మెయన్ ఫీచర్

ప్రపంచానే్న ప్రభావితం చేసిన మను ధర్మశాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రాహ్మణులను, మనుస్మృతిని, మనుధర్మ శాస్త్రాన్ని, బ్రాహ్మణిజాన్ని, హిందూమతాన్ని అహర్నిశలూ కించపరుస్తూ మాట్లాడడం పరిపాటై పోయింది ఇటీవల కొందరికి. ఒక పెద్దమనిషి బ్రాహ్మణులను సోమరిపోతులుగా వ్యాఖ్యానించి, ఆ తరువాత ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు హెచ్చరిచడంతో వెనక్కితగ్గి తాను ‘‘బ్రాహ్మణిజానికి’’ మాత్రమే వ్యతిరేకిని తప్ప బ్రాహ్మణులకు కాదని వక్రభాష్యం చెప్పాడు. బ్రాహ్మణులకు సంబంధం లేని బ్రాహ్మణిజం ఎక్కడినుంచి వచ్చిందో ఆ పెద్దమనిషికే తెలియాలి. మరోవిధంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి, వేల-లక్షల సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి వ్యతిరేకం అని చెప్పకనే చెబుతున్నాడా పెద్దమనిషి. ఇలాంటివారికి, వాళ్లు అనునిత్యం విమర్శించే బ్రాహ్మణిజానికి, సనాతన ధర్మానికి, మానవ ధర్మానికి సంబంధించిన మనుస్మృతి గురించి తెలియచేసే ప్రయత్నమే ఈ వ్యాసం. ఇది చదివిన తరువాత కొంతలో కొంతైనా వారిలోని మూర్ఖత్వం పోతుందేమోనన్న ఆశ.
‘అగ్రకుల పెత్తందారీతనం’ అంటూ చర్చా వేదికలు నిర్వహించి, బ్రాహ్మణిజంపై యుద్ధం అంటూ ప్రకటనలు చేస్తున్నారు వీళ్లు. ఏ ‘ఆధ్మాతిక ప్రజాస్వామ్యం’ అనే పదాన్ని వీళ్లు వాడుతున్నారో దానే్న వౌలికంగా మనుస్మృతి చెప్పిన ప్రతి మాటలోనూ పేర్కొన్నారు. ఒకవైపు హిందూమతాన్ని కించపరిచే మాటలు అంటూనే, మరోవైపు వీరి మతాలు ‘బౌద్ధం, ముస్లిం, క్రైస్తవం’ అని అంటున్నారు. ఈ మూడు మతాలు ఏవిధంగానైతే వీరి దృష్టిలో ఆధ్యాతిక సౌరభాలో, అంతకంటే పిసరంత ఎక్కువగానే, హిందూమతం కూడా అనాదిగా పరిమళిస్తున్న ఆధ్యాత్మిక సౌరభం. ‘కులరహిత సమాజం’ అని ఒకపక్క అంటూనే, బ్రాహ్మణులని, దళితులని వేర్వేరు పదాలు ఉపయోగిస్తున్నారు. ఏ బ్రాహ్మణులనైతే బ్రాహ్మణిజం పేరుతో నిందిస్తున్నారో, ఆ బ్రాహ్మణులే వివిధ సందర్భాలలో విప్లవోద్యమాలను ముందుండి నడిపించారనేది జగద్విదితం. సమాజంలో, ఏ సంస్కరణలు వచ్చినా చాలా వాటిలో బ్రాహ్మణుల పాత్ర అంతో-ఇంతో లేకుండా పోలేదు.
‘‘నాకెవ్వరూ చెప్పనవసరం లేదు, నేనే అన్ని విషయాలు తెలుసుకుంటాను’’ అని ఎవరైనా అనుకుంటే అతడు మూర్ఖశిఖామణి అని పుల్లెల శ్రీరామచంద్రుడు ‘‘ఆ ముఖం మామిడి తోరణం’’ అనే శీర్షికన, ‘‘మనుధర్మ శాస్త్రం’’ పుస్తకానికి పీఠికలో రాశారు. ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, జీవుడు, దేవుడు, బంధం, మోక్షం వంటి ఎన్నో అలౌకిక విషయాలను తెలుసుకోవాలంటే మూర్ఖం వీడి, వేదంపై దృష్టి సారించాలి. ఇది హిందువుల...ఆ మాటకొస్తే భారతీయుల విశ్వాసం. గత జనవరి నెలలో 93వ జన్మదినం జరుపుకున్న కొమరగిరి యోగానంద లక్ష్మీ నరసింహారావు రాసిన పుస్తకాలలో ప్రత్యేకంగా పేర్కొనాల్సింది మనుధర్మ శాస్త్రం.
మనుధర్మశాస్త్రం అన్ని శాస్త్రాలకంటే గొప్పదే కాకుండా వేద ప్రమాణంతో ప్రసిద్ధి గాంచిన గొప్ప గ్రంథం. ‘‘ముఖద్వారం’’ శీర్షికన రచయిత రాసిన ఉపోద్ఘాతంలో అనేక విషయాలు సోదాహరణంగా తెలియజేశారు. వాస్తవానికి అన్ని ధర్మాలకు ఆచారాలకు వేదమే మూలం. అలాంటి వేద నిబద్ధమైన ధర్మా నే్న మనుధర్మ శాస్త్రంలో విశదీకరించారు. హిందూ సమాజానికి అదొక ప్రామాణిక గ్రంథం. మనుస్మృతిని ఆధారంగా చేసుకుని భారత ప్రధమ గవర్నర్ జనరల్ వారెన్ హెస్టింగ్స్ ఒక న్యాయ సూత్ర సంకలనాన్ని తయారు చేయించాడు. ఆయన కాలంలో సుప్రీకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన విలియం జోన్స్ మనుస్మృతిని ఎంతో పొగిడి, ఆంగ్లంలో అచ్చువేయించినందుకు బ్రిటీషు ప్రభుత్వం ఆయనను ‘సర్’ అనే బిరుదుతో సత్కరించింది. హైందవ సంస్కృతిని, ఔన్నత్యాన్ని పరదేశీయులు గుర్తించినప్పటికీ, మనదేశంలో ఉన్న కొందరు వాటిని తూలనాడడం దురదృష్టకరం.
‘‘మనుధర్మ శాస్త్రం, మూల వాఙ్మయం’’ అంటారు రచయిత. ప్రతి మహానదికి, జీవనదికి ఒక జన్మస్థానం ఉన్నట్లే, పరవళ్లు తొక్కుతూ ఎన్నో ఉపనదులను తనలో చేర్చుకున్నట్టే, అలా పారుతూ భూమిని పావనం చేసినట్టే, ఆ క్రమంలో సముద్ర గర్భంలో చేరినట్టే..మనుధర్మ శాస్త్రం కూడా అనేక పురాతన ధర్మసూత్రాలను మేళవించి, ఒక ఉత్తమోత్తమ శాస్త్రం గా రూపొంది, భారతీయ సమాజాన్ని, ఆ మాటకొస్తే యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. ధర్మబద్ధమైన, నియమబద్ధమైన ఆదర్శవంతమైన, ప్రపంచంలో ఉత్తమోత్తమ సమాజంగా హైందవ జాతిని తీర్చిదిద్దింది మనుధర్మ శాస్త్రం. వేదమూలమైన మనుధర్మ శాస్త్రాన్ని..‘మానవ ధర్మ శాస్త్రాన్ని’ ఒక మానవాతీతమైన కార్యక్రమంగా రూపుదిద్దడానికి ఎంతమంది శ్రమించారో చెప్పడం సాధ్యం కాదు. ధర్మమే మూలమైన మనుధర్మ శాస్త్రాన్ని మనం కాపాడుకున్నంత కాలం అది మనలను రక్షిస్తూనే ఉంటుంది. అలా కాకుండా, కుహనా వాదుల లాగా ధర్మాన్ని చెరిచే ప్రయత్నం చేస్తే అది మనలను చెరుస్తుంది. ‘బ్రాహ్మణిజం’ పేరుతో, దానిపై అర్థంలేని వ్యతిరేకతతో, హిందూమతంపై వ్యతిరేకతతో, ధర్మాన్ని నశింపచేయడానికి పూనుకొనడం వినాశనకరం.మనుస్మృతిలో అనవసరమైన విషయాలుకాని అక్కరకురాని కాని, విషయాలు కాని అసలే లేవు. సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి? ఉత్తమోత్తమమైన ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు ఏవిధంగా తమ విద్యుక్త ధర్మాలను త్రికరణశుద్ధిగా ఆచరించాలి? క్షమాగుణం అంటే ఏమిటి? మనోనిగ్రహం ఎలాంటిది? శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎలాంటిది? కాలానుగుణంగా స్ర్తిపురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా వుండాలి? తల్లిదండ్రులను, పెద్దవారిని ఎలా గౌరవించాలి? ఇలాంటివన్నీ వున్నాయి. ఇందులో విమర్శకులకు ఏవిధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.
స్ర్తిలను మనుస్మృతిలో కించపరచే విధంగా రాశాడు అని ఆరోపణ చేసేవారున్నారు. అది నిజం కాదు. ఆయన దృష్టిలో స్ర్తిలకు రక్షణ కలిగించాలని మాత్రమే చెప్పడం జరిగింది. ‘‘నిర్భయ’’ లాంటి చట్టాలు కూడా చెబుతున్నది అదేకదా! మన రాష్ట్రంలోని ‘షీ టీమ్స్’ ఉద్దేశం కూడా స్ర్తిలకు ప్రత్యేక రక్షణ కలిగించడమే కదా! మనువు స్ర్తిలను ఎప్పుడూ అగౌరవ పరచలేదు. సమాజం వారిని ఎప్పుడూ, మాతృభావంతో, సోదరీ భావంతో ఆదరించి సత్కరించాలని అన్నాడు. ఎక్కడ స్ర్తి పూజింపబడుతుందో అక్కడ దేవతలుంటారని ‘‘యత్ర నార్యన్తు పూజ్యంతే...్ఫలాఃక్రియాః’’ అనే శ్లోకంలో సూచించాడు. మనువు నిర్మించి సంఘటితం చేసిన సమాజంలో స్ర్తికి ఉదాత్తమైన, స్వేచ్ఛాయుతమైన స్థానం కల్పించడం జరిగింది.
పీఠిలకో పుల్లెల శ్రీరామచంద్రుడు చాలా విషయాలు సందర్భోచితంగా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, మనుస్మృతిని పోలు స్తూ, ఎన్ని న్యాయ శాస్తప్రరమైన గ్రంథాలు వెలువడుతున్నప్పటికీ, వాటి ప్రామాణ్యానికి మూలకారణం భారత సంవిధానానికున్న అకుంఠిత ప్రామాణ్యం అన్నారు. దీనికి విరుద్ధంగా ఉన్న దానిని న్యాయస్థానాలు అప్రమాణం అని కొట్టిపారేస్తాయ. మనుస్మృతి లాంటి స్మృతుల వేదమూలకత్వం కూడా అలాంటిదే. ఇలానే ఇంకా చాలా విషయాలను ఆయన ప్రామాణికంగా ఉటంకించారు. అతి ప్రాచీనకాలం నుండి, భారతదేశం అంతటా పరమ ప్రమాణంగా అంగీకరింబడిన స్మృతి మనుస్మృతి. 2684 శ్లోకాల ఈ స్మృతిలో భారతదేశానికి, ఇరుగుపొరుగున ఉన్న దేశాలకు సంబంధించిన ధార్మిక, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలెన్నో వివరించబడ్డాయి. ఆధునిక కాలంలో మూర్ఖ శిఖామణులు కొందరు స్మృతిలో ఏముందో పూర్తిగా చదివి అర్థం చేసుకునే ఓపిక, తీరిక లేకపోవడంవల్ల, విపరీతార్థాలను లాగుతున్నారు. వర్తమాన కాలానికి అనుగుణగా లేవని ఏవో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ, తమకి తోచిన భాష్యం చెబుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. వారి ఆలోచనా ధోరణి మారడానికి మనుస్మృతి మళ్లీ మళ్లీ చదవాలి. చదివి అర్థం చేసుకోగలగాలి.
హిందువును అని చెప్పుకునే వ్యక్తి కాని, హిందూమతాన్ని అదేపనిగా అర్థం-పర్థం లేకుండా విమర్శించే కుహనావాదులు కాని, మనుస్మృతి లాంటి పుస్తకాలను చదివితే, అదంటే ఏమిటో, అందులో ఎలాంటి మహోన్నత ఆదర్శాలున్నాయో అవగతమవుతుంది. ‘‘ఈ మతంలో ఏముంది? వర్ణ భేదాలు, కుల భేదాలు, అస్పృశ్యత లాంటి దురాచారాలు మాత్రమే కదా?’ అని అసలు-సిసలు భావాన్ని అర్థం చేసుకోకుండా విమర్శిస్తుంటారు. అన్ని కాలాలకు ఒకే ధర్మశాస్త్రం వుండాలని అనడం లేదు..సామాజిక పరిస్థితులను బట్టి కొన్ని అంశాల్లో మార్పులు చేయవచ్చు. మన రాజ్యాంగానికి కూడా సవరణలు చేయడం లేదా? అంత మాత్రాన రాజ్యాంగం వౌలిక సూత్రాలను మార్చం కదా? అలానే ధర్మశాస్త్రాలు, మనుస్మృతి, బ్రాహ్మణిజం, వేదాలు, ఉపనిషత్తులు, మరెన్నో అలనాటి ప్రామాణికాలు. మనకు ఇష్టం కాని విషయాలున్నాయని, స్మృతులను, హిందూ మతాన్ని, సంస్కృతిని, బ్రాహ్మణిజాన్ని తప్పుబట్టడం ఎలుకల మీద కోపం వచ్చి ఇంటిని తగులబెట్టడం లాంటిదే. వీటిలోని అత్యంత ఉన్నతమైన ఆదర్శాలు పాటించడం శ్రేయస్కరం. హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవన విధానం. కెవైఎల్‌గారి మాటల్లో చెప్పాలంటే, ‘‘్భరతీయ సంస్కృతి, హైందవ సంస్కృతి, ప్రపంచంలో ఉత్తమోత్తమమైన సంస్కృతి. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సర్వకాలికమై శాశ్వతమై, స్థిరమై, యుగ-యుగాలుగా వర్థిల్లుతున్నది. ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా ఇంకా నిశ్చలంగా, సజీవంగా ఉన్నది. దీనికి కారణం. .దాని మూలాలు వేదాలలో ఉండటమే.’’

- వనం జ్వాలానరసింహారావు సెల్: 08008137012