మెయిన్ ఫీచర్

హాలీవుడ్ మిషన్ పాజిబుల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్ ఆన్‌స్లాట్‌కు ఇప్పుడు ఇండియానే కీలకం. పక్కా బిజినెస్ అందిస్తున్న భారత మార్కెట్‌పైకి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు వ్యూహాత్మకంగా రీళ్లొదులుతున్నాయి. సినీ వినోద పరిశ్రమకు పెద్దన్నగా స్థిరపడటంతో, ప్రాంతీయ మార్కెట్లలో వ్యాపార వాటా దక్కించుకునే ‘కథ’లు వండుతున్నాయి. అనుమానాలకు ఆస్కారం లేకుండా అనువాదాలు అల్లుతున్నాయి. ఆర్టిస్టులను చేరదీస్తూ, ఆడియన్స్‌ను మాయచేస్తూ.. మొత్తంగా -్భరతీయ వినోద వ్యాపార విఫణిని కొల్లగొట్టేందుకు సాంకేతిక, వ్యూహాత్మక బలగాలతో దూసుకొస్తున్నాయి. గత నాలుగైదేళ్లలో -్భరత్‌ను టార్గెట్ చేసిన హాలీవుడ్ చిత్రాలు, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్లాక్‌బస్టర్ల విజయాలు విశే్లషిస్తే ఎవ్వరికైనా ఈ అనుమానాలు పుట్టకపోవు.. భయాందోళనలు రేకెత్తకపోవు.
పోటీతత్వం కనిపించే పరిశ్రమల్లో సినిమా ఒకటి. ప్రపంచ సినీ పరిశ్రమలో హాలీవుడ్ శక్తి అపారం. దానిముందు మనం నిలబడటం కష్టం. ఒక్క భారత్‌నే కాదు.. యూకె, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, జపాన్, చైనావంటి దేశాలనూ హాలీవుడ్ ఆక్రమిస్తోంది. సాంకేతిక మాయాజాలంతో స్మాల్ స్క్రీన్స్‌ను చించేస్తోంది. ప్రాంతీయ చిత్రాన్ని చంపేస్తోంది. సృజనాత్మక రంగంలో పొటీ మంచిదే కావొచ్చు, కానీ ఎదురొడ్డి నిలబడగలిగే ప్రణాళికే మన దగ్గర లేదు’ అని బిగ్ బి అమితాబ్‌లాంటి అనుభవజ్ఞులే వ్యాఖ్యానించారంటే -్భవిష్యత్ పరిస్థితిని అంచనా వేయడం కష్టమైన పని కాదు.
భారత్‌ను టార్గెట్ చేస్తూ వేగం పెంచిన హాలీవుడ్ సినిమాలపై బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూఖ్ వేసిన చమత్కారాన్నీ ఇక్కడ ప్రస్తావించుకోవాలి. పైకి చతురోక్తిలా వినిపించినా, షారూఖ్ మాటల్ని లోతుగా అర్థం చేసుకుంటే భవిష్యత్ రీళ్లురీళ్లుగా కనిపించడం ఖాయం. -‘మన అదృష్టం కొద్దీ హాలీవుడ్ సినిమా సంస్కృతిలో ఆరు పాటలు ఉండవు. వాళ్ల దురదృష్టం కొద్దీ, ఐటెమ్ సాంగ్స్‌నీ పెట్టుకోరు. సో.. వాళ్లెప్పటికీ మనతో పోటీకి రాలేరు’ అని ఒక సందర్భంలో చలోక్తి విసిరాడు కింగ్‌ఖాన్. కానీ, భారతీయ వినోద పరిశ్రమలో బలమైన శక్తిగా పాతుకుపోవడానికి హాలీవుడ్ దూసుకొస్తోందన్న స్పృహను కింగ్‌ఖాన్ నర్మగర్భంగా వ్యక్తం చేశాడు. ఖాన్ చమత్కారాన్ని కచ్చితమైన ప్రశ్నతో విశే్లషించుకుంటే -చెమటలు పట్టే నిజాలు దొరక్కపోవు. ఐటెమ్ పాటలో, ఆరుగుర్ని గాల్లోకి ఎగరేసికొట్టే హీరోయిజం యాక్షన్ ఎపిసోడ్సో పక్కనపెడితే -లోకల్ ఆడియన్స్‌కు హాలీవుడ్ సినిమా ఇప్పటికే చాలా దగ్గరైపోయిందన్న పర’మార్థం షారూక్ చమత్కారంలో కనిపిస్తుంది. ఆ దగ్గరితనం -కథాపరంగా కావొచ్చు... కల్చర్‌ని చూపడంలో కావొచ్చు. మన నటులను వాళ్ల ప్రాజెక్టుల్లోకి తీసుకోవడం ద్వారా కావొచ్చు. లేదూ -్భరతీయ లొకేషన్స్‌లో హాలీవుడ్ సినిమా షూట్ చేయడం ద్వారా కావొచ్చు. ఇవన్నీ కాదనుకుంటే -అంతకుమించిన ‘హాలీవుడ్’ సినిమాను మన డిస్ట్రిబ్యూషన్ విధానంలో మార్కెట్ చేసుకోవడం ద్వారా కూడా కావొచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే మన సినిమాను ఎలా చూడ్డానికి మనం అలవాటుపడ్డామో.. అచ్చంగా అలానే వాళ్ల సినిమాను చూపించే ప్రయత్నాలను హాలీవుడ్ ముమ్మరం చేస్తోందన్న మాట. అంటే -మనకు అలవాటైన రుచిని మనకు నచ్చేలా వండి వడ్డించేందుకు హాలీవుడ్ సిద్ధమవుతోంది. లేదూ అంతకుమించిన కొత్త రుచులు అందిస్తూ ఆడియన్స్‌ను మాయచేయబోతోంది. హాలీవుడ్ సినిమాకు అట్రాక్టయ్యేలా దేశీయ ప్రేక్షకుడిని సంసిద్ధం చేస్తోందన్న మాట. అందుకు గత ఏడాది ఇండియన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రెండు సినిమాల ఫలితాలను ఉదహరించొచ్చు.
**
విస్తరిస్తోన్న వినోద ప్రపంచంలో.. వంద కోట్ల క్లబ్‌కు చేరడమే సినిమా సక్సెస్‌కు ప్రామాణికమన్న మైండ్‌సెట్‌తో వున్న భారతీయ సినిమాకు -హాలీవుడ్ చిత్రాలు పెద్ద జోల్టే ఇచ్చాయి. గత ఏడాది వసూళ్లను విశే్లషిస్తే భారత్‌లో వంద కోట్ల క్లబ్‌కు చేరిన సినిమాలు పదో పరకో ఉంటాయి. -అందులో రెండు మూడు సినిమాలు తిరిగి హాలీవుడ్‌వే. పైగా, ఫ్యూరియస్ 7, జురాసిక్ వరల్డ్‌లాంటి సినిమాలు 150 కోట్ల క్లబ్‌ని దాటేసి లోకల్ సినిమాకు షాకిచ్చాయి.

నిజానికి హాలీవుడ్ స్ట్రాటజీ ఇప్పుడే.. ఇక్కడినుంచే మొదలైందేమీ కాదు. మైండ్‌సెట్ విషయంలో మనకు దగ్గరగావున్న, వ్యాపారం విషయంలో మనకంటే బలమైన చైనానుంచి మొదలెట్టింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాలు చైనా, ఇండియా. అదే సమయంలో సినీ వినోదానికి ఎక్కువ అలవాటుపడిన దేశాలూ -చైనా, ఇండియాలే. నిజానికి సినీ వినోదం కోసం పడిచచ్చే ఆడియన్స్ సంఖ్య చైనాకంటే ఇండియాలోనే ఎక్కువ. కానీ, వ్యాపారపరంగా బలోపేతం కావడానికి హాలీవుడ్ వ్యూహాత్మకంగానే చైనాను ముందు ఎంచుకుంది. ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ ఎక్స్‌టింక్షన్’, ‘అవతార్’, ‘్ఫ్యరియస్ 7’ లాంటి సినిమాలతో అక్కడి మార్కెట్‌లో నిలదొక్కుకుంది. ఇప్పుడు ఇండియాలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. మనం చూస్తున్నది హాలీవుడ్ సినిమా అన్న ఫీలింగ్ ఆడియన్స్ మైండ్‌లోకి రాకుండా -తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్తగా వస్తోన్న హాలీవుడ్ ప్రాజెక్టుల్లోకి మన స్టార్స్‌కు ప్రాథాన్యత కల్పించడం ద్వారా ‘మన సినిమా’ అన్న ఫీలింగ్‌ను మైండ్‌లోకి ఇంజెక్ట్ చేస్తోంది. మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రొటోకాల్ చిత్రంలో అనిల్‌కఫూర్ కనిపించడానికి, క్వాంటికోతో స్టార్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాకు ప్రాధాన్యత కల్పించడానికి కారణమిదే. రాబోతున్న బేవాచ్‌లోనూ ప్రియాంకకు కీలకమైన పాత్రే దక్కడం హాలీవుడ్ స్ట్రాటజీయే. ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో బాలీవుడ్‌లో వెలిగిపోతున్న దీపికా పదుకొనెను చూపించబోతోంది. దేశీయ సినిమాకు స్టార్ కాస్టే ప్రత్యేకమైన ఇమేజ్. ఒక సినిమా సక్సెస్‌కు హీరో హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల ఇమేజ్ కూడా ప్రధానమే. అయితే, భవిష్యత్‌లో దేశీయ సినిమా నుంచి ఈ ‘స్పెషల్ ఇమేజ్’ తొలగిపోవచ్చు. కారణం -ఈ స్టార్ ఇమేజ్‌ను ఇప్పుడు హాలీవుడ్ ఆక్రమిస్తోందన్న మాట. ఇప్పటికే ఫలానా హాలీవుడ్ సినిమాలో ఫలానా మన స్టార్ చేయబోతోందట అంటూ చెప్పుకునే రోజులకు వచ్చేశాం. తరువాత హాలీవుడ్ ప్రాజెక్టులను సైతం మానసికంగా మనమే ఓన్ చేసేసుకుని -మన సినిమాగా చూసేసే రోజుకు వచ్చేస్తున్నాం. అంటే హాలీవుడ్ నిర్మాణ సంస్థలు భారత్‌లో బలంగా నిలదొక్కుకోవడానికి మనమే మెట్లు కడుతున్నామన్న మాట. విక్రమ్ ‘ఐ’ ప్రారంభోత్సవానికి హాలీవుడ్ యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ హాజరుకావడం, సల్మాన్‌ఖాన్ ‘దబాంగ్’ సినిమాలో పాపులర్ హాలీవుడ్ హీరో టామ్ క్రూసీ కనిపించడం వెనుక -హాలీవుడ్ నిర్మాణ సంస్థల స్ట్రాటజీ లేదని ఎలా చెప్పగలుగుతాం. ఇండియన్ మార్కెట్‌లో మేజర్ షేర్ సంపాదించాలంటే -హాలీవుడ్‌ని లోకలైజ్ చేయాలన్న వ్యూహాన్ని బలంగా పన్నుతున్నాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు.
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఓ పది హాలీవుడ్ సినిమాలనే తీసుకుందాం. ఫ్యూరియస్ 7, అవతార్, జురాసిక్ వరల్డ్, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, స్పైడర్ మ్యాన్ 3, 2012, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2, లైఫ్ ఆఫ్ పి, టైటానిక్. ఈ సినిమాల్లోని భావాన్ని, భావుకతను, అందాన్ని, హీరోయిజాన్ని.. ఇలా విడివిడిగా పరిశీలించుకుంటే -మన పురాణ ఇతిహాసాల్లోని హీరోల పాత్రలో, మానవ సంబంధాల్లోని భారతీయ బాంధవ్యాలో మెత్తటి స్పర్శలా తగులుతాయి. కంటికి కనిపించని నూలి పోగుకు అంతర్లీనంగా మన సన్నివేశాలన్నీ ముడిపడిన భావన కలుగుతుంది. ఆ సినిమాలు చూస్తున్నంతసేపూ మన సినిమా చూసినట్టే ప్రేక్షకుడు ఫీలయ్యాడు. దేశీయ సినిమాలను మించిన సాంకేతిక గాఢత, స్వచ్ఛతను రుచి చూశాడు. స్క్రీన్‌పై తర్జుమా అక్షరాలు కనిపించకున్నా, థియేటర్లో అనువాద శబ్దాలు వినిపించకున్నా -సినిమాను అర్థం చేసుకుని ఆనందించాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వాన కురిపించాడు. ఇది పసిగట్టిన హాలీవుడ్ నిర్మాణ సంస్థలు -రాబోయే చిత్రాలకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. బాలీవుడ్‌నే కాదు, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌నూ దృష్టిలో పెట్టుకుని విజయాలు సాధించేందుకు వీలుగా చిత్రాల అనువాదంపై దృష్టి పెడుతున్నాయి. డబ్బింగులో భాషా భావ భేదాలు తలెత్తకుండా -సులువైన పదాలు, స్థానిక నానుడిలతో స్క్రిప్ట్ మరింత పదునుదేరేలా, ఆడియన్స్‌కు సులువుగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయి. అందుకే కొన్నాళ్ళ క్రితం వరకూ మల్టీప్లెక్స్‌లకే పరిమితమైన హాలీవుడ్ సినిమాలు -ఇప్పుడు బి, సి గ్రేడ్ థియేటర్లనూ, ప్రేక్షకులనూ టార్గెట్ చేయగలుగుతున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలయనీర్’, కొన్నాళ్ల క్రితం వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పి’ హాలీవుడ్ చిత్రాలను బాలీవుడ్ సినిమాలే అన్నంతగా రిసీవ్ చేసుకుంటే -కొద్దిరోజుల క్రితం వచ్చిన ‘జంగిల్ బుక్’ను స్థానిక చిత్రమేనన్నంతగా ఆడియన్స్ ఆదరించారు. అందులోని పాత్రలకు సైతం అలవాటైన పేర్లు పెట్టడంతో -మరింత కనెక్టయ్యారు. మొత్తంగా సినిమాను ఓన్ చేసుకుని సక్సెస్ అందించారు.
చాలాకాలంగా -చాలావరకూ ప్రాంతీయ సినిమాలు హాలీవుడ్ ప్రభావానికి గురవుతున్నవే. కథా వస్తువు కోసమో, రక్తికట్టించేలా సన్నివేశాన్ని తీర్చిదిద్దటం కోసమో -హాలీవుడ్ ప్రభావానికి తలొగ్గారు మన సినిమా వాళ్లు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ సీన్ కోసమో, అద్భుతమైన ఎపిసోడ్‌ను సృష్టించడానికో హాలీవుడ్ సినిమాను కాపీలు కొట్టేశాం. ఇదే కొంపముంచడాని ఓ కారణమైంది కూడా. అనుకరణవల్లో, అనుసరణవల్లో.. క్రమంగా హాలీవుడ్ స్టయిల్ సినిమాకు అలవాటుపడిన లోకల్ ఆడియన్స్ -డైరెక్ట్‌గా హాలీవుడ్ సినిమాలే చూడ్డానికి అలవాటుపడ్డారు. ఈ పరిస్థితినీ డిస్నీ, యూనివర్శల్ లాంటి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు చక్కగా వాడుకుంటున్నాయి. స్టార్ వార్స్: ది ఫోర్స్ ఆఫ్ అవేకన్స్, జురాసిక్ వరల్డ్, ఫ్యూరియస్ 7, అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లాంటి భారీ చిత్రాలను భారత్ మీదకు ధైర్యంగా వదలగలిగాయి. ఇప్పటికే ప్రేక్షకులు రుచి చూసిన అనేక హాలీవుడ్ హిట్టు చిత్రాల సీక్వెల్స్ భారత్‌పై దాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. రిసర్జన్స్ -ఇండిపెండెన్స్ డే, కాంజురింగ్ 2, వార్‌క్రాఫ్ట్, ఐస్ ఏజ్ -కొలిజన్ కోర్స్, రోగ్ వన్ -స్టార్‌వార్స్, ఫైండింగ్ డోరీ, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అవతార్ 2, ఘోస్ట్ బస్టర్స్ 3, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 2, మెడగాస్కర్ -4, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ -5, రష్ అవర్ -4, షెర్లాక్ హోమ్స్ 3, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ -3, ది ఇన్‌క్రెడిబుల్స్ -2, ది నట్ జాబ్ -2, కుంగ్ ఫు పాండ -4, టీనేజ్ -ముటేంట్ నీంజా టర్టిల్స్ -2, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ -3, బ్యాడ్ బాయ్స్ -2లాంటి భారీ చిత్రాలు భారతీయ మార్కెట్‌ను ఊపేసే వ్యూహంతో విడుదలకు సన్నద్ధమవుతున్నాయి.
****
వినోద ప్రపంచాన్ని శాసిస్తున్న -హాలీవుడ్‌ని అందుకోవడానికి భారతీయ సినిమా ఉరకలేస్తోంది. ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ -ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హాలీ’డే ట్రిప్ అవకాశాల కోసం హైవే ఎక్కేస్తున్నారు. ప్రపంచ సినిమాతో మమేకమయ్యేందుకు హాలీవుడ్ లోహ విహంగాల రాక కోసం రన్‌వేపై ఎదురు చూపులు చూస్తున్నారు. -ఇదొక కోణం.
***
వినోద ప్రపంచాన్ని మరింత గుప్పిట బిగించేందుకు -రన్‌వే వదలి రోడ్డెక్కేసింది హాలీవుడ్. -డబ్బింగ్ మాటల్లో స్థాని‘కథ’లు చెబుతూ.. స్మాల్ స్క్రీన్స్‌పై సాంకేతికంగా విజృంభిస్తోంది. ఆర్టిస్టులకు ఎరవేసి.. ఆడియన్స్‌ను
మాయచేసి -్భరతీయ
మార్కెట్‌ను తనలో కలిపేసుకునే కసరత్తు చేస్తోంది.
ఇదింకో కోణం.
****
ప్రేక్షకులు ఇప్పటికే రుచి చూసిన అనేక హాలీవుడ్ హిట్టు చిత్రాల సీక్వెల్స్ భారత్‌పై దాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. రిసర్జన్స్
-ఇండిపెండెన్స్ డే, కాంజురింగ్ -2, వార్‌క్రాఫ్ట్, ఐస్ ఏజ్ -కొలిజన్ కోర్స్, రోగ్ వన్ -స్టార్‌వార్స్, ఫైండింగ్ డోరీ, డాన్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, అవతార్ -2, ఘోస్ట్ బస్టర్స్ -3, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ -2, మెడగాస్కర్ -4, పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ -5, రష్ అవర్ -4, షెర్లాక్ హోమ్స్ -3, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ -3,
ది ఇన్‌క్రెడిబుల్స్ -2, ది నట్ జాబ్ -2, కుంగ్ ఫు పాండ -4, టీనేజ్ -ముటేంట్ నీంజా టర్టిల్స్ -2, హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ -3, బ్యాడ్ బాయ్స్ -2లాంటి భారీ చిత్రాలు భారతీయ మార్కెట్‌ను ఊపేసే వ్యూహంతో విడుదలకు
సన్నద్ధమవుతున్నాయి.

మహాదేవ