మెయిన్ ఫీచర్

మనసుంటే మార్గమిదిగో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘బాల్యంలో వేసిన పునాది భవిష్యత్‌కు, బంగారు బాట ఇస్తుంది’’. శర్వాణికి చిన్నతనంలో పద్యాలు ఎక్కువ నేర్పేవారు. కృష్ణశతకము, కుమారి శతకము, దాశరథి శతకము, వేమన శతకము, సుమతీ శతకము పద్యాలు చదివించేవారు. దీనివల్ల నాలుక బాగా తిరిగి స్పష్టత రావడమేగాక భాషపై పట్టు వచ్చి, మేథాశక్తి, పేర జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. బాల్యంలో నేర్పించినవి తొందరగా జ్ఞాపకం ఉంటాయి. తేలిగ్గా నేర్చుకుంటారు. అలా శర్వాణిలో భాషపై ఆసక్తి పెరిగింది. పిల్లల కథల పుస్తకాలు ఎక్కువ చదివేది. తన ఫ్రెండ్స్ ఆదివారం ఆడుకోవడానికి వస్తే, వారికి తిరిగి, కథలు చెప్పేది.
అందులో చదివిన కథ కొంత తను కల్పించి చెప్పేది. దీనివల్ల సృజన పెరిగింది. క్లాసులు పెరిగే కొద్ది మరిన్ని పద్యాలు నేర్చుకుంది. చిన్నచిన్న కథలు పుస్తకంలో రాసుకునేది. కాని ఎవరు దాన్ని ఫెయిర్ చేసి, బాలమిత్ర, చందమామలకి పంపేవారు లేరు. ఆమెలో తన పత్రికలకి రాయాలనే తపన, సాహితీవనంలో విహరించే ఆసక్తి పెరిగింది. అటు పుస్తక పఠనతో ఒకసారి క్రొత్త రచయితలకు అవకాశం అని రూల్సు, రెగ్యులేషన్స్‌తో ప్రకటన చూసింది. ఆ ప్రకారం ఇంట్లో వాళ్లకి చెప్పి, కథ చూపించింది. ఆ ఇప్పటి నుంచి కథలు, కాకరకాయలు, కాదు బుద్ధిగా చదుకో అన్నారు. అయినా ఆమెలో తపన పోలేదు. వారు రూల్సు ప్రకారం కథ రాసి ఇంట్లో వాళ్ళకి చూపించింది. ఆ గతంలో మేము రాసాము మరి అచ్చు కాలేదు. ఇందులో సందులు, సమాసాలు బాగా లేవు, ఇంకొంత మెచ్చ్యురిటీ కావాలి అని డిస్కరెజ్ చేసారు.
వాళ్ళకి తెలియకుండా కాలేజీ నుంచి ఫ్రెండ్ సహాయంతో పోస్ట్ఫాసుకు వెళ్ళి తూకం వేయించి స్టాంపులు అతికించి పోస్టు డబ్బాలో పడేసింది. అది మొదటి రచన ఒక మహిళా పుస్తకానికి చేరింది. మూడు నెలల తర్వాత మీ రచన ప్రచురిస్తాము, వీలువెంట వస్తుందని తెల్పరు. ఇంక శర్వాణికి ఆనందం ఎవరెస్టు శిఖరం చేరింది. పిల్లల విభాగంలో ఈ కథ ప్రచురణకు నోచుకుంది. ఆ తరువాత వారి ప్రోత్సాహంతో రచయిత్రిగా ఎదిగింది. ఎవరు ఎప్పుడు ఏ రంగంలో రాణిస్తారో తెలియదు.
పెద్దలుమాత్రం ఇప్పటికి పిల్లలని డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. రచనలు కూడూ గుడ్డా పెడతాయ? తెల్లకాగితాలు, పోస్ట్ ఖర్చులని, అన్నలు వెక్కిరిస్తూ ఉంటారు. వాళ్లంతే మారరు. సమాజంలో కొంత మందైనా ఆలోచిస్తే చాలు అనుకుంటుంది. కొందరయితే ఆ... ఈ రోజు ఎవరు చదువుతున్నారు. అంతా, సెల్, టీవీ, నెట్ ప్రపంచం పుస్తకాలు, పేపర్స్ చదివే తీరిక లేదు అంటారు. శ్రీకాంత్ చిన్నప్పటి నుంచి తండ్రితోపాటు ....
ఆడపిల్లలే కాదు - సాహిత్య మీటింగులకు వెళ్లేవాడు. లైబ్రరీ ప్రోగ్రామ్స్‌కు వెళ్లే అక్కడ జరిగే పోటీల్లో పాల్గొని అన్ని ఫస్టు ప్రైజులు తానే అందుకునేవాడు. తండ్రి హెడ్‌మాస్టర్‌గా రైటైర్ అయ్యారు. ఈ లోగా శ్రీకాంత్ ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టుకొని గ్రాఫిక్ డిజైనర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయినా తృప్తి చెందలేదు. తంఢ్రి పర్మిషన్ ఒక చిన్న కథ రాసి ఒక చిత్రాన్ని షార్ట్ ఫిల్ము నిర్మించాడు. కొంత డైరక్టర్ బాధ్యత కూడా తీసుకొన్నాడు. అదృష్టం కలసి వచ్చింది. సక్స్‌స్ అయ్యాడు. ఇలా వివిధ స్థాయిల్లో ఉన్నవారు ఆ ఉద్యోగాలు చేస్తూనే తీరిక సమయాల్లో వారికిష్టమైన రంగాల్లో ప్రవేశించి అందులో అద్భుతాలు సృష్టించి ఆనందాన్ని పొందుతున్నారు. పక్కవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా వారికి చేయూతనిస్తున్నారు. పిల్లలు నచ్చిన రంగంలో ఎదగనిచ్చే సమయం వచ్చేసింది. పిల్లలూ మీకు మీరే సాటిగా మీ కాళ్లపై నిలబడవచ్చు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవచ్చు. మీకోసం ప్రభుత్వం ఎన్నో కోర్సులను పరిచయం చేస్తుంది.
పిల్లలే కాదు పెద్దలు కూడా తాము చదువుకునే సమయంలో ఇది లేకపోయింది అని బాధపడకుండా ఎన్నో సర్ట్ఫికేటు కోర్సుల్లో చేరి వారికిష్టమైన రంగాల్లో మెరుగు పర్చుకోవచ్చు. నేడు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన జీవన పథాన్ని మార్చుకొని అటు దేశాదాయాన్ని కూడా పెంచేయవచ్చు. కొంతమంది పెద్దవయస్సులో చదువుకోవాలనుకొంటారు. వారిని చూసి కొంతమంది ఈ వయస్సులో చదువుకుని ఎవర్ని ఉద్దరిస్తారు అని ఈసడిస్తుంటారు. చదువు అనేది ఉద్దరించడానికి కాదు విజ్ఞానం పెంచుకోవడానికి సర్ అర్థర్ కాటన్ తన 71 ఏట అరబ్బీ భాషను నేర్చుకొన్నాడట. అట్లానే చదువుకోవాలనే తపన ఉన్నవారికి వయస్సు అడ్డంకి కాదు. బహుభాషలు నేర్చుకుని అందులో వచ్చే సాహిత్యాన్ని చదివి తెలుసుకోవచ్చు. జీవితచరిత్రలు అసలు సాహిత్యం మనిషి మనుగడను తీరిదిద్దుతుంది. కథల ద్వారానే మనిషి తాను మానవీయ విలువలతో ఎలా జీవించాలో తెలుసకుంటాడు. అందుకే నేడు ఎన్ని ఆధునిక వినోదాలు వచ్చినా కథకు మాత్రం విలువ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
ఇక మీదే ఆలస్యం. ప్రతిభకు ఏది హద్దు కాదని నిరూపించండి.

-వాణి ప్రభాకరి