మెయిన్ ఫీచర్

బరువెక్కని బంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏకాలంలోను ప్రేమలు అన్నీ సఫలం కావు. ప్రేమ అంటే సాధారణంగా యువతీయువకుల మధ్య ఏర్పడేవి ఇక్కడ తీసుకుందాం. సఫలం అంటే ఈ ప్రేమలు పెళ్లికి దారితీసి నూరేళ్ల పంటగాపండవు. ఎన్నో మధ్యలోనే రాలిపోతాయి. మరికొన్ని కసుగాయలుగానే ఉండిపోతాయి. పండు పండే దశలోనే కొన్ని ఆగిపోతాయి.
ఇట్లాంటివెన్నో జీవితంలో జరుగుతుండడం సాధారణమే. స్ర్తిల్లో ఎక్కువ మంది ప్రేమలు భగ్నమైతే ఎంతో వ్యధ చెందుతారు. జీవన యానం కోసం మరో పెళ్లి చేసుకొన్నా పాతప్రేమను మరిచిపోలేక కొత్త వ్యక్తులతో జీవితం పంచుకోలేక నానాఅవస్థలు పడుతుంటారు.
అయితే ఏదైనా బంధం భావి జీవితానికి ప్రతిబంధకంగా తయారైతే దాన్ని కష్టమైనా వదులుకోవాల్సిందే. లేకపోతే జీవితానే్న నిప్పుల కొలిమిలోకి నెట్టివేస్తుంది.
అప్పటిదాకా ప్రేమించి పెళ్లి చేసుకొందామని అనుకొన్నా ఏదో ఒక కారణంతో పెళ్లి చేసుకోలేక పోయిన జంట అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు. జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే కాని, ప్రేమే జీవితం కాదు. కనుక భావి జీవితాన్ని గురించి ఆలోచించాలి. ఏ మనిషి ఒక్కరుగా జీవించడం కుదరదు. వారిపై ఆధారపడి జీవించేవారుంటారు. లేకపోతే వారికోసం జీవించేవారు కూడా ఉంటారు. కనుక వారినందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రేమ ఎప్పుడూ త్యాగానే్న కోరుకుంటుంది. ఒకవేళ ప్రేమించిన వారు అనుకోని పరిస్థితుల్లో మరొక పెళ్లి చేసుకోవలాల్సి వస్తే పాత బంధాన్ని మరిచిపోవాలి. అంతేకాని కొత్తవారికి చెప్పడం, లేక కొత్తజీవితంలోకి పాత వారిని ఆహ్వానించడం లాంటివి చేస్తే వర్తమాన జీవితంలో ఒడిదొడుకులు ఏర్పడుతాయి.
వాటిని తట్టుకొని జీవించడం కన్నా కష్టాలు కొనితెచ్చుకునే పాత బంధాలు దూరం చేసుకోవడమే మేలు. జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. అనుకొన్నది కాక అనుకోనిది జరిగేది జీవితం. అట్లాంటివాటిల్లో ప్రేమలు ఒకటి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం అని ప్రేమికులు చెప్పినా వారి కన్నా ఎన్నో ఏళ్లముందునుంచే తల్లిదండ్రులు వీరిని కని, పెంచి, పోషించి వీరిని ఫలానా హోదాలో చూడాలనో లేక ఇలా ఉండాలనోవారు కలలు కంటారు. అట్లాంటి వారికి నచ్చచెప్పి ప్రేమికులు వారిని ఒప్పించి గలగితే అసలు కష్టమే ఉండదు. కాని ఒకవేళ పెద్దవాళ్లను ఒప్పించలేక లేక పరిస్థితులు తారుమారైన వేళ మరొక పెళ్లి కి తలవంచాల్సి వస్తే ముందుగానే ఎంతో ఆలోచించాలి. పాత బంధాన్ని పూర్తిగా వదులుకోగలమా లేదా నిర్ణయించుకోవాలి. పాత వారి వల్ల తనకు తనవారికి ఎటువంటి నష్టం జరగకుండా ముందే అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పుకోగలగాలి. ఎవరు ఎవర్నీ మోసం చేయకపోతే ఏ ఒక్కరూ బాధ పడాల్సిన అవసరం ఉండదు.
ఎపుడూ కూడా భావోద్వేగాలు ప్రవాహంలాగా ఉండకూడదు. అందులో పడి కొట్టుకుని పోగూడదు. ప్రేమను స్నేహంగా మలుచుకోవచ్చు. పరిధులు దాటకుండా బంధాన్ని కొనసాగిస్తూన్నపుడు ఆ ప్రేమ పెళ్లికి దారితీయకపోతే అతిగా బాధపడకుండా ప్రేమనే స్నేహంగా మలుచుకోవాలి. స్నేహంతోజీవితాన్ని చక్కని గుబాళించే ఉద్యానవనం చేసుకోవచ్చు.
యువతీయువకుల మధ్య సాగే బంధం అపురూపమైనదే కావచ్చు. ఎంతో ముచ్చటగా ఉండచ్చు. అనురాగమైందే కావచ్చు. కాని జీవితం కనుక అనుకోని పరిస్థితుల్లో ఆ బంధాన్ని కొనసాగనిచ్చే వీలు కలుగకపోవచ్చు. కాని ఆ బంధాన్ని అక్కడితే ఆపేయాల్సిందే. అర్థారాంతరంగా ఆపేయాల్సిన పరిస్థితులు వస్తే ఇద్దరూ నిజాలు మాత్రమే మాట్లాడుకుని పరిసిథతి పైన పూర్తి ఆకళింపు చేసుకొని అవగాహనకు వచ్చి స్నేహ పూర్వకంగా విడిపోవచ్చు. అంతకుముంథున్న బంధాన్ని అక్కడితో వదిలివేయవచ్చు.
అంతేకాని దానే్న పట్టుకు వేలాడి వాళ్లు బాధపడి, ఇతరులకు ఇక్కట్ల పాలు చేయకూడదు. అపుడు ఆ బంధాలు బరువెక్కకుండా అందరికీ మంచిని చేస్తాయ.
బంధం తలుచుకుని బాధపడాల్సిన సిథతులు రాకుండా కన్నీళ్లు చిప్పిల్లకుండానే చిరునవ్వునే పూయస్తాయ. అన్నీ అనుకొన్నట్లుగానే జరిగి అన్నీ మరిచిపోయి తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించిన తరువాత కొత్తగా జీవితంలోకి వచ్చిన వారి వల్ల కష్టాలు ఏర్పడవచ్చు. కాని అయ్యో నేను అనవసరంగా ఈ థారిలో వచ్చానే. ఇంతకు ముందులాగా ఉంటేనే బాగుండేది అనే ఆలోచన్ను మనసులోకి రానీవ్వకూడదు. ఒకవేళ అట్లా రానిచ్చేట్టు అయితే ఇప్పుడున్న బంధానికి బీటలు ఏర్పడుతాయి. అవి చిలికి చిలికి గాలివాన ఆరంభమై బీటలు కాస్త గోడలు కూలి పోయేదాకా పరిస్థితులను తీసుకొని వస్తాయి. కనుక ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకొన్న తర్వాత దాన్ని కొనసాగడానికి చూడాలి కాని తూచ్ తూచ్ ఇపుడు నా నిర్ణయం మార్చుకుంటున్నాను అనుకోకూడదు. నిర్ణయం అనేది ఒక్కసారి తీసుకొనేది కాని ప్రతి నిముషానికి మార్చేఅంశాన్ని నిర్ణయం అని అనేరు. కనుక బాగా ఆలోచించి కష్టాలను, సుఖాలను బేరీజు వేసుకొని నిర్ణయం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మసలుకోవాలి. అపుడే నిర్ణయం ఎంతో బాగుంటుంది. అందరూ హర్షిస్తారు కూడా. తన వల్ల ఇతరులు ఇబ్బంది పదకూడదు అనే ఆలోచన కననుక ఉంటే చాలు ఎపుడూ ఆనందానే్న పంచుతారు..

-చోడిశెట్టి శ్రీనివాసులు