ఉత్తరాయణం

చెప్పడం తేలికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణా యందు ఇంకుడు గుంటల విషయంలో ప్రముఖుల నివాస స్థానాలలోనూ, అధికారులు తమ నివాసాలలోనూ మంత్రుల నివాస స్థలాల్లోనూ, ఇంకుడు గుంటలకు స్థలాన్ని కేటాయించలేదని వార్తలు వస్తున్నాయ. బోధించడం ప్రచార ఆర్భాటం చేయడం అతి సులభాతి సులభం. కాని ఆచరణలో ఉంచడం అతి కష్టతరం. పెద్దలూ, ప్రభుత్వమూ గమనించుదురుగాక! ప్రముఖులూ ఒకరికి చెప్పేటందుకే నీతులా?! ఏమో?!
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి
హోదా అక్కరలేదా?
ఏరుదాటేవరకు ఓడుమల్లన్న ఏరుదాటిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం స్థితి. కేంద్రమంత్రి తెగేసి శేషాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అక్కరలేదని నిర్ధారించారు. ఇక వారు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాగలరు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళుతెరిచి రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి గుణపాఠం నేర్పగలరని ప్రజలకి వినతి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
అర్చకుల దుర్భర జీవనం
తెలంగాణా రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులు చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారు. కొన్ని దేవాలయాలలో నిత్యం ధూపదీప నైవేద్యాలకు కూడా సరిపడినన్నినిధులు కేటాయించనందున, అర్చకులు తమ స్వార్జితం మరియు చందాలు పోగుచేసి, నిత్య నైమిత్తిక కర్మలను జరిపిస్తున్నారు. నిత్యం భగవంతుని సేవలో అంకితమయ్యే అర్చకులు, దేవాలయ ఉద్యోగుల జీతభత్యాలను సవరించి వారికి గౌరవప్రదమైన జీవితం కొనసాగించేలా కృషిచేయాలి. వీరికి పదవీ విరమణ అనంతరం గౌరవ వేతనం, ఉచిత వైద్య సౌకర్యం వంటి పథకాలను వర్తింపజేయాలి. అనునిత్యం పెరుగుతూ, అంతరిక్షయానం చేసే నిత్యావసర సరుకుల ధరలతో పోల్చుకుంటే వీరికి వచ్చే జీతభత్యాలు ఎందుకు సరిపోవు. దేశంలో ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాధికారులకు నిత్యం వేతనాలు సవరించబడుతునే వుంటాయి. వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నారు. వేదాన్ని నమ్ముకొని భగవదారాధనలో జీవితాన్ని వెళ్లబుచ్చే అర్చకుల పట్ల ప్రభుత్వం ఎందుకింత వివక్షత ప్రదర్శిస్తోందో అర్థంకాదు!
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
ప్రజారోగ్యం బాగుపడాలంటే..
బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, ఈ సమస్యను ఎదుర్కొనడానికి ప్రతి ఇంట్లో ఒక మరుగుదొడ్డి అవసరమని భావించి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం పూనుకోవడం సంతోషించదగ్గ విషయమే.ఈ ఆశయం నెరవేరడానికి ఈ కార్యక్రమం మరో రెండు అంశాలను జోడిస్తే బాగుంటుంది. ఒకటి: ప్రతి మరుగుదొడ్డిలో సరిపడ నీటి సదుపాయం ఉండే ఏర్పాట్లు చూడాలి. లేకపోతే మరుగుదొడ్లు బ్లాకై పోతా యి. ఉపయోగం శూన్యం. రెండవది: ప్రతి ఇంట్లో ఆరోగ్యరీత్యా మరుగుదొడ్డి ఉండటం ముఖ్యమే కాని మరుగుదొడ్డికి పోయి వచ్చిన తరువాత సబ్బుతో చేతులు కడుక్కోవడమనేది అంతకంటే ముఖ్యం! అందుచేత ‘‘మల విసర్జన తరువాత సబ్బుతో గాని, సబ్బుపొడితో కాని చేతులు కడుక్కోవడం మరవకండి’’అనే వాక్యంతో ఒక స్టిక్కర్ ప్రతి మరుగుదొడ్డి డోర్‌పై అంటిస్తే ఒక నెలరోజులపాటు ఈ వాక్యాన్ని చూసిన తరువాత చిన్న పిల్లలు, పెద్దలు జీవితాంతం మరువరు. సమాజంలో ఒక అలవాటుగా మారిపోతుంది. ప్రజారోగ్యం బాగుపడుతుంది.ఈ రెండు అంశాలను విస్మరించి ఒక్క మరుగుదొడ్ల నిర్మాణం వరకే పరిమితమైతే ప్రభుత్వం మనం ఆశించిన ‘ప్రజారోగ్యం’ బూడిదలో పన్నీరుగానే మిగిలిపోతుంది.
- కటకం పిచ్చయ్య, ఖమ్మం
అభివృద్ధిని చెడగొట్టవద్దు
శ్రీకాకుళం జిల్లా వెనుకబడడానికి ముఖ్యకారణం రాజకీయాల పేరుతో జిల్లాలో అమాయజ ప్రజలను రెచ్చగొట్టి చెడగొడతారు ఈ నాయకులు. పరిశ్రమలు వద్దు పెట్టద్దు అంటారు. పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి. మళ్లీ ప్రజలు ఇతర ప్రదేశాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదు అంటారు. ఉపాధి హామీ ఎంతకాలం? అది కేవలం కంటి తుడుపే.. శాశ్వత ఉద్యోగ భద్రత కావాలంటే మన జిల్లాకు పరిశ్రమలు రావాలి. దయచేసి నాయకులారా రాజకీయాలు చేసి జిల్లా అభివృద్ధిని చెడగొట్టకండి. అభివృద్ధిచేసే నాయకులకు తోడ్పాటు ఇవ్వండి.
- బి.నరసింహమూర్తి, శ్రీకాకుళం