మెయన్ ఫీచర్

థర్డ్ ఫ్రంట్ ఒక స్టంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయచంద్రులూ రాజకీయ లబ్ధికోసం నాటకాలు మొదలుపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు ‘ప్రత్యేక హోదా’ అంశంతో జనాలకు పిచ్చి ఎక్కిస్తే, కల్వకుంటవారు అప్పులను ఆస్తులుగా చూపించి అభివృద్ధి సాధించినట్లు నమ్మిస్తున్నారు. తృతీయఫ్రంట్ అనే కొత్త స్టంట్ మొదలుపెట్టాడు. మమతా బెనర్జి (బెంగాల్ ముఖ్యమంత్రిణి) తన ఫ్రంటుకు అనుకూలంగా ఉంది అని ప్రకటించిన గంటలోనే అలాంటిదేమీ లేదు అని ఆమె పత్రికా ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మా ఫ్రంట్‌లో చేరుతున్నారు అని చెన్నై విమానాశ్రయంలో కల్వకుంటవారు ప్రకటించిన మరుక్షణమే ‘అలాంటిదేమీ లేదు, మేము కాంగ్రెసులోనే ఉంటాము’ అని డిఎంకె తెగేసి చెప్పింది. అసలు నాతో ఆయన తృతీయఫ్రంట్ గూర్చి మాట్లాడలేదు అని కరుణానిధిగారి కుమార్తె శ్రీమతి కనుమెంజి ప్రకటించింది. మరి తృతీయఫ్రంట్ ఎక్కడ? దానికి కెసిఆర్ నాయకత్వం ఎక్కడ?
చంద్రబాబు నాయుడు నాకు మంచి స్నేహితుడు అని కల్వకుంటవారు చెన్నైలో ప్రకటించారు. హైదరాబాద్ విమానాశ్రయం రాగానే ఓటుకు నోటు కేసును తిరగదోడి రేవంత్‌రెడ్డి, చంద్రబాబులను జైలుకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు.. ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ నాయకులు విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్‌ను రాజకీయంగా అపఖ్యాతి పాలు చేసే నిమిత్తం కాస్టింగ్ కౌచ్ ఇతివృత్తాన్ని తెరపైకి తెచ్చారు. విభజన చట్టంలోని హామీలు అమలుచేయలేదు అంటూ తిరుపతిలో ఒక రోజు ముఖ్యమంత్రి నిరాహారదీక్ష చేశారు. అందుకు అయిన ఖర్చు మూడు కోట్లు అని ఒక అంచనా.
1. రాష్ట్ర విభజనకు ముందుగా లెటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు.
2. విభజన చట్టం బాగా అమలు జరుగుతున్నది- ప్రత్యేక హోదా వద్దు- ప్యాకేజీ ముద్దు అని లోగడ ప్రకటించింది కూడా ఆయనే. మరి ఇప్పుడీ నూతన విన్యాసాలేమిటి?
నారా చంద్రబాబు నాయుడుకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయానుభవం ఉంది. 2014లో జనసేన, బిజెపిలతో కలిపి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఇవ్వాళ అలాంటి పరిస్థితి లేదు. పైగా సర్వేలల్లో వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి మొగ్గు కన్పడుతున్నది. ఈ కారణం చేత ప్రజలలో భావోద్రేకాలు రెచ్చగొట్టేందుకు ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో జనంలోకి వచ్చాడు.
ఈ పల్లవి ఆయనను గట్టెక్కిస్తుందా? 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రదేశంలో ఒక శూన్యం వ్యాపించింది. నూతన రాజధాని నిర్మాణం తలకు మించిన భారమయింది. హైదరాబాదు నగరం ఈ స్థాయిలో అభివృద్ధి కావటానికి 400 సంవత్సరాలు పట్టింది. మరి అమరావతి అభివృద్ధి కావటానికి కనీసం 50 సంవత్సరాలైనా కావాలి. ఐనా ఆయన శ్రమించి కృషిచేసిన మాట వాస్తవమే. కాని రాజకీయ లబ్ధికోసం ఎన్నికల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంపై అభాండాలు వేయటం తగదు. నరేంద్ర మోడీని విలన్‌గా సృష్టించి సోనియాగాంధీకి సన్నిహితం కావాలని చంద్రబాబు ప్రయత్నించటం ఆత్మహత్యా సదృశం. కాంగ్రెసు వ్యతిరేకత అనే పునాదిపై తెలుగుదేశం పార్టీ అవతరించింది. రాష్ట్ర విభజనకు ఆంటోనియో మైనో సూత్రధారిణి. కెసిఆర్ పాత్రధారి- విభజన హామీ నిజంగానే అమలు కాలేదా? ఇవాళ తృతీయఫ్రంట్‌కు అటు కెసిఆర్ ఇటు చంద్రబాబు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ తొందరలో జనాలకు వాస్తవాలు చెప్పకుండా దాచకూడదు. యం.వెంకయ్య నాయుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో దాదాపు 20 జాతీయ స్థాయి సంస్థలు ఎపికి మంజూరు చేయబడ్డాయి. అందులో సింహపురి జిల్లాకు సింహభాగం దక్కింది. ఇది కాదనలేని సత్యం. అందుకు గణాంకాలే సాక్ష్యం.
ఇవిగో గణాంకాలు
‘మాటకు ప్రాణము సత్యము’ అన్నాడు సుమతీ శతకకారుడు.
ఇలా విశ్వసనీయత కొరవడితే గొల్ల పిల్లవాడు-పెద్దపులి కథలో వలె తర్వాత నిజం చెప్పినా నమ్మే పరిస్థితి ఉండదు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుచేస్తున్నవారు ఎందుకు నిజాలు చెప్పటంలేదు.
ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల సంగతి చూద్దాం-
చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రానికి 90 శాతం కేంద్రం భరిస్తుంది. కానప్పుడు 60 శాతం కేంద్రం వాటా ఉంటుంది. ఇపుడు అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది కాబట్టి 30 శాతం మేరకు ‘ప్రత్యేక హోదా’ అనే పేరు లేకపోయినా నరేంద్ర మోడీ నుండి సహాయం అందింది. ఆ మొత్తం విలువ మూడు వేల కోట్లు. 1. విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. కాని ఏడాదిలోనే చంద్రబాబు విజయవాడకు వెళ్లిపోయాడు.
2.ఈ ఆర్థిక సహాయం పదేండ్ల కాలపరిమితిలో లభిస్తుంది. ఐనా మూడేండ్లలోనే ఇవ్వటం జరిగింది.
3.కేంద్ర నిధులను ఉభయ చంద్రులూ దారి మళ్లించి తమ స్వంత పథకాల పేరుతో అమలుచేసి జనంలో ప్రచారం చేసుకున్నారు.
4.విభజన జరిగిన 2014 జూలై నుండి 2015 మార్చి వరకు ఉన్న రెవెన్యూ లోటు 4 వేల కోట్లు కేంద్రం భరించింది.
5.పెట్టుబడులు: ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులలో 10 లక్షల కోట్లు మొత్తంలో 3.5 లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిన మొత్తమే.
6.విద్యుత్తు: విభజన నాటికి లోటు విద్యత్తు ఉండగా ఇపుడు ఎపి విద్యుత్ మిగులు రాష్ట్రంగా పీయూష్ గోయల్ చేయగలిగారు.
7.విభజన జరిగిన ఆరు నెలలలోపే విజయవాడ ఆకాశవాణి దూరదర్శన్ స్వతంత్ర ప్రతిపత్తి గల స్థాయికి ఎదిగేటట్లు కేంద్రం చేసింది.
8.పోలవరం: దీని నిర్మాణం ఖర్చు పూర్తిగా కేంద్రమే భరిస్తున్నది.
9. విద్యా సంస్థలు: ఐఐటి తిరుపతి, ఐఐటి తాడేపల్లిగూడెం (450 కోట్లు), ఐఐఐటి- దినె్న దేవరపాడు (కర్లూలు జిల్లా) కేంద్రీయ విశ్వవిద్యాలయం (అనంతపురం), ఐఐఐఎస్‌ఆర్ (చిత్తూరు జిల్లా ఏర్పేడు), ఐఐఐసిఐ (విశాఖ-సబ్బవరం)ఙ, ఎఐఐఎంఎస్ (మంగళగిరి), గిరిజన యూనివర్సిటీ (విజయనగరం) - ఇవన్నీ గత మూడేళ్ల ఎస్‌ఐడిఎం (బాపట్ల) ఎపి మంజూరు చేసిన ప్రాజెక్టులే.
విభజన చట్టంలోలేనివి కూడా మంజూరు అయినాయి. ఉదాహరణకు అమలాపురం జిల్లా పాలసముద్రంలో ఎస్‌ఎపిఐఎస్ నిర్మాణం మొదలయింది (వ్యయం 500 కోట్లు), ఎన్‌ఐఒటి (నెల్లూరు జిల్లా తుప్పునవారిపాలెం) 250 కోట్ల వ్యయం- విభజన చట్టంలో లేని ప్రాజెక్టు. ఎన్‌సిఐఆర్‌టి, నెల్లూరు జిల్లా (విభజన చట్టంలో లేదు), ఎంఎస్‌ఎంఇ (విశాఖ జిల్లా) అచ్యుతాపురం- విభజన చట్టంలో లేదు. నేషనల్ కామధేను బ్రీజింగ్ సెంటర్ (నెల్లూరు జిల్లా చింతలదేవి) విభజన చట్టంలో లేదు. సిఐపిఇటి- విభజన చట్టంలో లేదు. విజయవాడ సూరంపూడిలో ప్రారంభమైంది. సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ (నెల్లూరు) విభజన చట్టంలో లేదు. క్రీడా స్టేడియం- దివ్యాంగుల కోసం విశాఖ (తుర్లువాడ) విభజన చట్టంలో లేదు. విశాఖ నూతన దూరదర్శన్ కేంద్రం- విజయవాడ పాస్‌పోర్టు ఆఫీసు- రహదారులు - వౌలిక వసతుల సదుపాయం. లక్ష కోట్ల పెట్టుబడి 4200 కి.మీ జాతీయ రహదారి అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే- 24 వేల కోట్లు- పెట్రోలియం రంగం పెట్టుబడులు 1.40 లక్షల కోట్లు, హెచ్‌పిసిఎల్ గెయిల్- 30 వేల కోట్లు- ఇవి కూడా విభజన చట్టంలో లేవు. కృష్ణా-గోదావరి బేసిన్- ఒఎన్‌జిసి 68 వేల కోట్లు (విభజన చట్టంలో లేదు). విశాఖ-తిరుపతి-విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలు- రాజమండ్రి-కడపల రన్‌వేలు- నూతన భవనాలు రాత్రిపూట విమానాలు దిగే సౌకర్యం- ఉక్కు కర్మాగారాల అభివృద్ధి- వీటిని 2017 ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు అభినందిస్తూ ఓ తీర్మానం ఆమోదించారు. ఇపుడు ప్రజలను రెచ్చగొట్టి బిజెపి జాతీయ నాయకుడు అమిత్‌షా కారుపై రాళ్లు వేయిస్తున్నారు. ఇలాంటి ఊసరవెల్లి నాయకులను ఎలా నమ్మాలి. మే 15న కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తృతీయ ఫ్రంట్ ఒక పగటికల అని తేలిపోయింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు బెంగుళూరు వెళ్లి అక్కడి తెలుగువారిని బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రచారం చేసి వచ్చారు. ఇక కల్వకుంట చంద్రశేఖర్‌రావుగారు దేవెగౌడ గారి జనతాదళ్‌కు ఓటువేయండి అని తెలుగువారిని కోరారు. ఇపుడు ఏమయింది?
అన్ని సర్వేలు హంగ్ అసెంబ్లీ కర్నాటకలో వస్తుందని చెప్పాయి. కాంగ్రెస్‌కు బదులు బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ ఓడిపోయింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర పరిణామాలను ప్రసరిస్తాయి అని అన్ని రాజకీయ పార్టీలవారు అంగీకరించారు. మే 15 (2018) నాడు వెలువడి ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు మార్గదర్శకాలు- భవిష్యవాణి అని కూడా అన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయి దక్షిణాదిలో వున్న కాంగ్రెస్ రాష్ట్రాన్ని బిజెపి కైవసం చేసుకుంది.
1.రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జరిగిన ఎన్నికలు కావటంతో కాంగ్రెసు నాయకత్వానికి ఇది ప్రతిష్ఠాత్మకంగా మారింది. అతడు ఎన్నికల సభలలో కాలుపెట్టిన ప్రతిచోటా కాంగ్రెస్ ఓడిపోయింది.
2.సిద్ధరామయ్య (కర్ణాటక ముఖ్యమంత్రి) అన్నభాగ్య - క్షీరభాగ్య వంటి జనాకర్షక పథకాలు ప్రవేశపెట్టాడు. ఇవి చంద్రన్న కానుక- రైతుబంధు, షాదీముబారక్ వంటి తెలుగు రాష్ట్రాలలోని సబ్సిడీల వంటివి తన పథకాలే తనకు ఓట్లు తెచ్చిపెడతాయని సిద్ధూ నమ్మాడు.
3.్భరతదేశంలో జమ్మూ కాశ్మీరులో మాత్రమే రెండు రాజ్యాంగాలు రెండు జాతీయ జెండాలు ఉన్నాయి. సిద్ధరామయ్య కర్ణాటకలో జాతీయ జెండాతోపాటు కన్నడ జెండాను ప్రవేశపెట్టాడు. ‘కన్నడ ఆత్మగౌరవం’ అంటూ ఆనాటి ఎన్‌టిఆర్ వలె కర్ణాటకలో ప్రాంతీయ భావాన్ని రగిలించాడు. టిప్పు సుల్తాన్ జయంతులు జరిపి మైనారిటీ ఓట్లను తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు. లింగాయత్‌లు రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్నారు. వారిని మైనారిటీ కమ్యూనిటీగా ప్రకటించి కుల మత విద్వేషాలు రెచ్చగొట్టాడు. దాదాపు 30 మంది కాంగ్రెసేతర కార్యకర్తలు హతులైనారు. ఇన్ని జరిగినా సిద్ధరామయ్య ఓడిపోవడం ద్వారా నరేంద్ర మోడీ గారి ‘కాంగ్రెసు ముక్త్భారత్’ నినాదం సాకారమయింది. ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ దొడ్డిదారిలో అధికారంలోకి రావాలని చూడటం తగునా? ముఖ్యంగా ఢిల్లీలో మోడీ నాయకత్వాన్ని బలహీనపరచాలని సూడో సెక్యులరిస్టులు చేసిన ప్రయత్నాలు విఫలమయినాయి. నారా చంద్రబాబు నాయుడు ఇకమీద అటు ఢిల్లీలో ఇటు ఎపిలో చక్రం తిప్పలేడని తేలిపోయింది.
బి.ఎస్.యడ్యూరప్ప 17 మే 2018 ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ముఖ్యమంత్రి కావటం ఇది మూడవసారి. 104 సీట్లతో బిజెపి అతి పెద్ద పార్టీగా అవతరించింది. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయకుండా సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించింది. అర్ధరాత్రి కర్‌‘నాటకం’ డ్రామా నడిచింది. యాకూబ్ మెమన్ ఉరిశిక్షను ఆపాలని అర్థరాత్రి సుప్రీంకోర్టును లోగడ ఏచూరి సీతారాం వంటివారు ఆశ్రయించారు. ఎందుకంటే తెల్లవారేలోపలే ఉరి అమలు జరుగుతుంది కదా! ఐతే కర్ణాటక విషయంలో అలాంటి తొందర ఏమీ లేదని అటార్నీ జనరల్ ప్రకటించారు. ఎస్.ఆర్.బొమ్మై కేసు సందర్భంగా అతి పెద్ద పార్టీకి గవర్నర్ అవకాశం ఇవ్వాలని స్పష్టంగా చెప్పబడింది. ముప్పది సీట్లు కూడా లేని కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. ఇది అనైతికం. ఆరున్నరకోట్ల కన్నడ ప్రజల తీర్పుకు విరుద్ధం.
యడ్యూరప్ప 53000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేయిస్తున్నారు. ఇది ప్రజాకర్షక పథకం. తెలంగాణలో కెసిఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వంటిది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా 14 మంది రాష్ట్ర మంత్రులు ఎన్నికలలో ఓడిపోయారు. అంటే రాహుల్, సోనియా నాయకత్వాన్ని కన్నడ ప్రజలు తిరస్కరించారని అర్థం. ఐనా వారు దొడ్డిదారిలో అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశారు. సంఖ్యాబలం నిరూపింపవలసింది విధాన సౌథయే కాని ఈగిల్ రిసార్ట్ కాదు. ఎంఎల్‌ఏలను బందీలుగా ఉంచటం అప్రజాస్వామికం.
చంద్రులకు శృంగభంగం
కెసిఆర్ బెంగుళూరు వెళ్లి కాంగ్రెస్-బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంటు గూర్చి దేవెగౌడతో జతకట్టారు. గౌడగారూ డూడూ బసవన్న అన్నట్లు తల ఊపారు. కర్ణాటక ఎన్నికలలో విషమ ఫలితాలు రావటంతో గౌడగారు సిద్ధరామయ్య (కాంగ్రెస్)తో చేతులు కలిపారు. ఇది కెసిఆర్‌కు కలవరం కలిగించే అంశం. ప్రత్యేక హోదా పేరుతో ఎపిలో ఉద్యమం నడిపి బిజెపిని అప్రతిష్టపాలు చేసిన నారా బాబుగారికి కర్ణాటక ఫలితాలు శృంగభంగం చేసినట్లయింది. ఇద్దరూ చంద్రులూ ఈ పొలిటికల్ షాక్ నుండి అంత త్వరగా కోలుకోలేకపోవచ్చు. అలాగే కర్ణాటకనుండి తెలంగాణ కాంగ్రెస్‌కు 2019లో ఫండింగ్ ఆగిపోతుంది. ఇది తెలంగాణ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తుంది. అసలే అనారోగ్యంతో - ఆంటోనియోమైనోతో - బాధపడుతున్న ఈ సిద్ధూ పరాజయం ఇంకా కుంగదీస్తుంది.
పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే కేంద్రంతో తగాదా పెట్టుకున్న ఏ రాష్టమ్రూ ఆర్థికంగా బలపడలేదు. ఇది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నాయకులు గమనించటం శ్రేయస్కరం.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్