మెయన్ ఫీచర్

టి.కాంగ్రెస్‌ను భాజపా వెనక్కు నెట్టేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో రెం డు ఆసక్తికరమైన దృశ్యాలు కన్పించా యి. ఒకటి గాంధీభవన్‌లో, రెండవది తెలంగాణ భవన్‌లో. అవేమిటన్నది తెలిసిందే. గాం ధీభవన్‌లో ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చా ర్జ్ అయిన దిగ్విజయ్‌సింగ్, పార్టీ ప్రముఖుల తో సమావేశం నిర్వహించారు. అందులో ప్రధానమైన చర్చనీయాంశం కాంగ్రెస్ వాదు లు అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌లోకి వెళ్లకుం డా ఆపడం ఎట్లా, పార్టీని పటిష్ట చేయడం ఎలాగన్నది. సరిగా గఅదే సమయంలో మరొకవైపు పార్టీకి చెందిన ముఖ్యులు కొందరు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ కాంగ్రెస్ కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.
ఆరోజు దిగ్విజయ్ తదితరులు ఢిల్లీనుండి వచ్చి అత్యవసర సమావేశం జరపడానికి కారణం సరిగ్గా ఇదే. పార్టీ ముఖ్యులు పలువురు వెళ్లిపోనుండడం కొన్ని రోజులనుండే తెలియగా తీవ్రంగా కలవరపడిన అధిష్ఠానంపిసిసి అధ్యక్షుడిని హుటాహుటిన ఢిల్లీ రప్పించింది. అక్కడ ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చల సరళి ఎట్లున్నదో ఉత్తమకుమార్ రెడ్డి బయటకు వస్తుండగా కన్పించిన హావభావాలను బట్టి తెలిసిపోయింది. ఆ వెంటనే హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఏదో జరిగిపోతుందని ఇతరుల మాట అట్లుంచి స్వయంగా కాంగ్రెస్‌వదులు కూడా ఆశించి ఉండరు. గత ఎన్నికల తర్వాత ఈ రెండేళ్లలో ఇటువంటి సమావేశాలు ఎన్ని జరిగాయో ఎవరూ లెక్కపెడుతుండి కూడా ఉండరు. ఇక్కడివారు ఢిల్లీకి, అక్కడివారు హైదరాబాద్‌కు ప్రయాణించడం ఒక ఆనవాయితీగా మారి ఏమీ సాధించలేదు. అటువంటప్పుడు, ఇప్పుడేదో సాధిస్తారని ఎవరు ఆశించగలరు గనుక. కాకపోతే, ఈ విడత వెళుతున్న వారిలో ఒక సిట్టింగ్ ఎంపి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపి, ఒక మాజీ ఎమ్మెల్యే ఇతర ముఖ్యులు ఉండడం, వారు తెలంగాణలోని మూడు బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడం, పార్టీకి మిగిలిన చివరి స్థావరంగా భావించే నల్లగొండ జిల్లా దెబ్బతింటుండడం ఢిల్లీ నాయకత్వాన్ని సహజంగానే భయపెట్టింది. కనుక పిసిసి అధ్యక్షునితో ఢిల్లీ సమావేశం, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యాన హైదరాబాద్ సమావేశం జరిగాయి. ఇదంతా వీరి భయాలకు అద్దం పట్టింది తప్ప, ఎదో జరుగనున్నదని ఎవరూ అనుకొని ఉండరు.
చివరకు అంతే అయింది. తమ వారిని అధికారపక్షం కొంటున్నది, ఇతర ప్రలోభాలు చూపుతున్నదని నిందించడం, తనవారు స్వలాభం కోసం పార్టీ మారుతున్నారనడం, ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మాట, ప్రజల సమస్యలపై లపై పోరాడగలమని ప్రకటించడం, సంస్థను బలోపేతం చేయగలమనే ప్రతిజ్ఞలు అన్నీ షరా మామూలుగా జరిగిపోయాయి. తర్వాత జిల్లాల్లో సభలు పెట్టి ఇవే మాటలు మరోమాట చెప్పారు. కనుక స్వయంగా పార్టీ వాదులకు కొత్త ఆశలు ఏమీ కలిగివుండవు. ప్రజల మాట సరేసరి. ఇది చాలదన్నట్టు మరొకటి కూడా జరిగింది. గాంధీ భవన్ సమావేశంలో నాయకుల మధ్య సగకాలం పరస్పర వాదనలు, ఆరోపణలతోనే గడిచినట్టు వార్తలు సూచించాయి. ఇటువంటివి కాంగ్రెస్‌లో మామూలన్నది నిజమే కాని, ఇటువంటి విపత్కర స్థితిలోనూ వారికి వివేకం కలగకపోవడం గమనించదగ్గది. మొత్తానికి ఈ వార్తలతో, ఎవరికి ఏవైనా ఆశలు రేకెత్తి ఉంటే ఆవిరైపోవచ్చును.
ఒకవైపు తతంగం సాగుతుండగా మరొకవైపు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సరిగ్గా కాంగ్రెస్ పైనే గురిపెట్టి తీవ్ర విమర్శలు సాగించారు. పార్టీలో చేరుతున్నవారు అత్యధికులు కాంగ్రెస్ వాదులు కావడం, నగరంలోని మరొకచోట కాంగ్రెస్ నాయకులు సమావేశమవుతుండడం అందుకు కారణాలనుకోవాలి. ఆయన విమర్శల్లో ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఆరోపణలున్నాయి. గతంలో టిఆర్‌ఎస్ సభ్యులను కాంగ్రెస్‌లోకి చేర్చుకోవడం మాటేమిటి తరహావి ప్రశ్నలు. 2014లో గెలిచిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడకుండా చూసేందుకు తెలుగుదేశంతో కలిసి కుట్ర పన్నారనేది ఆరోపణ. టిఆర్‌ఎస్ సభ్యులను చీల్చటం సరికాదని తాను అన్నట్టు జానారెడ్డి వ్యక్తిగత వివరణ ఇవ్వడాన్ని మినహాయిస్తే, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, ఢిల్లీ నాయకులు కెసిఆర్ ప్రశ్నలకు, ఆరోపణకు కూడా వౌనంగా ఉండిపోవడం గమనించదగ్గది. టిఆర్‌ఎస్‌ను చీల్చడం గురించిన ప్రస్తావన లోగడ వచ్చినపుడు కాంగ్రెస్‌వారు బదులివ్వలేదు. ఈసారీ లేదు. ఇది ప్రజలు గమనిస్తున్నప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వారి గగ్గోలుకు విలువ ఇస్తారా? ఇంతకన్న తీవ్రమైంది కెసిఆర్ చేసిన ఆరోపణ. కాంగ్రెస్, టిడిపివంటి బద్ధ శత్రువులైన పార్టీలు కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసాయన్నమాట ఇంతకుముందు కెసిఆర్ గాని, మరొకరు గాని అన్న ట్టు లేదు. అందువల్ల దానికి ప్రాముఖ్యత ఏర్పడుతున్నది. ఇది విన్న తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయి ఉంటారు. కాంగ్రెస్ నాయకత్వం నుంచి వివరాలను కూడా ఆశించి ఉంటారు. కాని గాంధీభవన్ నుంచి గాని, ఎన్టీఆర్ భవన్ నుంచి గాని, 24-అక్బర్ రోడ్ నుంచి గాని ఏవిధమైన వివరణ లేదు. ప్రజలు నమ్మడం, నమ్మకపోవడం వేరే విషయం. తమవైపునుంచి మాత్రం అటువంటి తీవ్రమైన బహిరంగ నిందకు సమాధానం రావలసింది. అట్లా కానప్పుడు ప్రజలకు కలిగే అభిప్రాయమేమిటో వేరే చెప్పనక్కరలేదు. నారాయణఖేడ్, పాలేరు ఎన్నికల్లో ఈ పార్టీలు కలిసి పనిచేయడాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేని స్థితిలో ఇటువంటి వౌనం తనకు ప్రమాదకరమని వారు గ్రహించారో లేదో తెలియదు.
గాంధీ భవన్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకపోలేదు. సమన్వయ కమిటీ సమావేశాలను ఇకనుంచి జిల్లాలో నిర్వహించడం, ఈనెలలో మండల, జిల్లా కమిటీలను, వచ్చే నెలలో గ్రామ కమిటీలు, ఆ తర్వాత మాసంలో బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, అన్ని నియోజకవర్గాల్లో వచ్చే నెలలో శిక్షణలు మొదలైనవి వారి నిర్ణయాల్లో ఉన్నాయి. కొంత అటు ఇటుగా ఈ తరహా నిర్ణయాలు గతంలోనూ జరిగాయి. అపుడు అమలై ఉంటే మళ్లీ నిర్ణయించవలసిన అవసరం ఉండదు కనుక ఈసారి చేస్తారేమో చూడాలి. చేస్తే మంచిదే. కాని కాంగ్రెస్‌కు కొత్త ఆలోచనిలు, కొత్త మాటలు లేకపోవడం, ఒక పెద్ద సమస్య. పైన చెప్పినవి చేసినప్పుడు ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడేవి మనం ఇంతకాలం విన్న మాటలకు భిన్నంగా ఏమైనా ఉంటా యా? ప్రజలు వారిని పోయినమారు ఓడించి ఉండవచ్చు. కాని ఎప్పుడైనా మంచిని మంచి అని, చెడును చెడు అని మాట్లాడితే విని నమ్మేందుకు సిద్ధంగా ఉంటారు. ఆ క్రమంలో తిరిగి ఆదరణలు, విశ్వసనీయతలు లభించవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇంత చిన్న అవగాహన అయినా లేకుండా పోయింది. ప్రభుత్వాన్ని, అధికార పక్షాన్ని దూషించడం మినహా మరేమీ చేయనక్కరలేదని, అదే తమను ప్రజలకు ప్రీతిపాత్రులను చేస్తుందని భ్రమడుతున్నారు వారు. ఇంత అనుభవం గల ఇనే్నళ్ల పార్టీ నాయకులకు ఆలోచనలు ఎంతగా నశించిపోయాయో ఇది సూచిస్తున్నది. హైదరాబాద్ స్థాయిలోనే కాదు, ఢిల్లీ ఆలోచనలు సైతం ఇదేవిధంగా ఉన్నాయి. సోనియాగాంధీ కాని, ఆమె కుమారుడు కాని, దిగ్విజయ్‌సింగ్ కాని గత రెండేళ్ల కాలంలో ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు చేసిన మార్గదర్శకత్వం శూన్యం. అయినా జాతీయ స్థాయి లో, ఇతర రాష్ట్రాల్లో ఏమీ చేయలేకపోతున్నవారు తెలంగాణలో భిన్నంగా ఏదైనా చేయగలరని భావించడమే పొరపాటు.
కాంగ్రెస్‌కు తెలంగాణలో ఊరూరా యం త్రాంగం, బలం ఉందని తెలిసిందే. కాని ఢిల్లీ లో, హైదరాబాద్‌లో సరైన నాయకత్వలేమి, గ్రూపు కలహాలు, తగిన ఆలోచనలు లేకపోవడం, వాటి అమలు అంతకన్న జరగకపోవడం అన్నవి సమస్యలు. ఆ పరిస్థితులు సమీప భవిష్యత్తులో మారడం సందేహాస్పదంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు శూన్యానికి దారితీసి, మరో పార్టీకి అవకాశం కల్పిస్తాయి. అటువంటి పార్టీ బిజెపి కాగలదా అన్నది ప్రశ్న.
బిజెపి నాయకులు ఆ మాట ఇప్పటికే పదే పదే అంటున్నారు. టిడిపి అంతర్థానమవుతూ కాంగ్రెస్ బలహీన పడుతున్నదని, కనుక తమకు అవకాశం ఉందని, ఆ స్థానాన్ని ఆక్రమించగలమనది బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇది తేలిక కాదన్నదీ నిజమే. ఆ పార్టీకి ప్రస్తుతం గల బలహీనతలు తక్కువ కాదు. అవి కాంగ్రెస్‌ను మించినవి. కాంగ్రెస్‌కు కనీసం అంతటా యంత్రాంగం ఉంది. నాయకులు, కార్యకర్తలున్నారు. అవి బలహీనంగా ఉండవచ్చుగాక. కాని ఉన్నదానిని నిలబెట్టడానికి లేని దానిని నిర్మించడానికి తేడా ఉంది. అందువల్ల కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కావడం పెద్ద సవాలు. అదే సమయంలో గుర్తించవలసింది ఒకటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎంత పెద్దది అయినా అథోముఖం పట్టి ప్రయాణిస్తున్నది. తిరిగి పైకెదగాలన్న కోరికైతే ఉందిగాని, అందుకు కావలసిన మోటివేషన్, ఆలోచనలు, నాయత్వాలు లేవు. భాజపా చిన్నదైనా ఊర్ధ్వంగా సాగుతున్నది. మోటివేషన్లు బలంగా ఉన్నాయి. నాయకత్వంలో స్థానికంగా కొరతలు ఉన్నా కనీసం జాతీయ స్థాయి నుంచి బలమైన మార్గదర్శకత్వం ఉంది. కేంద్రంలో ప్రభుత్వం వారిది కావడం సరేసరి. ఈవిధంగా కాంగ్రెస్ కన్నా వారికి అనుకూలాంశాలు రాగలకాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు గల అనుకూలాంశాలు మునుముందు బలహీనపడే సూచనలున్నాయి. ఆకాశంలోకి రాయిని విసరేందుకైనా కాంగ్రెస్‌లో సన్నద్ధత కన్పించకపోగా, బిజెపి రాకెట్లను సిద్ధం చేస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ సకాలంలో మేల్కొనని పక్షంలో, 2019 నాటికి మూడవ స్థానానికి పడిపోయి రెండవ స్థానంలోకి భాజపా వచ్చినట్లయితే ఆశ్చర్యపడవలసి ఉండదు. అటువంటి సూచనలు కన్పిస్తే, కాంగ్రెస్ వాదులు ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లోకి పోతున్నట్టు అప్పుడు కొందరు భాజపా వైపు ఆకర్షితులు కావచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి భాజపా వైపు కదలికలు ఉన్నప్పుడు, తెలంగాణలో ఉండబోవని అనగలమా?
అందువల్ల, టిఆర్‌ఎస్ అయస్కాంత శక్తికి, సూర్యాపేట సభలో భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ప్రసంగానికి ఇంతగా ఆందోళన చెందుతున్న కాంగ్రెస్ నాయకులు, కోలుకునే దిశలో ఏమైనా చేయగలరా లేదా అన్నది వచ్చే సంవత్సర కాలంలో తెలిసిపోతుంది. 2017 మధ్యకో, కనీసం చివరికో ఏమీ చేయలేనట్లయితే ఇక మూడవ స్థానంకోసం సిద్ధపడవలసి ఉంటుంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)