మెయిన్ ఫీచర్

అవసరాలే ఉపాధి మార్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి తరం స్ర్తిలందరూ ఏదో ఒక ఉపాధిమార్గాన్ని ఎంచుకుని ముందుకు పోతుంటారు. ఉపాధి వెతుక్కోవడంలోనే స్ర్తిలే మెరుగ్గా కనిపిస్తున్నారు. కొందరికి స్టాప్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. వారంతా పొద్దునే్న ఆఫీసులకు వెళ్లితే ఏ రాత్రి 11కో ఇంకా మాట్లాడితే 12 తర్వాతనో వస్తున్నారు. ఇట్లా చేయడంలోవారికి ఇంట్లో ఉండే సమయం తక్కువ. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా ఇలాంటి ఉద్యోగాలకోసం వెళ్తునే ఉన్నారు. పిల్లలున్న తల్లులు ఈ ఉద్యోగాలు చేయడంలో కాస్త వెనుక బడితే వాళ్లకోసం కొందరు స్ర్తిలు క్రష్ నిర్వహణ చేస్తూ అట్లాంటి తల్లులకు ఊరట నిస్తున్నారు. ఈ క్రష్ నిర్వహణలో నెలల పసికందుల నుంచి స్కూలుకువెళ్లి ఎల్‌కేజీ యుకేజీ చదువులు పూర్తి అయ్యేదాకా ఉన్నవారు కూడా ఉంటున్నారు.
ఈ క్రష్‌లకు తమ పిల్లలను పంపిస్తున్న తల్లులు కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. మాకు మా ఆఫీసుల్లో నిశ్చింతగా పనిచేసుకుంటున్నాము. అటు ఆదాయాన్ని పెంచుకుంటున్నాము. ఇటు మా పిల్లల పోషణలో ను లోటు రానివ్వడం లేదు. కనుక మాకు ఈ క్రష్‌లను నిర్వహించే వారు మాకు ఎంతో సహాయం అందిస్తున్నారు కనుక వారికిచ్చే ఫీజులనుమేము వారికి కానుకలుగా తలిచి ఇస్తున్నాము అని వారు సంతోషిస్తున్నారు.
నిజమే అటు ఆదాయం ఇటు సహాయం చేసే ఈ క్రష్ ల నిర్వహణ మాకు ఎంతో మానసిక తృప్తిని కూడా ఇస్తోందని నిర్వాహకులు, పని చేసేవారు చెబుతున్నారు.
క్రష్ ల నిర్వహణలో నేడు స్ర్తిలే అందెవేసినవారుగా చలామణి అవుతున్నారు. దీనికి కారణం స్ర్తిలో సహజంగానే మాతృత్వం సువాసనలుండడమే. దీనివల్ల తల్లిగా మారి ఇతరుల పిల్లలకు చక్కగా పోషణ నిస్తూవారిని సక్రమంగా పెంచుతూ వారి తల్లులకు సహాయం చేస్తున్నారు. దీని వల్ల మంచి ఆదాయమూ వస్తుందని క్రష్ నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాక క్రష్ ల్లో కాస్త వయసు మళ్లిన వారిని సహాయకులుగా పెట్టుకున్నందువల్ల చిన్న పిల్లల్లో పొడచూపే చిన్నచిన్న రోగాలకువారు మందులు చెప్పుతూ ఆ చిన్న పిల్లలు సరియైన ఆరోగ్యంతో పెరిగేట్టు గా చేస్తారు. కొత్తగా క్రష్‌లు పెట్టేవాళ్లు ఇలాంటి పెద్దవాళ్లను సహాయకులుగా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. దానివల్ల ఒక్కరుగా ఉండే వృద్ధులకు, వృద్ధాశ్రమంలో శ్రమ చేయగలిగిన వృద్ధులను తీసుకోవడానికి వీరు ఆసక్తిని చూపుతున్నారు. వృద్ధులు కూడా ఈ క్రష్ నిర్వహణ ఆనందంతో పని చేయడానికి ఉత్సుకతను చూపుతున్నారు. దానివల్ల వారి మనసు పాత జ్ఞాపకాలతో మళ్లీ కొత్త శక్తిని నింపుకుంటోందని వారు చెబుతున్నారు. కనుక స్ర్తిలు మాకు సంపాదించేమార్గాల్లేవు అని వ్యాకులపడుతూ కూర్చోక చుట్టూ ఉన్నసమాజం ఏమి కోరుకుంటుందో తెలుసుకొని దానిద్వారా వారు స్వయంఉపాధిని పొందుతున్నారు. ఇట్లాంటి స్ర్తిలను ఎవరైనా అభినందించాల్సిందే. ఇది ఇతర స్ర్తిలకు ఓ ఆదర్శంగా ఉంటుంది అంటారు నిపుణులు. వీరి చొరవను చూసి ఇంకొంతమంది వారి చుట్టుపక్కల ఉన్నవారి పరిస్థితులకు తగ్గట్టుగా వారిని వారు మలుచుకుంటూ ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి స్ర్తిలే అందెవేసిన వారుగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి.

--వాణి