మెయిన్ ఫీచర్

ముప్ఫయల్లోనే గొప్పోళ్లయ్యారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివ్య నెట్టిమి.. వయసు 29 ఏళ్లు.. పెట్టుబడుల రంగంలో మేటి విశే్లషకురాలిగా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించి ‘ఔరా’ అన్పించుకుంది.. ‘వికింగ్ గ్లోబల్ ఇనె్వస్టర్స్’లో పనిచేస్తున్న ఆమె ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చదివి పిన్న వయసులోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.
నీటిలో మునిగిన విమానాలు, చ మురు ట్యాంకర్లను అనే్వషించే ‘డ్రోన్ల’ ను అభివృద్ధి చేసిన సంప్రీతి భట్టాచార్య అసమాన ప్రతిభకు తార్కాణంగా నిలిచింది. సాగర జలాల్లో భద్రతకు ఉపకరించే ఫుట్‌బాల్ సైజ్ రోబోకు ఆమె రూపకల్పన చేసింది.
గూగుల్ ఎక్స్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల కరిష్మా షా, ఆర్థిక రంగంలో అత్యుత్తమ నైపుణ్యం చూపిన సిటీ గ్రూప్ ఉపాధ్యక్షురాలు నీలా దాస్, వినియోగదారు సాంకేతికత విభాగంలో ‘ఓయో రూమ్స్’ వ్యవస్థాపకుడు, సిఇఓ అయిన 22 ఏళ్ల రితేశ్ అగర్వాల్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఇపుడు ప్రపంచ స్థాయిలో మన దేశానికి వనె్న తెచ్చారు. అద్భుతాలను సాధించిన వీరంతా 30 ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. 30 ఏళ్లలోపు వయసులో అరుదైన ఘనతను సాధించిన వారి జాబితాలో భారత్, భారత సంతతికి చెందిన 45 మందికి ఈ ఏడాది స్థానం లభించింది.
విభిన్న రంగాల్లో కీలక మార్పులకు కారకులై, సరికొత్త సాంకేతిక శకానికి నాంది పలికిన వారితో అమెరికాకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘్ఫర్బ్స్’ ఈ జాబితాను ప్రకటించింది. న్యూ యార్క్ నగరంలో 1917లో ప్రారంభమైన ‘్ఫర్బ్స్’ పత్రిక ఏటా ఇచ్చే ర్యాంకింగ్‌లకు విశ్వవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ‘30 అండర్ 30’ పేరిట విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా 600 మందికి అరుదైన ఘనత లభించింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన వారు అగ్రభాగాన నిలవగా, భారతీయ యువత కూడా సత్తా చాటుకుంది. మన దేశానికి చెందిన రితేశ్ అగర్వాల్ ‘ఓయో రూమ్స్’ పేరిట వంద నగరాల్లో 2,200 హోటళ్లను అనుసంధాన పరచి ఆతిథ్యరంగంలో చరిత్ర సృష్టించాడు. ఈ విధంగానే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 30 ఏళ్లలోపు యువతీ యువకులు సాధిస్తున్న విజయాలు అత్యద్భుతంగా ఉన్నాయని ‘్ఫర్బ్స్’ అభివర్ణించింది. ఉన్నత విద్య, కళలు, వినియోగదారు సాంకేతికత, మీడియా, ఉత్పత్తుల రంగం, పరిశ్రమలు, సైన్స్, చట్టాలు, సామాజిక రంగాల్లో నేటి యువత కొత్తపుంతలు తొక్కుతూ నవీన ఆవిష్కరణలను ప్రపంచానికి అందిస్తోంది. ఒకప్పుడు యువత చదువు, సంపాదనపైనే దృష్టి సారించేది. అయితే, ఇటీవలి కాలంలో సృజనకు పదును పెడుతూ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న తపన వారిలో పెరుగుతోంది. సాంకేతికత సాయంతో సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు యువతరం తన శక్తియుక్తులను వినియోగిస్తోంది. అనితర సాధ్యమైన ప్రతిభతో అందరినీ అబ్బుర పరచడమే కాదు, ప్రపంచం యావత్తూ గుర్తించే ‘క్రియేటివ్ లీడర్లు’గా వీరు ఎదిగారని ‘్ఫర్బ్స్’ జేజేలు పలికింది.
*