మెయిన్ ఫీచర్

త్రిశక్తి స్వరూపిణి స్ర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకార, రకార, తకారముల మేలు కలయిక స్ర్తి. సత్వ రజస్ తమోగుణములచే నేర్పుగా చేయబడిన చర ఆకృతి స్ర్తి. ఆమెలో సాధుస్వభావం, రజోగుణమైన దర్పము, గాంభీర్యము, తకారమైన తపస్సు, గుణ సంపదలుగా కూర్చబడిన త్రిశక్తి స్వరూపిణి స్ర్తి. స్వర్గంలో బ్రహ్మదేవుడు స్ర్తిని తయారు చేస్తే భూమిపై ఉత్తమ పౌరులను ఓ మహిళ ఎలా తయారుచేసి సమాజానికి అందిస్తోందో ఈనాడు పురుషప్రపంచం తెలుసుకోవాలి.
సమాజానికి సత్పురుషును తయారు చేయాలనే ధృడ సంకల్పంతో జ్యోతిలా తాను కరిగిపోయే క్రొవ్వొత్తి ప్రపంచానికి వెలుగులు పంచుతూ తాను మాత్రం కాలంలో కలసిపోయే ఒక కమ్మని జ్ఞాపకం. స్ర్తి ప్రేమను అందించినట్లే ఆగ్రహిస్తే ఆదిశక్తిగా అవతరించగలదు.
నేడు క్రీడా,రక్షణ దళం, నౌకాదళం, వైద్య పరిపాలన, ఆధ్యాత్మిక వంటి అనేక రంగాల్లో ఎన్నో ఎనె్నన్నో శాఖలలో సమర్థవంతంగా ప్రయాణిస్తోంది మహిళ. ఉద్యమాలు చేసి మహిళాహక్కులను గుర్తు చేయడానికి ఓ వీరేశలింగం, ఓ అబ్దుల్ కలాం, ఓ రాజారామ్‌మోహన్ రాయ్ వంటివారు ఇంకా రావాలనుకోకూడదు. మహిళలే తమ హక్కులను, లక్ష్యాలను క్షుణ్ణంగా తెలుసుకొని బాధ్యతతో భవిష్యత్తునిర్మాణం చేపట్టాలి. మహిళాభ్యుదయ కార్యాలు చేపట్టడంలో ముందుండాలి.
వంటింటినుంచి పార్లమెంటుదాకా ఎదిగినా ఇంకా అనేక అవరోధాలను ఎదుర్కొంటునే ఉంది నేటి మహిళ. ప్లైయింగ్ ఆఫీసర్ అవానీ చతుర్వేది మగ్ 21 బైనస్ అనే యుద్ధ విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ఒంటరిగా నడిపి తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించగలిగింది. అంతటి సత్తా వున్న స్ర్తి శక్తి మగరాయళ్ల వల్ల కలిగే అవరోధాలను, ఆటంకాలను తెలివితో , ప్రజ్ఞతో తొలగించుకుని ఇంకా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. భావితరాలకు భవ్యమైన భవిష్యత్తునివ్వడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అపుడే 21వ శతాబ్దిలోనూ వేదకాలంలో స్ర్తికి దక్కిన గౌరవం తిరిగి సొంతమవుతుంది. మహిళాలోకమెప్పుడూ చారిత్రాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.
నేడు క్రీడా, రక్షణ దళం, నౌకాదళం, వైద్య పరిపాలన, ఆధ్యాత్మిక వంటి అనేక రంగాల్లో ఎన్నో ఎనె్నన్నో శాఖలలో సమర్థవంతంగా ప్రయాణిస్తోంది మహిళ. ఉద్యమాలు చేసి మహిళా హక్కులను గుర్తు చేయడానికి ఓ వీరేశలింగం,
ఓ అబ్దుల్ కలాం, ఓ రాజారామ్‌మోహన్ రాయ్ వంటివారు ఇంకా రావాలనుకోకూడదు. మహిళలే తమ హక్కులను, లక్ష్యాలను క్షుణ్ణంగా తెలుసుకొని బాధ్యతతో భవిష్యత్తునిర్మాణం చేపట్టాలి. మహిళాభ్యుదయ
కార్యాలు చేపట్టడంలో ముందుండాలి.

డా. దేవులపల్లి పద్మజ 9849692414