మెయిన్ ఫీచర్

క్రాకరీ క్వీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు కొన్ని విద్యలు జన్మతః అబ్బుతాయి. వారికి అన్ని విద్యలూ దగ్గరుండి నేర్పించాల్సిన అవసరం లేదు. వంట చేయడం, పిల్లల్ని పెంచడం, ఇంటిని చూసుకోవడం.. వంటి విద్యలన్నీ పూర్వకాలం నుండీ మహిళలు చేస్తూనే వస్తున్నారు. వంటిల్లు తీర్చిదిద్దినంత మాత్రాన మహిళలు వ్యాపారాన్ని పరుగులు పెట్టించలేరనుకుంటే మాత్రం పొరబాటే.. అంతరిక్షం దగ్గరి నుండీ వంటింటి వరకూ మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని నిరూపించారు నేటి మహిళలు. అలాంటి కోవకు చెందిన మహిళే ఇనాచాబా. భర్త చేసే వ్యాపారంలో అనుకోకుండా ప్రవేశించి.. తన ఆలోచనతో ఓ కంపెనీకి అధిపతి అయ్యింది. అప్పటిదాకా ఇల్లే లోకంగా బతికిన చాబా .. నేడు వ్యాపారంలో భర్తకే సలహాలిచ్చే స్థాయికి ఎదిగింది.
చాబా దంపతులది ఢిల్లీ. భర్త నీరజ్ వ్యాపారవేత్త. వారిది ఉమ్మడి కుటుంబం. పెద్ద ఇల్లు, వసారా, తోట, పూలమొక్కలు, పూజలు.. ఇదీ ఆమె ఒకప్పటి జీవితం. వారి ఇల్లు ఎప్పుడూ పెద్దలు, పిల్లలతో కళకళలాడుతూ సందడిగా ఉండేది. నీరజ్‌కి బెంగళూరులో బటన్ మానుఫాక్చరింగ్ వెంచర్ ఉంది. ఆ కంపెనీలో ఏవో సమస్యలు రావడంతో నీరజ్ తన భార్యాపిల్లలను తీసుకుని బెంగళూరుకు మకాం మార్చారు. పెద్ద ఇంట్లో హాయిగా ఉన్న ఆ భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో బెంగళూరు ఇరుకు గదులున్న చిన్న ఇంటికి మకాం మార్చారు. అక్కడ అందరితో సరదాగా ఉన్న ఇనాకి బెంగళూరులో ఏమీ తోచలేదు. పిల్లలను స్కూలు పంపాక ఖాళీగా కూర్చునే బదులు భర్త వ్యాపార వ్యవహారాల్లో పాలు పంచుకోవాలనుకుంది. అదే పని చేసింది కూడా. ఓసారి అనుకోకుండా ఆ కంపెనీకి కోట్ల విలువైన ఆర్డర్లొచ్చాయి. అంతమొత్తంలో ఆర్డర్లు రావడంతో భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడ్డారు. దాన్ని వారు ఓ సవాలుగా తీసుకుని సమయానికి ఆ కంపెనీకి ఆర్డరు డెలివరీ చేయాలనుకున్నారు. అలా ఇనా భర్త దగ్గరనుండి, బటన్ కంపెనీ నుండి డబ్బు ఎలా ఖర్చుపెట్టాలి, సమయపాలనను ఎలా పాటించాలి వంటి మెళకువలను నేర్చుకుంది. దాంతో ఈ వ్యాపారం ఎందుకు నేను మరో వ్యాపారం చేయవచ్చు కదా అనుకుంది. కానీ ఏ వ్యాపారం ఆరంభించాలో ఆమెకు అర్థం కాలేదు. ఒకసారి ఆమెకు మెలామైన్ క్రాకఠీ డిమాండ్ గురించి తెలిసింది. భర్త బటన్ బిజినెస్ చూసుకుంటున్నాడు, తను క్రాకరీ బిజినెస్‌పై దృష్టి సారిస్తే ఎలా ఉంటుంది అని అనుకుని తన ఆలోచనను భర్తతో పంచుకుంది. భర్త కూడా సరే అనడంతో క్రాకరీ తయారీపై రీసెర్చ్ మొదలుపెట్టింది. అలా 2006లో సీడ్ కేపిటల్ ఫండ్‌తో సాయి మెలనిన్ క్రాకరీ బిజినెస్ మొదలుపెట్టింది. బటన్ ఫాక్టరీలోనే ఓ వైపు రెండు వందల మంది సిబ్బందితో ఒక క్రాకరీ యూనిట్‌ను మొదలుపెట్టింది. ఇందులో చాలామంది మహిళలే ఉన్నారు. నెలకు దాదాపు పదివేల డిన్నర్ సెట్లను తయారుచేసేవారు. ఫలితంగా పాతిక లక్షల వ్యాపారం జరిగేది. దీపావళి, దసరా వంటి పండుగ రోజుల్లో అయితే నెలకు దాదాపు డెబ్భై లక్షల వ్యాపారం జరగడం మొదలైంది. మొదట్లో ఈ క్రాకరీని రిటైల్ అవుట్‌లెట్స్‌లో అమ్మేవారు. తరువాత నెమ్మదిగా కంట్రీ క్లబ్, చాకొలేట్ రూమ్ వంటి పేరున్న రెస్టారెంట్లకు క్రాకరీ సప్లై ఒప్పందం కుదిరింది. అలా అలా అతికొద్దికాలంలోనే స్పార్ హైపర్ సిటీవంటి సూపర్‌మార్కెట్‌లో కూడా ఈమె క్రాకరీ కొలువుతీరింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. డీమార్ట్, మెటో , బిగ్‌బజార్.. వంటి సంస్థల నుండి కూడా చాలా ఆర్డర్లు వచ్చాయి ఇనాకు. డిమాండ్, ఆర్డర్లు పెరగడంతో సకాలంలో సరుకు అందించడానికి ఆటోమేటెడ్ మెషినరీని ఏర్పాటుచేసుకుంది ఇనా. దానితో కొత్త కొత్త డిజైన్లకు కూడా బీజం పడింది. క్రియేటివిటీని పెంచింది. ఇప్పుడు మార్కెట్లోని కాంపిటీటర్లు సైతం ఆమె దగ్గరికే వచ్చి కొత్త కొత్త డిజైన్ల తయారీని అడుగుతున్నారు. అలా ఇనా ఇప్పుడు క్రాకరీ క్వీన్ అయిపోయారు. ఒకప్పుడు ఇల్లే ప్రపంచంగా బతికిన మహిళ.. ఇప్పుడు కోట్లు టర్నోవర్ చేసే సంస్థకు అధిపతి అయ్యింది.
ఇంట్లో ఏమీ తోచక వ్యాపారంలోకి అడుగిడి.. ఓ చిన్న ఆలోచనతో ఇప్పుడు క్రాకరీ బిజినెస్‌లో తిరుగులేని వ్యాపారవేత్త అయ్యింది ఇనా. చేయాలనే తపన, పట్టుదల, కృషి ఉంటే చాలు ఓ మహిళ అద్భుతాలు సృష్ట్టించడానికి.. ఇదంత కష్టమేమీ కాదు అంటారు నవ్వుతూ ఇనాచాబా .
(యువర్స్‌స్టోరీ సౌజన్యంతో )