏర్పాటుచేయటం వల్ల ఉత్పత్తి పెరుగుతుందట! కంప్యూటర్ ముందు చిన్న పచ్చటి మొక్క పెట్టుకుంటే 12శాతం పని పెరిగినట్లు గ్రహించారు. విద్యార్థులలో కూడా పనితీరు బాగుందని గుర్తించారు. 385 మంది విద్యార్థులున్న క్లాస్‌రూమ్‌లో చిన్నిపాటి మొక్కలను ఏర్పాటుచేయటం వల్ల వారి అధ్యయనంలో మార్పు జరిగినట్లు భావించారు.
సెమిస్టర్ పరీక్షలలో ఈ విద్యార్థుల మార్కులు పెరిగినట్లు గుర్తించారు. ఇన్ని ప్రయోజనాలున్న హౌస్‌ప్లాంట్స్‌ను ఎంపిక చేసుకోవటం కూడా ఓ కళే.
ఈ మధ్యకాలంలో చాలా ఇళ్లల్లో వెదురు మొక్కల్ని పెంచుతున్నారు. ఇంట్లో ఉండే కార్బన్‌మోనాక్సైడ్, బెంజీన్, క్లోరోఫామ్ లాంటి మూలకాల్ని ఇవి బయటకు పంపిస్తాయి. రబ్బర్‌ప్లాంట్స్‌ని ఇంట్లో పెంచుకుంటే నీరు, కాంతి ఎక్కువగానే అవసరం.
అదే సందర్భంలో వీటిని పెంచటం వల్ల గాలిలోని కలుషితాలను బయటకు ప్రాలదోలుతోంది.
తక్కువ ఎత్తు పెరిగే తీగ మొక్కల్ని కూడా పెంచుకుంటే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మనీప్లాంట్ పట్ల మక్కువ పెంచుకోవటం నేడు సర్వసాధారణం.
అలాగే సెన్స్‌విరియా, స్పతిప్ల్యుం, గోల్డెన్ పోతోస్, పోకతాటి లాంటి మొక్కలు ఇళ్లలో కనువిందుచేస్తాయి. ఫ్లెమింగోలిల్లీ, ఆంథోరియమ్ ఆండ్రీనమ్, కాలిక్యూమ్, ఆక్సాలైట్ తదితర పూలు పూచే మొక్కలు కూడా ఇంటి అందాన్ని ఇనుమడింపచేస్తాయి.
ఇళ్లు ఎంతది అని చూడకుండా చిన్నపాటి మొక్కల్ని ఏర్పాటుచేసుకుంటే ఆకర్షణతో పాటు ఆరోగ్యకరం.