మెయన్ ఫీచర్

విప్లవ తపస్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రేపు అల్లూరి వర్ధంతి
==============
మన్యం సమర సేనాని’ అల్లూరి శ్రీరామరాజు మాతృదేశ బానిస శృంఖలాలు ఛేదించి, రవి అస్తమించని బ్రిటిష్ నిరంకుశ సామ్రాజ్యం పారద్రోలటానికి- ప్రాణాలను అర్పించిన వీరగాథ శతాబ్దినాటి కాలగర్భంలో నిక్షిప్తమై భారత జాతి ఉన్నంత కాలం చిరఃస్మరణీయమైంది. భారత స్వాతంత్య్ర సమరంలో మహాత్మా గాంధీ లక్ష్యానికి విభిన్నంగా, సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకొన్న భగత్‌సింగ్, సుభాష్‌చంద్ర బోస్ వంటి ఎందరో త్యాగ, సాహస ధీరోదాత్తుల కోవలో- తెలుగునాట 1922-1924లలో సీతారామరాజుగా జన బాహుళ్యంలో ఆరాధ్యనీయుడైన అల్లూరి, తన జీవిత సర్వస్వాన్ని భరతమాత పాద పద్మాలకు విప్లవార్చనగా సమర్పించిన విప్లవ తపస్వి.
1920 దశకంలో భారతజాతి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనా ప్రతిఘటనోద్యమాలతో, తిరుగుబాటు పోరా ట లక్ష్య ప్రజ్వలన దిశలో, మద్రాస్ ప్రెసిడెన్సీలోని మన్యం సీమలో గిరిజన సాయుధ సమరోత్తేజం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఇంగ్లండ్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరించి, తెల్లదొరలను వణికించింది. పరాయి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనలో మగ్గుతున్న అస్వతంత్ర భారతావనిలో రెండువందల ఏళ్లపాటు తలఎత్తిన గిరిజన సమరోద్యమాలలో మన్యం సీమలో అల్లూరి నాయకత్వంలోని మన్యం విప్లవానికి, నాటి అపార త్యాగ, ధైర్యసాహస తిరుగుబాటుకు, స్వతంత్ర భారతదేశం నేటికీ తలవంచి ప్రణుతి అర్పించవలసినదే. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో శ్రీరామరాజు ఎన్నడూ ఆరాధ్యనీయుడే. ఆయన త్యాగ, సాహస విప్లవానికి భారత స్వా తంత్య్ర చరిత్రలో విశేష స్థానం, గౌరవం దక్కవలసి వుంది. అత్యున్నతమైన భారత పార్లమెంట్ ఇంతవరకు ఈ విప్లవవీరుడిని గుర్తించకపోవటం తెలుగు రాష్ట్రాలకు దురదృష్టమే.
ఏ దేశమైనా, చారిత్రక విలువల పునాదులపై పునర్ మూ ల్యాంకనలతో జాతిని పునర్నిర్మించుకోవటం, సమాజపు గతాన్ని సంపూ ర్ణ వాస్తవాలతో ప్రతిబింబింపచేయటం ఆ దేశ మేధావుల కర్తవ్యం. నిక్కచ్చి వాస్తవాలు, కాలచక్ర పరిభ్రమణంలో వెలుగుచూస్తుంటాయి. సామాజిక చారిత్రక అగత్యంగా, అంతవరకు ప్రచారంలో వున్న అన్యాయాలు, అసంబద్ధాలను సరిదిద్దుకోవలసి వుంది. కాలగతిలో శతాబ్దాల నాటి మహనీయుల జీవిత ఇతివృత్తాలు నిరాధార అవాస్తవాలతో, విపరీత సృజనాత్మకంగా కల్పనా ధోరణులతో దారితప్పే రూపకల్పనలకు గురి అవుతుంటాయి. అది సహజం.
మన్యం విప్లవ కిశోరం అ ల్లూరి సీతారామరాజుగా సుప్రసిద్ధులైనప్పటికీ, అతని అసలు పేరు శ్రీరామరాజు. తల్లిగారి తండ్రి (తాత) పేరు అది. 1924 మే 7న కొయ్యూరు దగ్గర మేజర్ గూడాల్ అత్యంత క్రూరంగా కాల్చి చంపినప్పుడు రామరాజు వయస్సు 27 సంవత్సరాలే. రామరాజు సోదరి పేరు సీత. 1877లో జన్మించిన రామరాజుకు 14వ ఏట అన్నవరం కొండ మీద ఉపనయనం చేశారు. ఇరవై ఏళ్ళు రాకుండానే యువ ఆధ్యాత్మికవేత్తగా ఉత్తర భారత పుణ్యక్షేత్ర సందర్శనలు, పవిత్ర నదీ స్నానాలు చేసిన ఆయన సర్వసంగ పరిత్యాగిగా తనను తీర్చిదిద్దుకొన్న తత్త్వవేత్త. సీత అనే పేరు ఆయన పేరులో జత పడే సాన్నిహిత్యానికి ఎటువంటి అవకాశం లేదు. పైగా ఎలాంటి చారిత్రక ఆధారం లేదు. ఆయన తన తల్లికి రాసిన ఉత్తరంలో రామరాజు అనే సంతకం వుంది. 1897 జూలై 4న పాండ్రంగిలో అమ్మమ్మ గారింట జన్మించిన శ్రీరామరాజు 1924 మే 7న ఆఖరి శ్వాస విడిచేవరకు ఎక్కడా సీతారామరాజుగా ఎవ్వరూ పేర్కొనలేదు. దుచ్చర్తి ముఠాదారు చొక్కలింగం దొరకి, కలెక్టర్ బ్రేకన్‌కి, మిత్రుడు పేరిచర్లకి రాసిన ఉత్తరాలలో ఆయన శ్రీరామరాజుగానే సంతకాలున్నాయి. సినిమాలో నాటకీయత కోసం తెలుగు మేధావులు సృష్టించిన సీత పాత్రతో శ్రీరామరాజును- సీతారామరాజుగా ప్రచారం సాధించటం మన ఘనకార్యం. అల్లూరి శ్రీరామరాజు జీవిత గాథను, ప్రముఖ రచయిత, పాత్రికేయ ప్రముఖులు డా.గోపరాజు నారాయణరావు ఇటీవల ‘ఆకుపచ్చ సూర్యోదయం’ పేరిట ప్రామాణిక పరిశోధనతో సృజనాత్మకత వాస్తవ నవలా జీవన కథనంగా వెలువరించారు. ఈ సత్కృషి శతథా ప్రశంసనీయం.

-జయసూర్య 94406 64610