మెయన్ ఫీచర్

రాజధాని దారివెంట ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నుండి తాత్కాలిక అమరావతికి తరలిపోవాలా? వద్దా? అన్న తటపటాయింపునకు గురికావడం కుతూహలగ్రస్తులకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో ‘‘కలకల మంటున్న అవశేష ఆంధ్రప్రదేశ్ సచివాలయ ప్రాంగణం నిర్మానుష్యమై వెలవెల పోతున్న’’ దృశ్యం కొందరి ఉత్కంఠకు ప్రేరకం. తాత్కాలిక అమరావతిలో సందడి సముద్రం పొంగి పొరలే దృశ్యాన్ని తిలకించాలన్నది మరికొందరి ఉత్కంఠ. తరలిపోయే ఉద్యోగులు గుంటూరు నుం చి, విజయవాడ నుంచి ఎలా తాత్కాలిక సచివాలయానికి పయనిస్తారు? అన్నది మరో ఉత్కంఠ. ఆరుబయట కిల్లీ దుకాణాలు, కాఫీ కేంద్రాలు, పానీపూరీలు, మిరపబజ్జీ భట్టీలు ఆవిష్కృతమవుతాయా? నిర్వాహకులు ఎవరు? ఇలాంటి బోలెడు సందేహాలు కుతూహల కేంద్రాలు. జూన్ 27 నాటికే రాజధాని తరలింపు పూర్తవుతుందనుకున్న వారికి ఆగస్టు 31వ తేదీ వరకు ఎదురు చూడవలసి రావడం మరికొంత ఉత్కంఠ. జూన్ 27 నాటికే తాత్కాలిక అమరావతిని చేరుకుంటామన్న ఆశతో సమీప ప్రాంతాలలో కిరాయి ఇళ్లు ఏర్పాటు చేసుకున్న వారికి అద్దెలు నష్టమైపోతున్నాయి. హైదరాబాద్‌లోను, అమరావతిలోను రెం డు నెలల పాటు వారు అద్దె చెల్లించాలట. హైదరాబాద్‌లోనే ఉండి ప్రతి రోజు తాత్కాలిక రాజధానికి వెళ్లి వచ్చేవారికోసం ప్రత్యేక రైలు కూడా అమిత వేగంగా పరుగులు తీయడం ఆరంభమైపోయింది. ఇలాంటి ఉద్యోగులు తెల్లవారు జామున నాలుగున్నరకు ఇంటి నుండి బయలుదేరి రైలెక్కి అమరావతికి వెళతారు. మళ్లీ గుంటూరులో రైలెక్కి రాత్రి పనె్నండున్నరకు ఇల్లు చేరుతారట. ఎంత ఉత్కంఠ..?
ఇలా అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గత రెండేళ్లకు పైగా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఏకైక కార్యక్రమం నూతన రాజధాని నిర్మాణం. నాటకంలోని అంతర్నాటకం అమరావతి ఆవతరణలో తాత్కాలిక అమరావతి ఘట్టం ఇప్పుడు నడుస్తోంది. ఏవో కొన్ని చిన్నచిన్న ఇతరేతర కార్యక్రమాలు కూడ నవ్యాంధ్రప్రదేశ్‌లో రూపుదిద్దుకుంటున్నాయి. కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు దృష్టి మొత్తం విదేశాల వారి ఆధ్వర్యంలోని నూతన రాజధానిని నిర్మించడంలో నిమగ్నమై ఉంది. స్వదేశీయ పరిజ్ఞానం, స్వదేశీయమైన పనిముట్లు, స్వదేశీయ నిర్మాణ నిపుణులు రాజధాని నిర్మాణానికి పనికిరాని పరిస్థితి నెలకొని ఉండడం ప్రపంచీకరణలో భాగం. ఇచ్ఛాపురం నుంచో, హిందూపురం నుంచో పరిజ్ఞాన, పదార్ధ, ప్రక్రియా నిర్వాహకులను రప్పించి అమరావతిని నిర్మించినట్టయితే ప్రపంచీకరణ స్థాయి మనకు ఉన్నట్టు కాదు, అది ప్రాంతీయ వైపరీత్యానికి నిదర్శనం. పోనీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు గల సువిశాల సనాతన సీమలో ‘తాపీ’లు, ‘మేస్ర్తి’లు స్థపతులు-ఇంజనీర్‌ల, నిర్మాణ శిల్పులు దొరకరా? అని అడిగిన వారికి ‘‘దొరుకుతారు..’’ అన్న సమాధానం వస్తోం ది. కానీ కేవలం ‘‘మాంథాత కాలం నాటి’’ భారతదేశానికి మాత్రమే ఈ వినూతన అమరావతి రూపకల్పనను పరిచయం చేసినట్లయితే అది సంకుచిత ప్రొటెక్షనిస్ట్-‘జాతీయతా ఉన్మాదం’ అన్న చెడ్డపదేరు మనకు అమెరికాలోను, టింబక్టూలోను వచ్చి పడే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి ప్రమాదాన్ని తప్పించడానికే మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం క్రీస్తుశకం 2014 మే 25 వరకు ఐదేళ్లపాటు అంతర్జాతీయ అనుసంధానాన్ని ఏర్పాటు చేసింది.
గత రెండేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వారు ఈ ప్రపంచీకరణ వారసత్వ సంపదను మరింతగా పెంపొందిస్తుండడం ప్రాంతీయ రాజధాని నిర్మాణానికి అమరిన అంతర్జాతీయ నేపథ్యం. ‘‘అంతర్జాతీయ హితసాధన’’కు సంబంధించిన అంశాలలో ఇలా మనదేశంలోని దాదాపు అన్ని జాతీయ ప్రాంతీయ, రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం కొనసాగుతుండడం దేశ ప్రజలు విస్మయ, ఆశ్చర్య చకితులై వీక్షిస్తున్న అద్భుతం. మనదేశంలోని మారుమూల పల్లెలోని వంట ఇంటిలో, అమెరికా జామ్స్‌ను, కొరియా బ్రెడ్డును, చైనా నుంచి వచ్చిన ప్లేట్లలో పెట్టుకొని ‘చక్కెరమ్మ’, ‘చక్కెరప్ప’ దంపతులు వారి పిల్లలు జపాన్ ‘సపూన్’లతో ఆరగిస్తుండడమే అంతర్జాతీయ అనుసంధానం. అందువల్ల అమరావతి వంటి విశ్వనగరాన్ని-విదేశీయులందరూ ఈర్ష్యా అసూయలతో కుతకుతలాడిపోయేవిధంగా- నిర్మిం చ తలపెట్టిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నాటీ’ పరిజ్ఞానాన్ని ఏవగించుకోవడం ఆశ్చర్యకరం కాదు. సింగపూర్‌నుంచి మలేసియా నుంచి నిర్మాణ వ్యవస్థను దిగుమతి చేసుకొనడం విడ్డూరం కాదు.
విదేశాలనుంచి వచ్చిపడిన ప్రతిదానిని గొప్పగా చూడడం మనకు బ్రిటన్ దురాక్రమణ కాలం నుంచి సంక్రమించిన వారసత్వం. స్వదేశీయ-నేటివ్-తకు సంబంధించిన ప్రతిదాన్ని బ్రిటన్ నుంచి వచ్చినవారు చిన్నచూపు చూశారు. అందువల్ల బ్రిటన్ దొరల మెప్పును పొందిన మన దొరలు కూడ నేటివ్ పదార్ధాలను పరిజ్ఞానాన్ని ప్రజలను చిన్నచూపు చూశారు. అడివి బాపిరాజు రచించిన నారాయణరావు నవలలో క్రీస్తుశకం ఇరవై శతాబ్ది ఆరంభం నాటి సంపన్నుల జీవన విధానం, ఆవిష్కృతమైంది. విశ్వలాపురం జమీందారు గారి ఇంటిలో బంధువులు విందు ఆరగించారు..స్పెన్సర్స్ కంపెనీ వారు తయారు చేసిన ‘వెండి’గలాసులలో అతిథులకు మంచినీరు ఇచ్చారట. నేటివ్-స్వదేశీయ-స్వర్ణకారుడు చేసిన వెండి పాత్రలు పనికిరాలేదు. స్పెన్సర్స్ వెండి గ్లాసులు గొప్ప! అందువల్లనే కదా ప్రస్తుతం మన సంపన్నులు, మేధావులు, మధ్యతరగతి వారు, మద్యం మరిగిన వారు అందరూ కూడ విదేశం నుండి వచ్చిన ‘వోల్వో’ బస్సులెక్కి ఊరేగుతున్నారు. మన దేశంలో తయారైన బస్సు లు కూడ మనకు అవమానకరం..నేటివ్ అన్న పదం ‘నాటు’ గాను, ‘నాటీ’గాను చెలామణి అయ్యింది. అందుకే మనకు స్వదేశీయ-నాటు మైనవి ఏవీ పనికిరావు. చంద్రబాబు నాయుడు మరోసారి ధ్రువీకరిస్తున్నారు. మరో సింగపూర్‌ను, షాంఘైని, న్యూయార్క్‌ను, టింబక్టూను సనాతన శుభంకర అమరావతి క్షేత్ర సమీపంలో నిలబెట్టడానికి నడుం బిగించారు.
ద్వాపరయుగం చివరిలో ద్రోణాచార్యుడు అన్న ధనుర్విద్యావేత్త శిష్యులకు గురిచూసి కొట్టడం నేర్పించిన ఘట్టం అవశేషాంధ్ర రాజధాని నిర్మాణ విషయంలో మరో విధంగా పునరావృత్తం అవుతోంది. దూరంగా చెట్టుమీద ‘‘కూర్చుండి ఉండిన పక్షి బొమ్మ ’’కన్ను గుడ్డునకు గురిచూసి బాణంతో కొట్టాలన్నది ద్రోణాచార్యుల ఆదేశం. శిష్యులలో కొందరికి చెట్టు మొత్తం కనిపించింది. మరికొందరికి పక్షి మాత్రమే కనిపించింది. ఇంకా కొందరు పక్షి కన్నుతో సహా దాని ముఖాన్ని చూశారు. వారందరూ బాణాలు వదలి గురితప్పారు. అర్జునునికి మాత్రం పక్షి కంటిలోని గుడ్డు తప్ప మిగిలినవి ఏవీ కనిపించలేదట. అందువల్ల ఆచార్యుడు ‘కొట్టు’ అని అనగానే ఆ పాం డవ మధ్యముడు లక్ష్యాన్ని బాణం వేసి ఛేదించాడు. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడికి సైతం రాజధాని నిర్మాణం తప్ప మరో లక్ష్యం కనిపించడం లేదు..పోలిక దృష్టి కేంద్రీకరణకు మాత్రమే పరిమితం. అందువల్లనే తరలింపు గురించి ఆయన దృష్టి పెట్టినట్టు లేదు. తాత్కాలిక రాజధాని భవనాలకు పూసిన సిమెంటు పచ్చి ఆరనేలేదు. డబ్బాలు, రాళ్లు తదితర నిర్మాణ సామగ్రి దృశ్యమాధ్యమాలలో చెల్లాచెదరుగా దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో తరలింపు జూన్ 27లోగా జరిగిపోతుందని చంద్రబాబు ఢంకా బజాయించారు. ఆగస్టు 31 వరకు గడువు పెరగడం వేరే సంగతి...
తాత్కాలిక రాజధాని నిర్మాణమైపోయిన తరువాత తరలింపునకు ఎందుకని ముహూర్తం పెట్టుకోరాదు? శాశ్వత రాజధాని నిర్మాణ నిమగ్న ప్రభుత్వ చిత్తవృత్తికి మిగిలినవి ఏవీ తోచినట్టు లేదు. తోచి ఉండినట్టయితే ఇప్పుడు నిర్మించిన తాత్కాలిక రాజధానికి రెట్టింపుగానో నాలుగు రెట్లుగానో విస్తరించి ఉండినట్టయితే అదే శాశ్వత రాజధాని అయి ఉండేది. మలేసియాకు, జపాన్‌కు, సింగపూర్‌కు, చైనాకు, సైబీరియాకు పరులుగు తీయడం అవసరమయి ఉండేది కాదు. భూమి సేకరణ, - అని అంటూ పచ్చని వేల ఎకరాల పంట పొలాలను పాడు చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఈ రెండేళ్లలో స్వదేశీయ పరిజ్ఞానంతో రాజధాని ఏర్పడిపోయి ఉం డేది. రాజధాని పాలనాకేంద్రంగా మాత్రమే ఉండాలన్నది అనాదిగా భారతీయ రాజ్యాంగ పద్ధతి. రాజధానిలో వాణిజ్య కేంద్రాలు, విహార కేంద్రాలు, విద్యాకేంద్రాలు, క్రీడా కేంద్రాలు, చలనచిత్ర విచిత్ర ప్రాంగణాలు తొమ్మిది రకాల పట్టణ నగర వాటికల ఏర్పాటు చేయనక్కరలేదు. ఈ సనాతన భారతీయ పద్ధతిని ఇప్పుడు అమెరికా వారు తమ రాష్ట్రాల రాజధానులకు వర్తింప చేయనున్నారు. మనం మాత్రం న్యూయార్క్, షాంఘయి, సింగపూర్, టోక్యోలన్నీ కలిసినంత విస్తీర్ణలో కాలుష్యాన్ని కేంద్రీకరించి రాజధానిని కట్టుకుంటున్నాము. రాజధాని ప్రాంగణంలో ఐదు నక్షత్రాల హోటళ్లు కూడా ఉంటాయట. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి ఐదు నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యాలు సంగమించిన చోట ఈ ఫైవ్ స్టార్ హోటళ్లు..
లార్డ్ వౌంట్ బాటెన్ దేశ విభజన సమయంలో గవర్నర్ జనరల్ పదవి పోయిన తరువాత 1960వ దశకంలో ఆయన మన దేశానికి వచ్చాడట. ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని తన గైడ్ సినిమాను ఇంగ్లాండ్‌లో ప్రచారం చేయడానికి హిందీ నటుడు దేవానంద్ యత్నించాడట. గైడ్ రచయిత ఆర్‌కె నారాయణన్ తమ ఆత్మకథలో ఈ సంగతి వెల్లడించారు. వౌంట్ బాటన్‌కు ఈ వాణిజ్యపుటెత్తుగడ తెలియదట. గవర్నర్ జనరల్‌గా పనిచేసిన వాడిని వాణిజ్య ప్రచారకర్తగా దురుపయోగం చేయడం నారాయణ్‌కు విస్మయం కలిగించిందట. ఇప్పుడు స్టార్ హోటళ్ల వారు ముఖ్యమంత్రులనుప్రచార కర్తలుగా ఏర్పా టు చేసుకుంటున్నారు. ఇదే ప్రపంచీకరణ...

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్ : 09951038352