సబ్ ఫీచర్

‘బంగారు తల్లి’ దర్శిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె పైలెట్ కావాలనుకుంది... కానీ, శారీరకంగా తగినంత ఎత్తులేక అవకాశం కోల్పోయింది. అయినా- ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. అదికాకపోతేనేం..? గగనవీధిలో విహరించలేకపోయినా ‘తలెత్తుకు తిరిగే’ అవకాశాలు కొల్లగొట్టాలని భావించింది. ధైర్యంగా ఒక్కో అడుగూ వేసింది. అందుకు తగ్గ ఫలితాలు సాధించింది. కేరళలోని కన్నూర్‌కు చెందిన ఈ అమ్మాయి భారతీయ నౌకాదళానికే గర్వకారణం. ఆమె పేరు దర్శితబాబు. ప్రస్తుతం విశాఖలో నేవల్ ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్న ఆమె ఈ స్థితికి ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఓ స్ఫూర్తిదాయక కథనమే అవుతుంది. ‘ఆమె ప్రతిభ నౌకాదళంలో మరింతమంది మహిళలు చేరడానికి ఆమె కారణం అవుతోంది’ అని స్వయంగా చీఫ్ ఆఫ్ నేవల్ స్ట్ఫా ఆర్.కె.్ధవన్ ప్రశంసలు కురిపించారు. నేవల్ క్యాడట్‌గా శిక్షణ పొందుతూ విశిష్టమైన రెండు బంగారు పతకాలను దర్శిత సాధించడంతో ఉబ్బితబ్బిబ్బైన ఆయన ‘పాసింగ్ ఔట్ పరేడ్’ అనంతరం ఆమెను ఎంతగానో ప్రశంసించారు.
పేదరికం నుంచి..
కేరళలోని కన్నూరు ప్రాంతంలోని ఓ స్కూలు గుమాస్తాగా పనిచేస్తున్న దినేష్‌బాబు, లిస్సీ దంపతులు తమ పెద్దకూతురు దర్శితకు చిన్నప్పటినుంచే దేశభక్తిని నూరిపోశారు. వారిది మధ్యతరగతి కుటుంబం. ఎన్‌సిసిలో చేరమని ప్రోత్సహించడమే గాక, దర్శితకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించిన ఆమె ఎన్‌సిసిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. కేరళ-లక్షద్వీప్ ఎన్‌సిసి డైరక్టరేట్‌లో విశేష ప్రతిభ కనబర్చిన క్యాడట్‌గా నిలచి ‘చీఫ్ మినిస్టర్ గోల్డ్‌మెడల్’ను కైవసం చేసుకుంది. ఆ తరువాత ఆమె పైలట్ కావాలనుకుంది. కేవలం అర సెంటీమీటర్ పొడవు చాలనందున ఆమెకు అవకాశం దక్కలేదు. అయినా ఆమె నిరాశ చెందలేదు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేరాక నేవల్ ఆర్కిటెక్చర్ కోర్సు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు ఎజిమొలిలోని నేవల్ అకాడమీలో అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఇండియన్ నేవల్ అకాడమీలో తొమ్మిదవ బ్యాచ్‌లో శిక్షణ పొందిన మహిళా క్యాడెట్లలో ఆమె ప్రథమురాలిగా నిలిచింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 22మందిలో ఆమె ఒకరు. అన్ని అంశాల్లో మెరిట్ సాధించినందుకు ‘చీఫ్ ఆఫ్ నావల్ స్ట్ఫా గోల్డ్ మెడల్’ ఆమెను వరించింది. ఇక ‘్ఫ్లగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (సౌత్) గోల్డ్‌మెడల్‌ను బెస్ట్ ఉమెన్ ట్రెయినీగా ఘనతను సాధించింది. ఒకేవ్యక్తి ఇలా రెండు పతకాలను సాధించడం ఇదే ప్రథమం. అందుకే ఆమె దేశవ్యాప్త సంచలనానికి కారణమైంది. ఐదునెలల కోర్సులో ఈమె సాధించిన రెండు పతకాలు విశిష్టమైనవి. ఇప్పుడు ఆమె నావల్ ఆర్కిటెక్చర్ ఆరునెలల కోర్సులో విద్యాభ్యాసానికి విశాఖలో ఉన్నారు. ఆమె సోదరి పేరు దయిత.
బహుముఖ ప్రజ్ఞాశాలి...
విద్యలోనే కాదు ఇతర రంగాల్లోనూ ఆమెది అందెవేసిన చేయి. భరతనాట్యంలో ఆమెకు సాధికారమైన ప్రవేశం ఉంది. మోహినీ అట్టం, కూచిపూడి నృత్యంలో ఆమెకు తిరుగులేదు. ఆమె మంచిగాయని కూడా. కేరళ యూనివర్శిటీ మహిళా ఫుట్‌బాల్ టీంలో సభ్యురాలిగానూ ఆడింది. ఇక కరాటేలో బ్లాక్‌బెల్ట్ గ్రహీత కూడా. ‘చిన్నప్పటినుంచి ఆమెలో ఏదో ప్రత్యేకత కన్పించేది. మిగతాపిల్లలకన్నా విభిన్నంగా ఉండేది. ఆమెను ఎన్‌సిసిలో చేర్పించాలన్పించింది. ఆ నిర్ణయమే ఆమెకు దిక్సూచిగా నిలిచింది’ అని మురిసిపోతున్నారు ఆమె తల్లిదండ్రులు దినేష్, లిస్సీ. నిజానికి ఆమెను చూసి దేశమే మురిసిపోతోంది కదూ..!

-ఎస్.కె.కె.రవళి