మెయిన్ ఫీచర్

అదనపు వ్యాపకాలపై ఆరాటమెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టిపొట్టి మాటలతో నట్టింట సందడి చేసే వయసులో పిల్లలకు అదనపు వ్యాపకాల పేరుతో శాస్ర్తియ నృత్యాలు నేర్పించటం అవసరమా అని అంటే పిల్లల మానసిక నిపుణులు ఖచ్చితంగా వద్దనే చెబుతారు. నాలుగేళ్లు కూడా నిండకుండానే ప్లేస్కూల్ అంటూ పంపించేస్తున్నారు. అలాగే ఆ వయసులో మెదడు చురుకుగా ఉంటుంది కాబట్టి దానికి పదును పెడితే మరింత రాటు తేలుతుందనే ఆరాటంలో ఆ చిన్నారులను భరత నాట్యం వంటి వాటికి అలవికాని నృత్యాలు నేర్చుకోమని పంపటం ఏమాత్రం మంచిదికాదని అంటున్నారు. ‘‘నాలుగేళ్ల అమ్మాయి శాస్ర్తియ నృత్యం నేర్చుకోవటానికి నావద్దకు వస్తుంటుంది. ప్రతిరోజూ కాళ్లకు బరువైన గజ్జెలు కట్టుకొని నృత్యం చేయాలి. ఆ చిన్నారి చేత ఆ బరువైన గజ్జె కట్టించి నృత్యం చేయిస్తుంటే ఎంతో బాధేస్తుందని’’ అవంతికి అనే డ్యాన్స్ టీచర్ చెబుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎదో సాధించాలనే ఆత్రుతలో అతి చిన్న వయసులో వారిని శాస్ర్తియ నృత్యాలకు పంపటం అవసరమా అని ఆమె ప్రశ్నిస్తోంది. నడక వచ్చిందని ఆ పసి కాళ్లకు అంత బరువైన గజ్జెలు కట్టి నడవడిక నేర్పిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పిల్లలు స్కూలు నుంచి రాగానే ఆనందంగా గడపాలని ఆశపడతారు. కాని ఇరవై ఏళ్ల తరువాత అందుకోవాల్సిన కెరీర్‌ను, సాధించాల్సిన విజయాలను వారు పసి వయసులో ఉండగానే తల్లిదండ్రులు ఊహించుకుని వారిని ఇలాంటి శాస్ర్తియ నృత్యాలకు పంపటం వల్ల విపరీతమైన అసహనానికి గురవుతుంటారని మానిసిక నిపుణులు సూచిస్తున్నారు.
స్కూలు నుంచి రాగానే వారిని చక్కగా ఆడుకోనిస్తే వారుపొందే ఆ గాఢమైన అనుభూతి వేరుగా ఉంటుంది. ఇలాంటి అనుభూతిని వారికి అందించాలంటే వారికి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకోవాలి. సమాజంలో వారికి బలమైన పునాది పడేలా, సంతోషంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగేలా గ్రహించి బీజం వేసినట్లయితే అవి జీవితాంతం బాసటగా నిలుస్తాయి. ప్రతి ఏటా వచ్చే వేసవి సెలవుల్లోనూ, స్కూలు నుంచి ఇంటికి రాగానే మనం వారికి నేర్పించే అదనపు వ్యాపకాలు కొనసాగేలా ఉండాలి. అలాంటివి వారి హృదయంలో సమాంతరంగా ఎదుగుతూ వస్తాయి. అవి పూర్తిగా వారికి మనసుకు నచ్చేవైతేనే జరుగుతోంది.
పిల్లల్ని అర్థంచేసుకోవటానికి ప్రయత్నించండి. పిల్లలు ఐదు నిమిషాలు కూడా కుదురుగా కూర్చోవటానికి ఇష్టపడకపోతే వారికి డ్రాయింగ్ వంటి వ్యాపకాలను నేర్పించవద్దు.
పిల్లలకు సాయంత్రం వేళల్లో లేదా వారాంతరాల్లో వారికి నచ్చిన ఆటలు లేదా ఏదైనా తేలికపాటి కళను నేర్పించేలా ప్రోత్సహించండని చెబుతున్నారు.
అపుడపుడే స్కూలుకు వెళుతున్న పిల్లలకు బొమ్మల పుస్తకాలు ఇచ్చి వాటిని చూపిస్తూ కథలు చెప్పండి. అలా కథలు చెప్పటం వల్ల వారు కాస్తంత పెద్దయిన తరువాత పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలు కూడా చదివే అలవాటు వస్తోంది. కథలు పుస్తకాలు చదివే పిల్లలను ప్రోత్సహిస్తూ చిన్న చిన్న బహుమతులు ఇస్తే ఎంతో మంచిది.
పిల్లలు చేసే పనులను మాటలతో వర్ణిస్తూ మెచ్చుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం అభివృద్ధిచెందుతోంది.
తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయం కేటాయిస్తే ఇది తల్లీబిడ్డల మధ్య నెలకొన్న బంధాన్ని ఇనుమడింపజేస్తోంది.
పిల్లలకు నేర్పించే అదనపు వ్యాపకాల లిస్ట్ తయారుచేసి వారికి విడమర్చి చెప్పండి. జీవితమంతా కొనసాగేవి, కొనసాగని వాటి గురించి విడమర్చి చెబితే ఆ చిట్టి మనసులు అర్థంచేసుకుని వాటిని ఎంపికచేసుకుంటారు. ఏదో ఒకటి ఎంచుకుని జీవితమంతా పులకరింతల్ని సొంతం చేసుకుంటారు.
chitram...
చక్కగా ఆడుకునే పిల్లల్లో కనిపించే ఆనందమే వేరు!

టి.ఆశాలత