మెయిన్ ఫీచర్

గుండెను తొలిచే బాధ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కనమ్మ చిక్కినా ఆందం అని అనుకోవచ్చు. ఇలాంటి వారు నాజుకుగా ఉన్నామని సంబరపడిపోతుంటారు. మరికొంతమంది లావెక్కిపోతూ ముఖం మీద, ఒంటిమీద, గడ్డంపైన అవాంచిత రోమాలు వచ్చి ఆందోళన చెందుతుంటారు. ఈ బాధను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటారు. ఇలా మహిళల్లో విభిన్న మార్పులకు దోహదం చేస్తున్న అంశాలు చాలా ఉంటాయి. మహిళల్లోని హార్మోన్ల సమతుల్య లోపం వల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మహిళల శారీరక ఎదుగుదలలో తేడాలు కనిపించటం సహజం అని అనుకుంటారు. కాని దీని వెనుక పీసీఓఎస్ అనే సమస్య దాగి ఉందని తెలుసుకోవటం చాలా కష్టం. అండాశయాల్లో కనిపించే ఈ నీటితిత్తులు వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అండం విడుదలకాకపోవటం, మగవారిలాగా గడ్డాలు, మీసాలు, ఛాతీ వంట ప్రదేశాల్లో అవాంచిత రోమాలు పెరగటం తదితర సమస్యలు అన్నీ కనిపిస్తుంటాయి. మహిళల్లో అతి సాధారణంగా కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసిఓఎస్) సమస్య వివిధ ప్రాంతాల్లో ఉండే మహిళల్లో ఏవిధంగా పనిచేస్తుందో పరిశోధనలు చేశారు. ఢిల్లీ, కాశ్మీర్‌కు చెందిన మహిళల్లో ఈ పీసీఓఎస్ ఏలాంటి ప్రభావం చూపుతుందోనని పరిశోధనలు చేస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
కాశ్మీర్ మహిళలు సన్నగా నాజుకుగా ఉండటానికి కారణం ఈ పీసీఓఎస్ అనే విషయం వెల్లడైంది. ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌వారు సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఈ రెండు ప్రాంతాల మహిళల్లో విభన్నంగా వ్యాధి నమూనాలను పీసీఓఎస్ సూచించటం గమనార్హం. ఢిల్లీకి చెందిన మహిళల్లో అధిక గ్లూకోస్, స్థూలకాయం, ఇన్సులిన్ నిరోధకత, అవాంచిత రోమాలు పెరగటానికి దోహదం చేస్తున్నట్లు గమనించారు. అలాగే కాశ్మీర్ మహిళల్లో దీనికి భిన్నంగా ఈ పిసిఓఎస్ పనిచేస్తుందట. కాశ్మీర్ మహిళల్లో తక్కువ గ్లూకోజ్, ఇన్సులిన్ నిరోధకత ఉండటంతో పాటు అధికంగా జుత్తు పెరగటాన్ని గమనించారు. అంతేకాదు పురుష లక్షణాలు కనిపించే ఆండ్రోజెన్ స్థాయిల్లో కూడా తేడా ఉన్నట్లు గమనించారు.
అసలు పాలిసిస్టిక్ ఓవరీ
సిండ్రోమ్ అంటే?
మహిళలకు రుతుస్రావం ఎంత సాధారణమో, అలా గే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది అతి సాధారమైన విషయం. నాలుగు శాతం నుంచి
10శాతం వరకు ఇది
ప్రతి మహిళలో ఉంటుంది. యుక్తవయసు రావటంతోనే దీని లక్షణాలు కనిపించటం ప్రారంభమవుతోంది. మహిళల్లో దాదా పు నూటికి ఐదుగురు దీంతో బాధపడుతున్నారని అంచ నా. పునరుత్పత్తి దిశగా నెలనెలా అమ్మాయిలను సన్నద్ధమవ్వటం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ప్రకృతి సిద్ధం గా సంభవించే ఈ పరిణామం ఎంత సహజంగా అనిపించినా.. ఎన్నో శారీరక మార్పులకు దోహదం చేస్తోంది. కాని పిసీఓఎస్ వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్, మధుమేహం, చికాకు, కోపం, గుండె జబ్బులు, బీపీ వంటి వ్యాధులతో పాటు సంతానం కలగకపోవటానికి కూడా కారణమవుతోంది.
జన్యుపరమైన కారణాలు కూడా దోహదం
ఈ పీసీఓఎస్ సమస్య కాశ్మీర్, ఢిల్లీ మహిళల్లో ఒక్కోవిధంగా తలెత్తటానికి కారణం జన్యుపరమైన కారణాలతో పాటు రక్తసంబంధ వివాహాలు జరిపించటం తదితర కారణాలు కూడా దోహదం చేస్తున్నట్లు గ్రహించారు. దాదాపు 299 మహిళలపై పరిశోధనలు చేశారు. వీరిలో 210 మహిళల్లో పీసీఓఎస్ సమస్య ఉండగా, మిగిలిన 89 మంది ఆరోగ్యంగా ఎలాంటి సమస్యలు లేనివారు. ఆహారం, వ్యాయామం, హార్మోన్ల సమతుల్యత తదితర అన్ని కోణాలను ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకోవటం జరిగింది. జన్యుపరమైన కారణాల వల్ల ఈ పీసీఓఎస్ సమస్య కాశ్మీర్ మహిళల్లో ఓ విధంగానూ, ఢిల్లీ మహిళల్లో మరోవిధంగానూ పనిచేస్తున్నట్లు గమనించారు. ఏదిఏమైనప్పటికీ మహిళలను వేధించే ఈ పీసీఓఎస్ సమస్యను అర్థం చేసుకునేందుకు ముందు ప్రతినెలా వారి శరీరంలో ఏమి జరుగుతుందో స్థూలంగా తెలుసుకుని చికిత్స చేయించుకోవటం ఎంతో అవసరం. అండాశయల పనితీరు అస్తవ్యస్తం చేసేందుకు దోహదం చేసి ఈ సమస్యను అధిగమించటానికి వైద్యులు చెప్పే సూచనలే ఎంతో విలువైనవి. వీటితోపాటు ఊబకాయం తగ్గించుకోవాలి. నిత్యం వ్యాయామం చేయటం, శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల ఇన్సులిన్ నిరోధకత బాగా తగ్గుతుంది.
తేలికగా జీర్ణమయ్యే, పీచు ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. గుండెజబ్బులకు ఎక్కువగా దోహదం చేసే ఈ పీసిఓఎస్ బాధితులందరికీ గుం డెపోటు ఎక్కువగా ఉంటుంది. మధుమేహం కూడా రావచ్చు. మానసికంగా తీవ్ర వేదన కలిగించే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ కూడా అవసరం.