మెయిన్ ఫీచర్

ప్రకృతి పాఠం వింటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మనుష్య జన్మ ఎంత ఉత్కృష్టమైనదో మనుష్య జీవనం అంత కష్ట సాధ్యమైనది. జీవులన్నిటిలోకి మనుష్య జన్మ అరుదైనది.
భగవద్గీతలో 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది.
శ్లో!! ఉద్ద రేదాత్మ నాత్మానం
నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః
ఆత్మైవ రిప్ప రాత్మనః!!
మనుజులు సంసారం నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు తమకు తామే శత్రువులు!
‘‘జీవనం ఒకలా ఊహిస్తే మరోలా జరుగుతుంటుంది. మనిషి తప్పనిసరిగా సాంఘిక జీవనం తోటి వారితో కలిసిమెలిసి జీవించవలసి ఉంటుంది. అందుచేతనే చరిత్ర పాఠాల్లో మనిషి సామాజిక జంతువుగా పేర్కొనడం జరిగింది.
‘‘పూర్వం ఒకరి కొకరు అన్నట్లుగా ఇళ్లలోను సమాజంలోను కలిసి మెలసి జీవించే వారు. నేడయితే కుటుంబం అందరూ కలిసి ఉంటున్నా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఇంకా వేరే యితరులతో కలసి మెలసి జీవనం గుర్చి చెప్పాలా?!
‘‘అక్కడక్కడ ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తూన్నా ఉమ్మడిలో సృష్టిగా జీవిస్తున్న వారే ఎక్కువ. ముఖ్యంగా కుటుంబాలేవైనా అందులో ఉండేది మనుషులేగా! మనిషికి మనిషికి మధ్య అవగాహన అనురాగం, అనుభవం ప్రేమ వగైరాల కంటే నేను నామాట అనే ‘‘అహమే’’ నడుస్తోంది!
పూర్వం ఒకరాజుగారు ప్రజల్ని ఏదో యాగ నిమిత్తం ఒక గ్లాసు పాలు తెమ్మన్నారట. అందులో ఒకరికి అందరూ పాలుతెస్తే నేనొక గ్లాసు నీళ్లు పట్టుకెళ్తే ఆ గంగాళాల్లో పాలలో నా నీళ్లు తెలుస్తాయా అనే ఆలోచనతో నీళ్లు పట్టుకెళ్లాడట. తీరా రాజుగారి గంగాళాలన్ని మొత్తం పాలకి బదులు నీళ్లతోనే నిండాయట. అందుకే ఒక సామెతగా పనికిరాని విషయాలకు అందరూ ఒకేలా ఆలోచిస్తే రాజుగారి ‘‘పాలు’’ నీళ్లు కథ గుర్తు తెస్తుంటారు.
మనుషులు కలిసి మెలసి జీవితాలకి అందరిలో ‘‘అహం’’ తెరలు అడ్డుపడుతున్నాయి. ఒక్కసారి ఎవరికి వారు ఆ తెరల్ని తొలగించుకుని బయటకు వస్తే ప్రేమైక ప్రపంచం కనబడుతుంది. అందరూ ఒక్కసారి ‘‘అహం’’ ప్రక్కనపెట్టి హాయనో, బాగున్నారా అనో ఒకరినొకరు పలకరించుకుంటే ‘‘అహం’’ తెరలు తామంతటదే అపహలు తొలగిపోతాయి.
‘‘అహం’’ వలన తోటి మనుషులకి దూరం అయి భగవంతునికి ఏమైనా దగ్గరవుతారా అనంటే అదీ అగమ్యగోచరమే. ‘‘అహంకారం’’ మనిషిపై స్వారీ చేసినంత కాలం తననుకున్నది జరగాలని తన మాటే వేదమంటూ పురాణాల్లో మహాభారతంలో దుర్యోధనుడు రామాయణంలో రావణాసురుడు, వానరరాజు వాలి అహంకరించి, భీష్ముని, విదురుని హిత బోధనలను లెక్కచేయని దుర్యోధనుడు, సుగ్రీవుని మంచిని గుర్తించని వాలి బ్రతికినంత కాలం చెడ్డవారిగా బ్రతికి చివరకు చెడ్డవారిగానే చనిపోయారు.
మనిషి పుట్టిన దగ్గర నుండి ఇళ్లలో పాఠశాలల్లో పెద్దల ప్రవచనాల్లో వారంతా అహంకారంతో అసుర లక్షణాలతో చెడ్డవారు అయ్యారని వింటూ కూడా తమను తాము సరిదిద్దుకోకుంటే చివరకు అదోగతే! ‘‘మనిషి ఎంతసేపూ తనను ఎవరూ పట్టించుకోవడం లేదని అందరినీ తానే పట్టించుకుంటున్నారని ఒక్కసారి అందరూ తనకు శత్రువులా మరోసారి మిత్రుల్లా అనుకోవడం సరైనది కాదు కదా. అందుకే అంటారు ‘‘పచ్చకామెర్ల వానికి లోకమంతా పచ్చగా కనిపించునట్లు మనిషి తాను లకాన్ని ‘‘అహం’’ (ఇగో) విడిచిచూస్తే ప్రేమైక ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచమంతా పరమాత్మమయంగా కనబడుతుంది.
ప్రేమతో విశ్వాన్ని గెలవచ్చు అన్నారు కాని ద్వేషంతో అహంకారంతోనో ఎవరూ విశ్వాన్ని గెలవాలనుకొన్నా వారంతా చతికిలబడ్డవారే నని చరిత్ర మనకు చెబుతుంది. మన చుట్టూర ఉన్న ప్రకృతి అంతా మనకు త్యాగమయ జీవనాన్ని నేర్పుతోంది. ఆ ప్రకృతినే ఎదిగిన కొలది ఒదగమని చెప్పుతుంది. నిండా పండ్లున్న చెట్టు భూమిపైకి వంగి ఉంటుంది. తనను తన పళ్లకోసం రాళ్లతో కొట్టినా వ్యతిరేకించదు. వారికి పండ్లనే ఇస్తుంది. చిన్నమొక్క వరద వస్తే తలవంచుకు నిలబడుతుంది. ఆ వరద దానిమీదుగా వెళ్లిపో తుంది. వరద ఉదృతి తగ్గిన తరువాత తలెత్తుంది. ఇంతమంచి చక్కని ఈప్రకృతి పాఠాలు నేర్చుకోక అహంకారానికి లోనైతే ఎవరికి వారే శత్రువులౌతారు.

-అయల సోమయాజుల నాగభూషణరావు 8985916755