మెయిన్ ఫీచర్

మిత్రత్వమే దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాటే మంత్రము- మనసే మందిరము’
అన్నాడొక కవి సామ్రాట్!
మాటలు మనుషుల జీవన గతినే మార్చివేస్తాయి. మాటలు కోటలు దాటుతాయి. పెదవి దాటితే పృధ్వి దాటుతుంది. పరమశివుడు హలాహలాన్ని గొంతులోనే ఉంచుకున్నాడు. శ్వాస వున్న ప్రతివాడూ శివుడే! మధురమైన మాటలు మాట్లాడితే గొంతులోని విషం అమృతం అవుతుంది. క్రూరమైన మాటలు మాట్లాడితే ఆ విషం మరింత విషమం అవుతుంది.

నోటిలోని వౌనమూ మనసులోని శూన్యమూ - దానిపేరు ధ్యానము!
మాటలోని సత్యమూ - మాటలోని ఎరుకా- దాని పేరు జ్ఞానము!
చేతలోని న్యాయమూ- చేతలోని వినయమూ- దాని పేరు ధర్మము!
ఆత్మలోని శాంతమూ- ఆత్మలోని అభయమూ - దానిపేరు మోక్షము!
ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస! జ్ఞానం అంటే మాట మీద ధ్యాస! ధర్మం అంటే అహింస- వినయం! మోక్షం అంటే శాంతి- అభయం! ధ్యానాత్ జ్ఞానం- జ్ఞానాత్ ముక్తిః అన్నారు ఋషులు.
ధ్యానం చేసే జ్ఞానం (ఆత్మజ్ఞానం) కలుగుతుంది. ఆత్మజ్ఞానంవల్ల ధర్మం ఆచరించబడుతుంది. అహింస వర్థిల్లుతుంది. వినయం కలుగుతుంది. వీటివల్ల శాంతి కలుగుతుంది. భయం అభయం అవుతుంది. అదే మోక్షం! అదే ముక్తి! అదే స్వర్గం!
మనుషుల్లో పోరాటాలూ, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అభద్రతాభావంవల్ల! భయంవల్ల! శాంతి కోల్పోడంవల్ల! జీవహింసవల్ల!
మనమంతా దేవుళ్లమే! అజ్ఞానంవల్ల తెలియని దేవుళ్ళం!మనమంతా దేవుళ్ళమే! సుజ్ఞానం పొందితే తెలిసిన దేవుళ్ళం!
చేతులు కట్టుకుని, కాళ్ళు కట్టుకుని, కళ్ళు మూసుకొని, నోరు కట్టుకుని, శ్వాసమీద ధ్యాస పెడితే క్రమంగా ఆలోచనారహిత స్థితి కలుగుతుంది. మనసు శూన్యమవుతుంది.
‘మెడిటేషన్ మీన్స్ మేకింగ్ ది మైండ్ ఎంప్టీ! అది ధ్యానం!‘మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు- వాక్కులోన జగము వర్థిల్లుచుండును’!
ఈ చరాచర ప్రపంచంలోని మనుషుల వ్యవహారాలన్నింటికి మాటలే కారణభూతమవుతున్నాయి. మాటలు లేకపోతే మానవ జీవనమే శూన్యం. కనుక చక్కగా మాట్లాడటం నేర్చుకోవాలి. మితంగా మాట్లాడటం నేర్చుకోవాలి. గొప్పగా మాట్లాడడం నేర్చుకోవాలి.
‘మాటే మంత్రము- మనసే మందిరము’ అన్నాడొక కవి సామ్రాట్!
మాటలు మనుషుల జీవన గతినే మార్చివేస్తాయి. మాటలు కోటలు దాటుతాయి. పెదవి దాటితే పృధ్వి దాటుతుంది. పరమశివుడు హలాహలాన్ని గొంతులోనే ఉంచుకున్నాడు. శ్వాస వున్న ప్రతివాడూ శివుడే! మధురమైన మాటలు మాట్లాడితే గొంతులోని విషం అమృతం అవుతుంది. క్రూరమైన మాటలు మాట్లాడితే ఆ విషం మరింత విషమం అవుతుంది.
అమృతం బయటకు వచ్చినా లోపలికి వెళ్లినా ఆనందమే! విషం బయటకు వచ్చినా లోపలికి వెళ్లినా ఉపద్రవమే! కనుక మనం అమృతం త్రాగుతున్నామా, విషం త్రాగుతున్నామా? అమృతం పంచుతున్నామా, విషం క్రక్కుతున్నామా- అది మన వాక్కుమీద ఆధారపడుంది. అదే మన నుదుటి వ్రాత అవుతుంది.
వాక్కు అంటే- మాట సత్యంతో కూడి ఉండాలి. ఆ సత్యం ఎరుకతో కూడి ఉండాలి! మనకు రెండు ఉదాహరణలున్నాయి దీనికి. ఆలస్యం అమృతం విషం- నిదానమే ప్రధానం! రెండూ గొప్ప సత్యాలే. ఒకమ్మాయికి ఎంసెట్‌లో రెండవసారి కూడా కోరుకున్న ర్యాంక్ రాలేదు. సూయిసైడ్ చేసుకోవాలని అనుకుంది. వాళ్ళమ్మ ఇది కనిపెట్టింది. ఒక మాస్టర్ క్లాసుకు వచ్చింది. అక్కడ ఆ పిరమిడ్ మాస్టర్ క్లాసు చెపుతూ- ఆలస్యం అమృతం విషం, నిదానం ప్రధానం- ఈ రెండూ గొప్ప సత్యాలు. కాని ఈ సత్యాలు ఎరుకతో కూడి ఉండాలి.
*