మెయిన్ ఫీచర్

సమానత్వానికి దూరంగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పరిమిత పాత్ర, తక్కువ వేతనాల కారణంగా ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్ 108వ స్థానంలో నిలిచింది. మొత్తంమీద 108వ ర్యాంక్ సాధించిన భారత్ ఆర్థిక కార్యకలాపాలు, అవకాశాలు, ఆరోగ్యం విషయంలో మహిళల పాత్రకి సంబంధించి వరసగా 139, 141వ స్థానంలో నిలిచింది. ఇక పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపులో 136వ స్థానంలో ఉంది. రాజకీయ సాధికారత, ఆయఃప్రమాణం, అక్షరాస్యత లింగ వ్యత్యాసం పెరగడమే భారత్ ఈ ర్యాంకింగ్‌లో వెనకబడటానికి ప్రధాన కారణం. భారత్‌లో సగటున 66 శాతం మంది మహిళలకు వేతనాలు చెల్లించడం లేదను. పురుషుల్లో అయితే ఈ రేటు 12 శాతంగా ఉంది. ఆరోగ్యం విషయంలో లింగ వ్యత్యాసానికి సంబంధించి భారత చివరి నుంచి నాలుగో స్థానంలో నిలవడం ఆందోళన కలిగించేదే. ఇక పని చేసే చోట తారతమ్యాలు తొలగించాలంటే 217 ఏళ్లు పడుతుంది. అధ్యయనం చేసిన 144 దేశాల్లో సగం దేశాలు ఏడాది కాలంల మెరుగైన స్కోరు సాధించాయి.
స్వాతంత్య్రానంతరం భారత పార్లమెంటులో మహిళా ప్రాతినిథ్యం ఏనాడూ పనె్నండు శాతానికి మించలేదు. తొలి లోక్‌సభకు ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య 22. 2014లో పదహారో లోక్‌సభకు ఎంపికైన వారు కేవలం 66 మంది! రువాండ (63.8 శాతం), బొలివియా (53.1), క్యూబా (48.9), స్వీడన్ (43.6) ప్రభృత దేశాలతో పోలిస్తేమహిళా ప్రాతినిథ్యం మరీ తీసుకట్టు. స్ర్తిలపై ఎన్నో ఆంక్షలున్నా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల్లోను ఇక్కడి కన్నా మెరుగైన స్థితిగతులు నెలకొన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. మహిళలకు సముచిత భాగస్వామ్యం కల్పించినప్పుడే సామాజిక ప్రగతి త్వరితంగా సాధ్యపడుతుందనే వారు మహాత్మాగాంధీ. ఆ సదవగాహనను ప్రతిబింబిస్తూ రాజ్యాంగ పీఠిక మొదలు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాల వరకు అన్నీ స్ర్తి-పురుష సమానత్వ భావనకి ఎత్తుపీట వేశాయి. 219 దేశాల్లో సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసిన ఐక్యరాజ్యసమితి కూడా మహిళలు విద్యావంతులైతే ప్రతిఏటా శిశు మరణాల రేటు 9.50 శాతం తగ్గిపోతుందని తన నివేదికలో స్పష్టం చేసింది. ఋగ్వేద కాలంలో ఉన్న స్ర్తి పురుష సమానత్వం తర్వాతి కాలంలో మారిపోయింది. కానీ మనదేశంలో నేటికీ 40 శాతం మహిళలు నిరక్షరాస్యులుగానే ఉన్నారు. పనిచేసే చోట కూడా స్ర్తిలు వేధింపులకు గురి అవుతున్నారు. వేధింపులపై ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ 2016లో జరిపిన సర్వే ప్రకారం పనిచేస్తున్న ప్రదేశంలో లైంగిక వేధింపులకు 38 శాతం గురవుతున్నారని తెలిపారు.
అతివకు రక్షణ జాతీయ మహిళా కమిషన్
మహిళలకు సమాన హక్కుల, అవకాశాలు అందించే క్రమంలో స్ర్తిజాతికి సాధికారిత ప్రసాదించే సదుద్దేశంతో జాతీయ మహిళా కమిషన్ ఏర్పడి పాతికేళ్లు అవుతుంది. ఈ పాతికేళ్ల ప్రస్థానం కొన్ని సమస్యలు తొలిగిపోతుంటే కొత్త సవాళ్లు కూడా ప్రారంభమయ్యాయి. వీటిని కూడా కమిషన్ అధిగమించగలదని అందరూ ఆశిస్తున్నారు.

- కె.రామ్మోహన్‌రావు