మెయిన్ ఫీచర్

బాలికల అభ్యున్నతికి పునాదులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడిపి దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ /మగ పిల్లలను తీవ్రంగా ఖండించి, తాగుడు మానిపించి తన జాతి కోసం జీవితాన్నంతా ధారపోసిన మహోన్నత వ్యక్తి దళిత వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ.
భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త. ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేసిన మహానుభావుడు. మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 22-08-1888వ సంవత్సరంలో రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తరువాతకాలంలో భాగ్యరెడ్డిగా మార్చుకున్నారు.
భాగ్యరెడ్డి వర్మ 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదులోని ఈసామియాబజారులో జగన్మిత్ర మండలిని స్థాపించారు. హరిజనులలో విద్యావశ్యకతను గుర్తించి 1916వ సంవత్సరంలో జగన్మిత్ర మండలి ఆధ్వర్యంలో మొదటి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. చాదర్‌ఘాట్ రోడ్డులోని ఆది హిందూ భవన్‌లో ఆయన నెలకొల్పిన బాలికల పాఠశాలను ఆయన వారసులు కొనసాగిస్తున్నారు. రచయితగా, పత్రికా నిర్వాహకునిగా, ఉద్యమకారునిగా, వక్తగా, హక్కుల కార్యకర్త, చిత్రకారుడిగా, ప్రజా నాయకుడిగా, సదస్సుల నిర్వాహకుడిగా పంచాయతీల తీర్పరిగా అనేక పాత్రలను సమర్థంగా పోషించారు.
గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, స్వస్తిదళ్ అణగారినవారికోసం పాఠశాలలు జీవరక్ష జ్ఞాన ప్రచారక్ మండలి, మద్యపాన నిరోధక ప్రచారం, రాజకీయ ప్రాతినిధ్యం- ఇలా భాగ్యరెడ్డి వర్మ చేపట్టిన అనేక కార్యక్రమాలు ఆయన్ని తన కాలంలో అందరికన్నా ముందుంచాయి.
1906లో స్థాపించిన జగన్మిత్ర మండలిని 1911లో మాన్య సంఘం (మనె్న సంఘం) మార్పు చేసి బసివి, దేవదాసీ, జోగినీ, మురళీల పేరిట కొనసాగుతన్న దురాచారాల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాడు.
స్వస్తిదళ్‌ను 1912లో స్థాపించినాడు. ఈ సంస్థ ద్వారా ప్లేగువ్యాధిగ్రస్తులకు సేవలందించినాడు. 1910లో తన మిత్రుడైన వండ్లకొండ నరసింహారావుతో కలిసి హైదరాబాదు కేంద్రంగా ఏప్తక్వామ్ (డిప్రెస్డ్) పాఠశాలలను ఏర్పాటుచేశారు. 130వ జయంతి సందర్భంగా ప్రతి దళిత మహిళ ఈయనకు ఘనమైన నివాళి అర్పించాలి.

చిత్రం.. భాగ్యరెడ్డి వర్మ

-ఉషశ్రీ తాల్క