మెయిన్ ఫీచర్

లేడీ కమాండో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షూటింగ్ అయినా..
మార్షల్ ఆర్ట్స్ అయినా..
జీట్‌కూన్ డోలో అయినా.. గుర్తుకొచ్చే ఒకే ఒక పేరు సీమారావ్. ఇరవై సంవత్సరాలకు పైగా భారత సైన్యానికి యుద్ధ విద్యలు నేర్పుతున్న ఏకైక మహిళ డాక్టర్ సీమారావ్.
సీమ తండి ప్రొఫెసర్ రమాకాంత్ సినరి స్వాతంత్య్ర సమర యోధుడు. పోర్చుగీస్ ఆక్రమణలో ఉన్న గోవా విముక్తి కోసం పోరాడిన వీరుడు. ఆ తండ్రి సీమకు చిన్నప్పటి నుండీ ధైర్యాన్ని నూరిపోశాడు. వీరోచిత సంఘటనలను కథలుగా మార్చి కూతురికి చెప్పి ఆమెలో పోరాట తత్త్వాన్ని, దేశభక్తిని పెంపొందించాడా తండ్రి . అవే ఆమెకు స్ఫూర్తి. దేశం కోసం ఏమైనా చేయాలి.. దేశాన్ని కాపాడాలి.. అనే తపనతోనే పెరిగింది సీమ. పదహారోయేట ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంది. అలా ఆమె దీపక్ రావు అనే మార్షల్ ఆర్ట్ ట్రై నర్ దగ్గర శిక్షణ కోసం చేరింది. కాలక్రమంలో ఆ పరిచయంప్రేమగా మారింది. ఇద్దరూ తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి మిలటరీ మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఒకవైపు మెడిసన్ చదువుతూనే ఇంకోవైపు మిలిటరీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు సీమ దంపతులు.
సీమ డాక్టరు చదివిన తరువాత కైసిస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కూడా పూఠ్తి చేసింది. నేను చిన్నప్పటి నుంచీ ఏదో చెయ్యాలనుకుని మరేదో చేస్తున్నాననే బాధ ఆమెకు ముందు నుంచీ ఉంది. దేశసేవ చేయాలి అని చిన్నప్పటి నుంచీ తను కలలుగన్న లక్ష్యం.. ఇప్పుడేమైంది? అని తనను తాను ప్రశ్నించుకుంది. చివఠికి ఆవైపుగా అడుగులు వేయాలని అనుకుంది. వెంటనే దేశ సాయుధ దళ సైనికులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆర్మీ, నావీ, బీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌జీ ప్రధాన సైనికాధికారులను కలిశారు ఆ దంపతులు.. తమ గురించి, తమ ఆశయం గురించి చెప్పారు. వారి గురించి విన్న సైనికాధికారులు ఆశ్చర్యపోయారు. వారి నిబద్ధతను గమనించి వారికి ఆర్మీలో అవకాశమిచ్చారు. అంతే మళ్లీ వెనుతిరిగి చూడలేదు సీమ. ఎన్ని కష్టాలు వచ్చినా, శారీరకంగా ఇబ్బంది పడినా వెనకడుగు వేయలేదు. ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక్కరూపాయి కూడా ప్రతిఫలం ఆశించకుండా దేశంపై ప్రేమతో ఫుల్‌టైమ్‌ట్రైనర్స్‌గా ఉన్నారు ఆ దంపతులు.
సైనిక బలగాల్లోని ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్స్, పారా కమెండోస్, మార్కోస్, గరుడ, బీఎస్‌ఎఫ్ కమాండోస్‌కు శిక్షణ ఇస్తోంది సీమ. మొదట్లో అందరూ ఈమె శిక్షణ నేర్పిస్తుందా? అని ఎగతాళి చేసినవారు ఇప్పుడు ఆమె పోరాట పటిమకు సెల్యూట్ చేస్తున్నారు. ఎవరు ఎంత ఎగతాళి చేసినా కొంచెం కూడా ఆమె తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ముందు నుంచీ ఉన్న పట్టుదల, క్రమశిక్షణతోనే ఆమె ముందుకు సాగింది. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ రంగంలో సీమ అడుగడుగునా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూనే ఉంది. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఓ మహిళగా ఆమెను తక్కువ చేసి చూస్తూనే ఉన్నారు. అయినా ఆమె వాటి గురించి అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉంది. నేషనల్ పోలీస్ అకాడమీ, ది ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వారికి ఆమె శిక్షణ ఇస్తున్నారు. 2009లో గరుడ కమెండోస్ శిక్షణ తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పారా జంప్ కోర్స్ శిక్షణకు ఆమెను ఆహ్వానించారు ఎయిర్‌ఫోర్స్‌వారు.
తనకు స్ఫూర్తిగా నిలిచిన తండ్రి చనిపోయినప్పుడు ఆమె వందల కిలోమీటర్ల దూరంలో.. నడక కూడా కష్టతరమైన కొండల్లో ఉంది. తండ్రి చనిపోయాడనే ఫోన్ వచ్చాక ఆమె ఏమీ మాట్లాడలేదు. మనసులోనే ఏడ్చుకుంది.. కారణం ఆమె చివరిచూపు చూడటానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. తన దేశభక్తికి, తన ఎదుగుదలకు కారణమైన తండ్రి ని చివరిసారిగా సాగనంపలేకపోయింది సీమ. ఆ సమయంలో ఆమె భర్త దీపక్ పక్కనే ఉన్నాడు. ఆమెను ఓదార్చాడు. కానీ సీమ తండ్రి జ్ఞాపకాలలో వౌనంగా అలా ఉండిపోయింది. ఆ వౌనం ఆమె ఓ దృఢమైన నిర్ణయం తీసుకునేందుకు నాంది పలికింది. అదే ఆమె తల్లికాకుండా ఉండాలనుకోవడం. ఈ విషయం వింటే ఎవరైనా ఉలిక్కిపడతారు. కారణం ఏ ఆడదైనా తల్లి కావాలనుకుంటుంది. ఆశపడుతుంది. తన కడుపున పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలనుకుంటుంది. కానీ సీమ పిల్లలు వద్దనుకుంది. కారణం తన దేశభక్తి. కమెండో ట్రైనర్‌గా తన జీవితం ఎంత కష్టంతో కూడుకున్నదో, శారీరక కష్టం ఎంత చేయాల్సి వస్తుందో తనకు తెలుసు. అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఆమె ఓ నిర్ణయం తీసుకుంటే అదెంత స్థిరమైనదో తెలుసుకున్న సీమ భర్త దీపక్ మారు మాట్లాడకుండా, ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు వేయకుండా ఒప్పేసుకున్నాడు. ఆ నిర్ణయం మంచిదే అయ్యింది. ఎందుకంటే సీమపై అనేకసార్లు దాడులు జరిగాయి. ఓసారి ఆమె వెనె్నముకకు పెద్ద దెబ్బ.. మరోసారి తలకు తీవ్ర గాయాలు.. ఫలితంగా జ్ఞాపకశక్తిని కోల్పోయింది. ఇలా.. తన చుట్టూ ఉన్న సమస్యలను చూసి చలించింది. దేశం పట్ల తనకున్న బాధ్యత ఎంత కష్టతరమైనదో, ఉన్నతమైనదో తెలుసుకుంది. ఆ నిబద్ధత, అంకితభావం, పట్టుదలలతోనే అమ్మతనాన్ని దూరం చేసుకుంది.
సీమ జీట్‌కూన్ డోలోలో ఎక్స్‌పర్ట్. దీన్ని బూ స్లీ కనిపెట్టారు. ఈ విద్యలో ప్రపంచవ్యాప్తంగా పదిమంది మహిళలు మాత్రమే నిష్ణాతులు. వారిలో సీమారావు ఒకరు. ఇంత కష్టతరమైన విద్యనే అవలీలగా చేస్తున్న సీమకు షూటింగ్, మార్షల్ ఆర్ట్స్ ఒక లెక్కా చెప్పండి. జీట్‌కూన్ డోలో విద్యతో పాటు ఇతర మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇవ్వడానికి ఆ దంపతులు యాన్ ఎలీట్ మిలిటరీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, అనార్మ్‌డ్ కమాండో కంబాట్ అకాడమీని స్థాపించారు. భారతసైన్యానికి ఇంత సేవ చేస్తున్నందుకుగానూ 2011లో సీమప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ ర్యాంక్ అవార్డును సొంతం చేసుకున్నారు. అలాగే భర్తతో కలిసి నాలుగుసార్లు ఆర్మీ చీఫ్ సైటేషన్స్ అందుకున్నారు. ఇప్పటివరకు ఈమె దాదాపు పదిహేనువేల మంది సైనికులకు శిక్షణనిచ్చారు. దాదాపు 47 దేశవిదేశాల సన్మానపురస్కారాలతో పాటు అత్యంత ప్ర తిష్టాత్మకమైన వరల్డ్ పీస్ అవార్డును అందుకున్నారు.
సమాజంలోని ‘ఆడపిల్ల’ దుస్థితిని చూసిన సీమ ఆడపిల్లను దత్తత తీసుకుందామని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. అతను ఆనందంగా ఒప్పుకున్నాడు. మహిళల రక్షణ కోసం కూడా సీమా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. స్తీ లు లైంగిక దాడులను ఎదుర్కొనేందుకు డిఫెన్స్ ఎగైనెస్ట్ రేప్ అండ్ ఈవ్ టీజింగ్ అనే ట్రైనింగ్ ప్రోగామ్‌ను ప్రారంభించారు సీమ. మహిళలు మానసికంగా, శారీరకంగా దృఢంగా మారడానికి ఈ ప్రోగా ం ఉపయోగపడుతుందని ఆమె నమ్మకం. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్‌పై ఓ సినిమాను నిర్మించి అందులో సీమ నటించింది. ఇందులో కూడా జీట్‌కూన్ డోను విద్యను చూపించారు. దాదాసాహెబ్ ఫాల్కే జ్యూరీ ప్రత్యేక ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం. వీటన్నింటి కంటే నాకు సైనికులకు శిక్షణనివ్వడమే గొప్ప ఆత్మసంతృప్తి అని చెబుతుంది ఫస్ట్ అండ్ ఓన్లీ ఫిమేల్ కమాండో ట్రైనర్ సీమారావు. ఇటువంటి అసాధారణ స్ర్తీ శక్తికి భారత సాయుధ దళాలే కాదు ఎవ్వరైనా సెల్యూట్ చెయ్యాల్సిందే.

- ఉమామహేశ్వరి