మెయిన్ ఫీచర్

సంపదపై అత్యుత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ రంగాన్ని వండి వార్చే ప్రసార మాధ్యమాలకు ఎప్పుడూ ఏదో ఓ మసాలా కావాలి. మసాలా సిద్ధంగా లేకుంటే హిందువులపైనో, స్వాములపైనో, ఆచార సంప్రదాయాలపైనో, మీడియా పడడం మిడిసిపడడం ఇటీవల ఎక్కువైంది. హిందుత్వంకు పెద్దదిక్కు కరువైన తరుణంలో కొంచెం పెద్దన్న పాత్ర పోషించాలని చూసిన జయేంద్ర సరస్వతి స్వాములవారిని శంకరరామన్ హత్య కేసులో ఇరికించి జైలుకు పంపించారు. అందులో తనకు తాను బ్రాహ్మణుల ప్రతినిధిని అని చెప్పుకొనే నాటి మేటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్ర అధికం. ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక’ అన్నట్లు అసలు విషయం తర్వాత బయటకు పొక్కింది. భారతదేశంలో అదిశంకర స్థాపితమైన నాలుగు పీఠాలతోపాటు, కంచి పీఠానికి ప్రసిద్ధి ఉంది. ఆ పీఠం క్రింద రాజులు దానంగా ఇచ్చిన భూములున్నాయి. విలువైన సంపద, ధనం ఎంతో ఉంది. దాంట్లో కొంత డబ్బు ప్రభుత్వ నాయకులకు ఇవ్వనందునే జయేంద్రపై కక్షగట్టి జైలుకు పంపారని పత్రికలు కోడై కూశాయి. జయేంద్ర సరస్వతిని జైల్లో కూర్చోబెట్టి ఎంతో బాధపెట్టారు. ఇందులో ఇంకే విదేశీ శక్తుల ప్రమేయం ఉందో నిజ నిర్థారణ చేస్తే సత్యాలు బయటకు వచ్చేవి. అలా మొదలైన మీడియా హాహాకారం, ప్రభుత్వ అహంకారం స్వామి అస్మితానందపై అజ్మీరు పేలుళ్ళ నేరం మోపి జైలుకు పంపింది. ఒరిస్సాలో మావోయిస్టుల రూపంలో ఇతరులు దాడులు చేస్తుంటే ఎదుర్కొన్న స్వామి లక్ష్మణానందను నిర్దాక్షిణ్యంగా చంపేసినా ఇంతవరకు విచారణకే దిక్కులేదు.
వీటన్నింటిపై వామపక్ష మీడియా ఎప్పుడూ పక్షపాతంగానే వ్యవహరించింది. ఈరోగమే అంటురోగంగా వ్యాపించిన ఆంధ్రప్రదేశ్ మీడియాకు ఇటీవల దుర్మార్గ దృష్టి ఎక్కువై ధ్వంస రచన చేస్తుంది. తిరుపతి వేంకటేశ్వరుని నిధులను స్వాహా చేస్తున్న నాయకులు, ఉద్యోగులను ఉపేక్షిస్తున్న వైనం మనం చూస్తూనే ఉన్నాం. అవినీతి వ్యాపార దృక్పథంగల నాయకులు, అధికారులు హిందూ ధర్మానికి రక్షణ కవచంలాంటి తిరుపతిని చెరబట్టడం చూస్తే ఆశ్చర్యం కలుగకమానదు. సిగ్గుతో తలదించుకొనే ప్రవర్తన అక్కడుంది.
అలాగే సత్యసాయి మరణశయ్యపై ఉన్నప్పటినుండి నిజాలను పైకి తేవడంతోపాటు, సత్యసాయిని అనుమానించేటట్లుగా మీడియా ప్రవర్తించింది. కొన్ని మీడియా వర్గాలు ట్రస్ట్‌ను కొన్ని వందల కోట్లు లంచంగా అడిగినట్లు ప్రయివేటు వ్యక్తుల సంభాషణల్లో తెలుస్తున్నది. ప్రపంచంలో ఒక స్వామి లేదా ప్రవక్త బ్రతికి ఉన్న సమయంలో 170 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఒక సత్యసాయికే చెల్లింది. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడే ఆయన శిష్యులు ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. అంతమాత్రాన ఆయన ప్రవక్త కాకుండా పోతాడా? సత్యసాయి శిష్యులు ట్రస్ట్‌లో ఉన్న వాళ్ళూ మనుషులే కదా! వాళ్లు చేసే వ్యక్తిగతమైన పొరపాట్లను హిందూ ఆధ్యాత్మిక విధానంలో ఉన్న పొరపాట్లుగా చూపించాలని మీడియా ఉవ్విళ్లూరుతుంది. అలాగే ఆయన సంపద ప్రభుత్వం పరం చేసి మురికి కాల్వలు, డ్రైనేజీ స్కీములకు వాడాలన్నట్లు కొందరు వాదిస్తున్నారు. ఇంకా హిందువులు నోరు మూసుక్కూచుంటే హజ్‌యాత్రలకు, జెరూసలేం యాత్రలకు ఆ ధనాన్ని మన రాజకీయ నాయకులు కేటాయించినా ఆశ్చర్యం లేదు. స్వాములు తాము సుఖపడకుండా ఆధ్యాత్మిక వాదాన్ని సంరక్షించాలనుకొని కూడబెట్టిన సంపదపై ఇలాంటి ప్రచారం తగునా? అలాగే కేరళలోని అనంత పద్మనాభస్వామికి ట్రావెన్‌కోర్ రాజ కుటుంబీకులు, ఇతరులు ఇచ్చిన ధనాన్ని నేలమాళిగల్లో దాచిపెట్టారు. కొన్ని చానళ్లు ఓ అడుగు ముందుకేసి, అనంతుని సంపదతో దేశంలో గొప్పదైన, ఖరీదైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాలంటున్నారు. కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ఇస్లాం, క్రైస్తవులు హిందుత్వంను నమ్మరు. కాని హిందువుల సంపదను మాత్రం జాతిసంపద చేయాలని ప్రకటనలు చేస్తారు. మేధావుల పేరుతో వ్యాసాలు రాస్తారు. ఇది ఎంత ఘోరమో ఆలోచించండి.
విదేశాలనుండి ఇతర మత సంస్థలకు వస్తున్న సంపదపై ఎప్పుడైనా, ఎవరైనా ప్రశ్నించారా? అరబ్ దేశాలనుండి ఇతర మత సంస్థలకు అందుతున్న విరాళాలపై లెక్క ఎప్పుడైనా అడిగారా? అలాంటివాళ్ళు ఇవాళ హిందూ దేవాలయాల, ఆశ్రమాలను ధ్వంసం చేయాలని కోరుకుంటున్నారు. పవిత్రంగా తపస్సు చేసుకొనే స్వాములను మనశ్శాంతి లేకుండా చేసి ఐటి దాడులు, సిబిఐ దాడులు చేసే స్థితికి దిగజారిన మన రాజకీయాన్ని ఆ దేవుడే కాపాడాలి. జైహింద్! *

డా॥ పి. భాస్కర యోగి -- 9912070125