మెయిన్ ఫీచర్

ఆన్‌లైన్ షాపింగ్‌పై మోజు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌లో స్మార్ట్ఫోన్ల ద్వారా ఫేస్‌బుక్ వంటి సోష ల్ మీడియాలో మహిళలు ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగంలో స్ర్తిలు, పురుషులకు సంబంధించి పలు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కోసం స్మార్ట్ఫోన్లను మహిళలు అధికంగా వినియోగిస్తుండగా, ఇ-కామర్స్ సైట్లపై పురుషులు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో 20 శాతం మేరకు మహిళలు ఉన్నారు. ఆధునిక మహిళలకు ఇపుడు స్మార్ట్ఫోన్ ఓ ప్రియనేస్తంలా మారింది. జీవన శైలి, సమాచార వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం కోసం పలురకాల ‘యాప్స్’ వాడేందుకు మగువలు స్మార్ట్ఫోన్లను ఆశ్రయిస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా- కనిపించే ప్రతి వస్తువుపైనా మనసు పడి మగువలు షాపింగ్ పేరిట దుబారా ఖర్చు చేస్తుంటారని అంతా అనుకుంటాం. అయితే- ఇంటింటా ఇంటర్నెట్ కనెక్షన్లు, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరగడంతో మహిళల కంటే మగరాయుళ్లే అనునిత్యం ఆన్‌లైన్ షాపింగ్‌లో మునిగి తేలుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంట్లో నుంచి కాలుకదపకుండా మనకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు ఇ-కామర్స్ వెబ్‌సైట్లు వెల్లువెత్తడంతో ఆన్‌లైన్ షాపింగ్ పట్ల పురుషులు తెగ ముచ్చట పడుతున్నారు. మన దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు మహిళల కంటే మగాళ్లే ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నారట! బ్రిటన్, అమెరికాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ రెండు దేశాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు సమయం కేటాయించడంలో అతివలే ముందంజలో ఉన్నారు. బ్రిటన్, అమెరికా, ఉత్తర కొరియా వంటి దేశాల్లో పురుషులు ఆన్‌లైన్ షాపింగ్‌లో రెండు గంటలు గడిపితే మహిళలు అంతకు రెండింతల సమయాన్ని కేటాయిస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా షాపింగ్ చేయడం నేడు ఓ ‘ట్రెండ్’గా మారడంతో పురుషులు మరింత బిజీ అయిపోతున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులు కలిగి ఉండడంలో మగాళ్లు ముందంజలో ఉన్నందున ఆన్‌లైన్ షాపింగ్‌లోనూ వారే దూసుకుపోతున్నారు.
బ్యాంకు అకౌంట్‌లో బాలెన్స్ లేకున్నా, తీరుబడిగా ఇంటి వద్ద నగదు చెల్లించేలా (క్యాష్ ఆన్ డెలివరీ) ఆన్‌లైన్ షాపింగ్‌కు వారు సిద్ధపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఉత్తర కొరియా వంటి దేశాల్లో అయితే నగదు చెల్లింపు వ్యవహారం ఆడ,మగల్లో ఎవరికీ భారంగా లేదని తేలింది. సంపాదన, ఆర్థిక స్వేచ్ఛ వంటివి ఆశాజనకంగా ఉంటే మన దేశంలోనూ మహిళలు ఆన్‌లైన్ షాపింగ్‌లో మించిపోతారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ చాలా కుటుంబాల్లో సంపాదన పరంగా మగాళ్లదే పైచేయి కావడం, ఇ-కామర్స్ సైట్లలో ఎలక్ట్రానిక్స్ వస్తువులే ఎక్కువగా విక్రయించడం వల్ల ఆన్‌లైన్ షాపింగ్‌లో మహిళలు వెనుకబడి ఉన్నారు. కొనుగోళ్లకు సంబంధించి మహిళల మనోభావాలను తెలుసుకోకపోవడం, ధరల విషయమై ఆచితూచి వ్యవహరించకుండా పురుషులు తొందరపాటు నిర్ణయాలతో ఆన్‌లైన్ షాపింగ్‌కు అలవాటు పడుతున్నారట! దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్, జపాన్, థాయ్‌లాండ్ దేశాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు మహిళలు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. భారత్, మలేషియా, ఇండోనేషియా, ఖతా ర్, ఇటలీల్లో ఆన్‌లైన్ షాపింగ్‌లో పురుషులు ఆధిక్యత చాటుకుంటున్నారు. మనదేశంలో దాదాపు అయిదేళ్ల క్రితం ఇ- కామర్స్ వ్యాపారం ప్రారంభమైనా చాలామంది మహిళలు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా దుకాణాలకు వెళ్లి కొనుగోళ్లు చేసేందుకే ఇష్టపడుతున్నారు. వస్త్ర దుకాణాలు, జ్యుయలరీ షాపుల్లో భారీగా డిస్కౌంట్లు ఉంటాయని మగువలు నమ్ముతుంటారు. ఆన్‌లైన్‌లో కంటే- వస్తువుల నాణ్యతను స్వయంగా పరిశీలించి కొనేందుకు వారు సుముఖత చూపుతుంటారు. ‘యాప్స్’ ద్వారా కొనే వస్తువుల నాణ్యతపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపేందుకు పురుషులు ఇష్టపడుతుండగా, నగదు చెల్లించి మాత్రమే ఏవైనా కొనాలని స్ర్తిలు భావిస్తారు. క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే ఖర్చుపై నియంత్రణ ఉండదని మహిళలు జాగ్రత్తపడతారు. క్రెడిట్ కార్డులను షాపింగ్‌కు వినియోగించడం అంత క్షేమకరం కాదని వారు వాదిస్తుంటారు. డెబిట్ కార్డులు ఉపయోగిస్తామని సర్వేలో 43 శాతం మంది పురుషులు చెప్పగా, 21 శాతం మంది మహిళలు అందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. క్రెడిట్ కార్డుల వైపు 17 శాతం మంది పురుషులు, 10 శాతం మంది స్ర్తిలు మొగ్గు చూపారు. ‘క్యాష్ ఆన్ డెలివరీ’కి 26 శాతం మంది పురుషులు, 41 శాతం మంది స్ర్తిలు మోజు పడుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం 30 శాతం, జీవిత భాగస్వామి కోసం 42 శాతం, కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం 18 శాతం, పిల్లల కోసం పది శాతం వరకూ ఆన్‌లైన్‌షాపింగ్ చేస్తామని పురుషులు చెబుతున్నారు. వ్యక్తిగత అవసరాలకు 45 శాతం, జీవిత భాగస్వామి కోసం 25 శాతం, పిల్లల కోసం 20 శాతం, కుటుంబం కోసం 10 శాతం మేరకు ఆన్‌లైన్‌షాపింగ్ చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. మహిళల ఆన్‌లైన్ షాపింగ్‌లో గాడ్జెట్లు, ఫ్యాషన్లకు ప్రాధాన్యత లభిస్తుండగా, పురుషులు మాత్రం ఎలక్ట్రానిక్స్, విహార యాత్రలకు మొగ్గు చూపుతున్నారు. తమకు అవసరమైన అన్ని వస్తువులు భర్తే సమకూర్చాలని చాలామంది గృహిణులు భావిస్తుండగా, షాపింగ్‌లో తమ మాటే చెల్లుబాటు కావాలని కొందరు మహిళలు బలంగా కోరుకుంటారని అధ్యయనంలో తేలింది. ఇలా రోజురోజుకూ ఆన్‌లైన్ షాపింగ్‌పై మగువలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆన్‌లైన్ వ్యవహారం అనూహ్యంగా జోరందుకుంది.

-కందుల శ్రీనివాస్