మెయిన్ ఫీచర్

దేవాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవాలయం గురించి ప్రతివారికి తెలుసు. దేవాలయంలో ఉండేవాడు దేవుడు. దేవాలయాన్ని దేహంతో పోల్చారు ప్రాచీన ఋషులు. దేహమే దేవాలయం అన్నారు. ఆ మాటే శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ‘ఇదం శరీరం కౌనే్తయ క్షేత్ర మిత్యభిధీయతే’. ఈ శరీరం క్షేత్రమని చెప్పబడుతున్నది అని అంటూనే ‘‘క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత’’ సర్వశరీరములలో ఒక్కడనే అయిన నేను క్షేత్రజ్ఞుడను అని అన్నాడు.
మానవ హృదయాన్ని దేవాలయంగా, సత్యాలయంగా, ధర్మాలయంగా రూపొందించడానికి దేవాలయం పరమసాధనం. ఆలయాలు ఆధ్యాత్మిక శాస్త్భ్య్రాస కేంద్రాలు. సత్య విజ్ఞాన సాధనాలయాలు. జీవిత రహస్య పరిశోధనాశాలలు. మానసిక రోగ వైద్యశాలలు. మానవాత్మను జాగృతంచేసే మాతృ నిలయాలు. సహస్రాబ్దాలనాడు భారతీయ ఆధ్యాత్మికతను అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోడానికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో ఈ దేవాలయాలకు వచ్చేవారు. ఇపుడు కూడా మానసికాందోళన పడేవారు ఈ దేవాలయాలకు వెళ్లితే ప్రశాంత చిత్తులు అవుతారు. ఈ ఆలయాలే మనుషులకు విశ్వవిద్యాలయాలుఅంటుంది చరిత్ర.
భారతీయ సంస్కృతిని పరిఢవిల్ల చేసినవి దేవాలయాలే. అంతేకాదు అనేక మంది మహానుభావులు ఉదాహరణకు శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీ కంచర్లగోపన్న(రామదాసు), కులశేఖర ఆళ్వార్లు ఇలా ఏ దివ్యపురుషుడి జీవిత చరిత్ర చదివినా వారి నడయాడిన వారు సంచరించిన వారు దర్శించిన దేవాలయాలు మనకు కళ్లముందు కదలాడుతాయ. ఈ దేవాలయాలనుంచే వేదాలు వెలుగులు ప్రసరించాయి. వేద వాఙ్మయం వెల్లివిరిసింది. అతి గహనములైన జీవిత సత్యాలను ప్రపంచానికందించిన ప్రాంగణాలే ఈ దేవాలయాలు.
సాధారణ మనిషికి దైవం పై నమ్మకాన్ని పెంచడానికి ఈ దేవాలయాలే పరమోన్నత స్థానాలు. దైవాన్ని సగుణ రూపంలో కాని, నిర్గుణ రూపంలో కాని చూడవచ్చునని ఉపనిషత్తులు వక్కాణిస్తున్నాయి. సగుణ రూపంలో దేవాలయాలలో దర్శనమిస్తున్నాడు. రూప సాధనాలంబనాలు మనస్సు పరమాత్మను అవగాహన చేసుకోడానికిదేవాలయాలు మంచి మార్గాలు. . ‘‘మనస్సుతో కూడిన విధానమంతా విగ్రహారాధనమే. మనోలయానంతరమే ప్రతీకాలంబనం పోతుంది’’ అంటారు త్రైలింగస్వామివారు. అంటే పరమాత్మను చేరుకోవడమే! విశ్వమంతా నిండి ఉండిన పరమాత్మను విగ్రహ రూపంలో దర్శిస్తున్నాడు మానవుడు. ఆలయం పండిత పామర ప్రయోజనకరం. మేధను మెరుగుపరచుకునే దొకరైతే, హృదయాలను సంస్మరించుకునేదొకరు. ఆ విధంగా గుడికీ, గుండెకు సంబంధం ఉంది. మనస్సునూ, హృదయాన్నీ సమన్వయ పరిచి ఆత్మవికాసం పొందడమే ఆలయ సేవలోని ఆంతర్యం. ‘‘దేహం-దేవాలయం’’, ‘‘జీవుడు-దేవుడు’’ అను ఉపనిషద్వచనాలకు గల అర్థాన్ని తెలుసుకుని అలా వర్తించడమే జీవిత పరమార్థం.అధో దృష్టిని నిర్మూలించి ఊర్ధ్వదృష్టిని ప్రసాదించడమే గోపుర నిర్మాణంలోని సందేశం. ఈ నిర్మాణంలో శ్రామిక పోషణ ఉన్నది. కళాపోషణ ఉన్నది. అన్నిటికీ మించి మానవుణ్ణి మాధవుని చెంతకు చేర్పించగల ధార్మికసేవ మిళితమై ఉన్నది.
అందుకే ప్రతివారు దేవాలయాన్ని దర్శించాలి. అందులోని రహస్యార్థాలను తెలుసుకోవాలి. *