మెయిన్ ఫీచర్

పైరసీ పైశాచికత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పైరసీ మహమ్మారి దెబ్బకు తెలుగు చిత్ర పరిశ్రమ అతలాకుతలమవుతోంది. గతంలో కేవలం ఆడియో క్యాసెట్లు మాత్రమే పైరసీ ద్వారా సినిమా విడుదల కకముందే జనాల్లోకి వచ్చేవి. ఇపుడు ఏకంగా సినిమాలనే నేరుగా నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేస్తున్నారు. నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు నిర్మిస్తుంటే సినిమా విడుదలయిన గంటల్లోపే డౌన్‌లోడ్ చేసి చూస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇంతకంటే పైశాచికమైన చర్య ఇంకేమైనా ఉందా?
ఒక సినిమా తీయాలంటే కథ, మాటలు, పాటలు, నేపథ్య గాయకులు, స్టంట్ మ్యాన్, హీరో హీరోయిన్లను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు ఎంతటి కష్టాల కోర్చయినా తాము అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చే విధంగా నెలల తరబడి తమ మెదడును సానబెట్టి నిర్మిస్తే, తీరా ఆ సినిమా విడుదలవుతుందో లేదో తెలియదు. సెన్సార్ బోర్డు దగ్గర ఆగిపోయేది కూడా తెలియదు. ఒకవేళ విడుదలయినా ఎన్ని సెంటర్లలో నడుస్తుందో తెలియదు, ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఒక సినిమాను డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అన్ని ప్రాంతాల్లో ఒకే రోజున విడుదలయ్యేలా చూడాలి. ఇంత కష్టం భరించి నిర్మాతలు చిత్రాలు నిర్మిస్తుంటే రోజులు గడవకముందే ఆ సినిమాలు పైరసీకి గురవుతున్నాయి.
ఈమధ్యన మోహన్‌బాబు ద్విపాత్రాభినయంతో నటించిన ‘గాయత్రి’ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించిన ప్రేక్షకులు ఉన్నారు. ఇలా గంటల్లోపే విడుదల చేసిన చిత్రాన్ని నేరపూరితంగా పైరసీ ద్వారా చూస్తూ పైశాచికానందంతో తృప్తిపొందుతున్నారెందరో. ఇలా చెయ్యడంవల్ల వారికి వచ్చేదేమీ లేదు. ఒకప్పుడు సినిమా థియేటర్లలోనే కెమెరాల ద్వారా, సెల్‌ఫోన్‌ల ద్వారా ఆ సినిమాను రికార్డు చేసి వీక్షించేవారు. సినిమా థియేటర్ల యజమానులకు ఎంతో కొంత డబ్బు ఆశ చూపి వీడియోలు తీసి గతంలో వేలకు వేలు క్యాసెట్లు అమ్ముకుని లక్షలు ఆర్జించినవారున్నారు. అలా లక్షలు ఆర్జించిన ఘనుల్లో కేసులు పెట్టబడి కష్టాల పాలయినవారు కూడా ఉన్నారు. కానీ ఇంత ఘోరం మాత్రం ఎప్పుడూ జరగలేదు. చాలాకాలం తరువాత మోహన్‌బాబు ఒక మంచి కథతో సినిమా తీస్తే అది పైరసీ పాలైంది. ఎంత దుర్మార్గం?
ఒక సినిమాను నిర్మించాలంటే నిర్మాత ఎన్ని ఖర్చులకు, కష్టాలకు, నష్టాలను భరించవలసి వస్తోంది. హీరో, హీరోయిన్లకు, అందులో నటించిన వారందరికీ ముందే అనుకున్న విధంగా నగదును ముట్టచెప్పాల్సి వుంటుంది. ఆ సినిమా పాస్, ఫెయిల్‌తో వారికి పెద్దగా సంబంధం లేనట్టే ముందే తీసుకుంటారు. ఇదే ఒకవేళ పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు, దర్శకులతో తీసినట్లయితే వారికిచ్చే చెల్లింపుల్లో భారీ ఎత్తునే అంచనాలు కోట్లలో వుంటాయి. ఇక మాటలు, పాటలు, దర్శకత్వం వహించేవారు (అసిస్టెంట్ డైరెక్టర్స్), మేకప్, నేపథ్యగాయకులు, సంగీతం, స్టంట్ మాస్టర్స్, కొరియోగ్రాఫర్స్, కాస్ట్యూమ్స్ డిజైనర్స్ వారిని బట్టి వీరి స్థాయిలో చెల్లించాల్సి వుంటుంది. వీరందరికయితే సినిమా నడిచిందా? లేదా? అనే అంశంతో అస్సలు సంబంధమే ఉండదు. తమ పనికి తగినన్ని పైసలు వచ్చాయా? లేదా? అన్న విషయమే ముఖ్యం. ఇక కెమెరాలు మోసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, డ్రైవర్లు, వండేవారు, వడ్డించేవారు అన్నట్లుగా అందరికీ ఎవరి పనికి తగినట్లుగా వారికి డబ్బులు చెల్లించాల్సి వుంటుంది. ఇంత చేసినా కూడా ఆ చిత్రం విడుదలయ్యేంతవరకు నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతూనే వుంటాయి. క్షణం ఒక యుగంలా నరకం అనుభవిస్తుంటారు నిర్మాతలు. అలాంటివారికి తమ సినిమా పైరసీకి గురయినట్లు తెలియగానే ఒక్కసారిగా వారి పంచ ప్రాణాలు గాల్లోనే పోతాయి. అప్పులు తెచ్చి, ఆస్తులు కుదువపెట్టి సినిమాలు తీస్తే చివరకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. వారి జీవితాలను నాశనం చేస్తున్నాయి.
కొంతమంది కథానాయకులు వారి సొంత బ్యానర్‌లోనే సినిమాలు నిర్మించుకుంటున్నారు. ఇక ఆ సినిమా నడిచినా, నడవకపోయినా లాభ నష్టాలు అన్నీ స్వయంగా వారే భరించుకోవలసిన పరిస్థితి. ఎందుకంటే తమ సొంత బ్యానర్‌లో తీయడమే అందుకు కారణం. సీనియర్ నటులు, మాజీ రాజ్యసభ సభ్యులు, నిర్మాత మంచు మోహన్‌బాబు తమ బ్యానర్‌లో తీసిన సినిమా విడుదలైన గంటలోపే పైరసీకి గురైంది. ఎంత అవమానకరం? ఆ సినిమా నిర్మించడంవల్ల కేవలం తానొక్కడు, తన కుటుంబం ఒక్కటే ఏమైనా బాగుపడిందా? దర్శకులు, పాటలు, మాటలు రాసినవారు, కథ రాసినవారు, నటులు, 24 ఫ్రేమ్స్‌లలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత పైసలు ముట్టలేదంటారా? మరి ఇలాంటి హీరోలను, నిర్మాతలను ఇంత రాక్షసంగా హింసించడం న్యాయమేనా? మోహన్‌బాబుకే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే మరి చిన్న చిన్న నటులు, నటీమణులు, దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాల్సిందే. కాబట్టి తెలుగు కళామతల్లిని కాపాడుకోవాలంటే పైరసీ భూతాన్ని తరిమికొట్టాలి.

-శ్రీనివాస్ పర్వతాల