మెయిన్ ఫీచర్

అందమే కాదు.. ఆరోగ్యం కూడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛమైన తెల్లదనం.. మత్తెక్కించే సౌరభం.. ముచ్చటగొలిపే సున్నితత్వం.. వెరసి ఆ స్నిగ్ధసౌందర్యం ప్రతి మదిని ఊహల్లోకి తీసుకెళుతుంది. మాఘమాసం మొదలు ఆషాఢమాసం వరకూ విరబూసి పలకరించే మల్లెల పరిమళం ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమే.. ఒకవైపు ఎండలు మండిపోతున్నా, గుబాళించే మల్లెల కోసమే చాలామంది వేసవి లగ్నాలు పెట్టుకుంటారంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచవ్యాప్తంగా మల్లెల పెంపకం ఉన్నప్పటికీ మనదేశంలోనే వీటిని ఎక్కువగా పూయిస్తారు. ఫ్రాన్స్, చైనా, ఈజిప్ట్, టర్కీ, మొరాకో.. తదితర దేశాలు మల్లెల కంటే మల్లెల తైలాన్ని తయారుచేసుకుని వినియోగిస్తారు. ఇక్కడి ఆడవారికి జడవేసుకుని పూలు పెట్టుకునే సంప్రదాయం లేదుగా మరి.. అందుకని వీరు మల్లె తైలాన్ని, స్ప్రేలను ఎక్కువగా వినియోగిస్తారు. ఒక గ్రాము తైలం తయారుచేయడానికి దాదాపు ఎనిమిదివేల మల్లె మొగ్గలను ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ మల్లె తైలం ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
మల్లెపూలంటే మగువలకే కాదు, మగవారికి కూడా ఇష్టమే! ఎందుకంటే మల్లె పరిమళం శృంగార ప్రే రితం. ఇందులోని పరిమళం స్ర్తీ , పురుష హార్మోన్లను ప్రభావితం చేయడంతోపాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అందుకే మండపాల్లోనూ, వధువు పూలజడలకు, తొలిరాత్రి అలంకరణలకు మల్లెల్ని వాడేది. మల్లెపూల పరిమళం మెదడును తాకి, మనసుకు ఎంతో హాయినీ, ప్రశాంతతనూ కలిగిస్తుంది. అందుకే మల్లెలను ముక్కు దగ్గర పెట్టుకుని గాఢంగా పీల్చినప్పుడు ఆ వాసన మొత్తం నాడీవ్యవస్థను ప్రభావితం చేస్తుందని చెబుతారు అరోమాథెరపిస్టులు. శరీరానికి అవసరమ్యే విటమిన్-ఇ మల్లెల్లో ఎక్కువగా ఉంటుంది. మల్లెలను చుండ్రు , మొటిమలు తగ్గించే ఔషధాలుగా కూడా వినియోగిస్తారు. మల్లెపూల తైలం ఎనస్తటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. మల్లెపూలను ఆయుర్వేదంలోనూ వాడతారు. కీళ్లనొప్పులు, చర్మరోగాలను నియంత్రించగల శక్తి మల్లెపూలలో ఉంది. దీనిలో విటమిన్-సి2 పుష్కలంగా ఉంది. మల్లెపూల పరిమళం కణితులను కూడా నివారిస్తుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పూర్వకాలంలో మల్లెల ఆకుల్నీ,

పూలనీ రొమ్ముక్యాన్సర్ నివారణకు వాడేవారట. మల్లెపూలతో చేసే తేనీరు కడుపులోని నులిపురుగుల్ని నివారిస్తుంది. జాస్మిన్ టీని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ తగ్గుతుందంటారు చైనీయులు. ఈ టీ కోసం వారు తేయాకుల్నీ, విరిసిన మల్లెల్నీ అరలు అరలుగా పోసి పూలవాసన ఆకులకు పట్టేలా చేస్తారు. ఈ ఆకులతో చేసిన టీ ఆకుపచ్చరంగులో సువాసనలు వెదజల్లుతుంది. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అన్నంలో మల్లెరేకులను కలుపుకుని తింటారట ఆరోగ్యం కోసం! మల్లెపూలను సుగంధ ద్ర వ్యాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జాస్మిన్ జాతులు ఉన్నప్పటికీ మనకు తెలిసిన మల్లె జాతి జాస్మినమ్ నంబక్. దీనే్న అరేబియన్ జాస్మిన్ అని కూడా అంటారు. మధురైకి చెందిన మల్లెలకు పేటెంట్ దక్కింది. ఈ మల్లెలతోనే మధుర మీనాక్షీ అమ్మవారిని అలంకరిస్తారు. అలంకరణ అంటే గుర్తొంచ్చిందండోయ్.. మల్లెపూలను అలంకరణకు మన తెలుగు రాష్ట్రాల్లో మహిళలు వాడినట్లుగా మరెవ్వరూ వాడరు. మల్లెమాలలను వాలుజడలో తురిమినా, కొప్పున చుట్టినా, పూలజడగా అల్లినా, కనకాంబరాలు, మరువంలతో కుచ్చినా ఆ అందమే వేరు. పెళ్ళిళ్లలో మల్లెపూలజడ లేకపోతే పెళ్ళికూతురికి అంత అందం చేకూరదు అంటే అతిశయోక్తి కాదేమో.. ఒకప్పుడు ఒకేరకంగా అల్లే మల్లె పూలజడ.. ఇప్పుడు కొత్త అందాలను చేర్చుకుని పెళ్ళికూతురు చీరకు, మేకప్‌కు తగినట్లుగా ఒదిగిపోతోంది. కొంతమంది యువతులు, చిన్నపిల్లలు వేసవికాలంలో వచ్చిందంటే చాలు పూలజడలు వేయించుకుని చక్కటి సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ.. వాటిని ఫొటోలు తీసుకుని జ్ఞాపకాల రూపంలో భద్రపరచుకుంటారు. ఇంకేం.. మరి ఈ వేసవిలో మల్లెల గుబాళింపుల్ని ఆఘ్రానించడం మరిచిపోకండి.
*