మెయిన్ ఫీచర్

కట్టడి చేయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఎక్కడ చూసినా హింసోన్మాదం పెరిగిపోతుంది. ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా హింసను ఏదో ఒకరకంగా అనుభవించాల్సి వస్తోంది. హింస అంటే కేవలం శారీరిక హింసనే కాదు. మానసిక హింస, భావోద్వేగాలు కలిగించే మాటలు ఇవన్నీ కూడా హింస కిందకే వస్తాయి. మనిషి సంఘజీవి. తోడు లేకుండా ఏ మనిషి అంటే ఆడైనా మగఅయినా బతకలేరు. మనిషికి తప్పనిసరిగా తోడు కావాలి. కాని, ఈ తోడే తోడేలు రూపమెత్తిపక్కన వారిని హింసకు గురిచేస్తుంది. వయస్సు వచ్చిన మహిళనో, పురుషుడో మరొకరితో వివాహం చేసుకోవడం అతి సహజమైన చర్య. నూరేళ్లు కలసి ఉంటామని బాస చేసుకొని కాపురం మొదలెట్టిన వారు నూరు నెలలైనా తిరగకముందే మనస్పర్థలతో ఇరువురు మానసిక హింసను అనుభవిస్తున్నారు. ఒకవేళ వీరికి ఇంతలోపే పిల్లలుంటే వీరి మధ్య ఆ పిల్లలు నలిగిపోతున్నారు. అటు పెద్దవారికి చెప్పలేక, ఇటు అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయో పూర్తిగా అవగాహన చేసుకోలేక ఒకరి దగ్గర ఉంటే మరొకరి కోపం వీరు భరించాల్సి వస్తోంది.
ఇంతకుముందు కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల లేక పెద్దవారి మాట అంటే గౌరవమో లేక భయమో ఉన్నందువల్ల దంపతుల మధ్య గొడవలు బయటకు పొక్కేవి కావు.
కాని, నేడు అన్నీ న్లూక్లియర్ ఫ్యామిలీస్. ఇద్దరే ఉంటారు. వారికి ఒక్క పిల్లవాడో, పిల్లనో ఉంటుంటారు. వీరిద్దరి సమయంతో పోటీ పడుతూ ఉద్యోగాలు చేస్తుంటారు. కాని, ఇద్దరిలో అవగాహన రాహిత్యం తో ఇద్దరి మధ్య గొడవలు తయారు అవుతున్నాయి. ఇగో ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొప్పలకు పోయి ఆర్థిక ఇబ్బందులకు లోను అవుతున్నారు. కొంతమంది అందరితో పాటు సమానంగా ఉండాలని శక్తి కి మించిన ఆలోచనలు చేసి అప్పులు పాలవుతున్నారు. ఆ అప్పులు నీవల్ల అంటే నీవల్ల జరిగాయి వాటిని తీర్చలేక దంపతుల మధ్య ఆర్థిక పోరాటాలు జరుగుతున్నాయి. ఇవి ఆత్మహత్యల దాకా వెళ్లుతున్నాయి.
మరికొన్ని ఇండ్లల్లో అనుమానం పెనుభూతమై చుట్టుముట్టుతోంది. ఇద్దరూ ఉద్యోగస్తులైనా, లేదా ఏ ఒక్కరో ఉద్యోగస్తులైనా కూడా ఇద్దరి లో మానసిక అసవౌలత్య ఉండడంతో మానసికంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక విశ్వాసంతో ఉండక అనుమాన బీజాలను నాటుకుంటున్నారు. ఈ బీజాలు ఒక్కోసారి హత్యలకు దారితీస్తున్నాయి. ఇష్టంలేని పెళ్లిళ్లు కూడా ఈ అనుమానాలకు పుట్టిల్లు అవుతున్నాయి. అమ్మాయినో అబ్బాయినో వారి అభిప్రాయం తెలుసుకోకుండా నేడు కూడా తల్లిదండ్రుల వారికిష్టమొచ్చిన సంబంధాలు చూసేసి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. కాని నూరేళ్లు కలసి మెలసి కాపురం చేయాల్సినవారు కాళ్ల పారాణి ఆరకుండానే కాటికి చేరుకొంటున్నారు. ఈ మధ్య స్ర్తిలు కూడా ఈ ఉన్మాద చర్యలకు పాల్పడం అనేది కనబడుతూ ఉంది. ఒకవేళ ఈ పరిస్థితులే కొనసాగితే సమాజం అతలాకుతలం అవుతుంది.
అందుకే తప్పనిసరిగా పెళ్లిళ్లు చేసుకునే ఇద్దరికీ కూడా కౌన్సిలింగు చేయాలి. ఈ కౌన్సిలింగును మహిళా న్యాయవాదులు చేపట్టాలి. వివాహం చేసుకునే ఇరువురూ కూడా ఏ ఒత్తిడి లేకుండా వివాహానికి ముందుకు వచ్చారా లేదా అనేది చూసి వీరికి కాపురం చేసేటపుడు తలెత్తే సమస్యలను ఎలా ఎదుర్కొవాలో కూడా కౌన్సిలింగు చేయాలి. ఆవిధంగా చేస్తే కొంతవరకు సమస్యను అదుపు చేయవచ్చు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వారికున్న అనుమానాల కొద్దీ లేక వారి ఆర్థిక వెసలుబాటు ను దృష్టిలో పెట్టుకుని బాల్యవివాహాలు జరిపిస్తున్నారు. నవ నాగరికత పెరిగిన ఈ తరుణంలో కూడా ఇంకా గ్రామాల్లోనే కాక నగరాల్లోనూ బాల్యవివాహాలు జరుగుతూ ఉండడం శోచనీయమే. ఇలాంటి వివాహాలు కడవరకు నిలిచి ఉండక మథ్యలో తెగిపోతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో కూడా హింస తలెత్తుంది. మానసికంగా వధూవరులిద్దరూ కృంగిపోతున్నారు.
మరికొన్ని చోట్ల 18, 19 ఏళ్లు వచ్చీ రాగానే అంటే మేజర్ అయిన వెంటనే వారికి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇటువంటి వారు చిన్న వయస్సులోనే గర్భం ధరించడం, పిల్లలు పుట్టడం తో పెద్దరికం వచ్చేసిందనుకొంటున్నారు. కాని నిజానికి వారి ఆలోచనా తీరులో మార్పు ల్లేక భార్యభర్తలిద్దరిలో మానసికమైన ఇబ్బందులు తలెత్తున్నాయి. వీటిని సరిగా గుర్తించి వాటిని పరిష్కరించుకోలేక హింసకు పాల్పడుతున్నారు. ఒక్కోసారి భార్యభర్తల మధ్య భౌతికమైన దాడులు కూడా జరుగుతున్నాయి.
భార్యభర్తల కొట్లాటల్లో దారిద్య్రంకూడా హింసను పెంచడానికి కారణం అవుతున్నది.సమాజంలో అందరితో పాటుగా ఉండలేక నలుగురు కొనుక్కున్నారని వాటిని తాము కొనుక్కోవాలని ఆత్రుతతో అప్పులు చేసి వాటిని తీర్చలేక దంపతుల మధ్య కీచులాటలు ప్రారభం అవుతున్నాయి. చీట్టిలు కట్టడం, కట్టించుకున్న వారు ముంచడం, లేదా వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనడం, తిరిగి ఆ వాయిదాల మొత్తాన్ని కట్టలేక వారిచేత మాటలు అనిపించుకోవడంతో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకు మళ్లుతున్నారు.
ఇట్లా ఎన్నోవిధాలుగా గృహ హింస జరుగుతోంది. ఇవే కాక భార్యభర్త ల మధ్య అత్తగారింటి వైపువారో అమ్మగారింటివైపువారో జోక్యాలు కోడలు తన మాట వినలేదని, అల్లుడు మన మాట వినలేదని అనే వ్యాఖ్యానాలు చేస్తూ ఉండడం వల్ల కూడా ఇంట్లో మానసిక ఇబ్బందులకు గురౌతుంటారు. ఇలా ఎన్నో రకాలైన గృహహింస ఉన్నప్పటికీ ఈ హింసల్లో ఎక్కువగా స్ర్తిలే మానసికంగా, శారీరికంగా కృంగిపోతున్నారని సర్వేలు తెలుపుతున్నాయి. ప్రతి సంవత్సరమూ 1.3 మిలియన్ మంది మహిళలు దాదాపు 835000 మంది పురుషుల వల్ల గృహహింసకు గురౌవుతున్నారని తెలుస్తున్నది.
వీటి అన్నింటిని మించిన గృహహింస మద్యపానం చేసే వ్యక్తుల వల్ల ఎక్కువ అవుతుంది. పొద్దుటి నుంచి పడిన శ్రమను మరిచిపోవాలనే ఉద్దేశంతో మద్యపానానికి దగ్గరై అదొక వ్యసనంగా తయారు చేసుకొంటారు. ఆ వ్యసనం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్ముకునేవారుంటారు. వీరి తాగి ఇంటికి వచ్చి ఇల్లాలిని, పిల్లలలను హింసిస్తుంటారు. వారు తాగడానికి డబ్బులు లేవని వీరిని బాధించడం సర్వసాధారణంగా మధ్యతరగతి ఇండ్లల్లో జరుగుతుంది.
ఇటువంటి సమస్యలన్నింటిని అధిగమించే శక్తి కేవలం స్ర్తిలోనే ఉంది. అవరోధాలు సమస్యలు ఎన్ని ఉన్నా స్ర్తిలే మగవారిని అదుపు లో పెట్టి ఇంటిలోనివారందరికీ నయానో భయానో వారి హింసచేయాలనే వారి బుద్ధిని నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాలి. హింస నివారణకు భార్యాభర్తలు ఇద్దరూ కృషి చేయాల్సి ఉన్నా కూడా నేర్పుతోను,యుక్తితోను ఇల్లాలే వాటిని అదుపు చేయగలదు అని పెద్దలు చెబుతున్నారు.

- జంగం శ్రీనివాసులు