మెయన్ ఫీచర్

యూపీలో మారుతున్న సమీకరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరప్రదేశ్ యదార్థ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే, పత్రికల వార్తలను అనుసరించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కేవలం అక్కడికి వెళ్లి పరిశీలిస్తే తప్ప మనకు అసలు విషయం బోధపడదు. నెహ్రూ హయాం లో అక్కడ ధర్మరాజ్యం. కమలాపతి త్రిపా ఠి, సుచేతా కృపలాని వంటి ఉద్దండులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర ప్రాంతాన్ని దేవ భూమిగా పరిగణిస్తారు. అదే నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంగా రూపొందింది. అదే మాయావతి పాలనా కాలం వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపించాలని నెహ్రూ కలలు కన్నారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ పాలనా కాలంలో ఉత్తర ప్రదేశ్‌లో జనసంఘ్ బాగా బలపడింది. లాల్‌బహదూర్ ఎంతటి పవిత్రమైన వాడం టే, తన కుమారుడికి కూడా ఏవిధమైన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుకోలేదు. ఆయనకు బ్యాంక్ బ్యాలన్స్ లేదు. వారణాసిలో పూర్వీకులనుంచి సంక్రమించిన పెంకుటిల్లు తప్ప. ఎక్కడో డ్రైవర్ తప్పిదం వల్ల రైలు ప్రమాదం జరిగితే తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేసిన సచ్ఛీలుడు.
మాయావతి పరిపాలనాకాలం వచ్చేసరికి అక్కడ ప్రైవేటు సైన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. లక్నోకు రెండుగంటల ప్రయాణదూరంలో ఉన్న నైమిశారణ్యం తదితర ప్రాంతాల్లో నివసించేవారికి ఎప్పు డు బందిపోట్లు వస్తారో తెలియదు. అనుక్షణం బిక్కుబిక్కు మంటూ గడపాల్సిందే. మాయావతి, ములాయంసింగ్ యాదవ్‌ల వద్ద ప్రైవేటు సైన్యాలుంటాయి. ఇదేమని అడిగే దిక్కుండదు. అలహాబాద్ వెళితే అక్కడ పాండాల వద్ద దర్భలు ఉండాల్సినదానికి తుపాకులు కనిపిస్తాయి. ఎందుకంటే, మాయావతి, ములాయం గ్యాంగులనుంచి స్వీయరక్షణకోసమని అక్కడివారి నుంచి సమాధానం వస్తుంది. ఇవన్నీ కఠోర వాస్తవాలు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిత్యం వచ్చే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక పుష్కరాలకు సరేసరి. వీరి సంఖ్య కోట్లను దాటుతుంది. పుష్కరాలను అక్కడ కుంభమేళా అని పిలుస్తారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు అధికం.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అట్టడుగు వర్గాల ప్రతినిధిగా నిలబడింది. చిత్రకూట్ వంటి ప్రాచీన భారతీయ నామాలను మా ర్చాలని ప్రయత్నించింది. ప్రభుత్వ ఖర్చు తో ఉత్తరప్రదేశ్‌ను ఏనుగు బొమ్మలతో నింపేసింది. మాయావతి అధికారంలోకి వచ్చాక క్రైస్తవీకరణం మొదలైంది. విదేశాలనుంచి భారీ సంఖ్యలో నిధులు అందాయి. ములాయంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయ లబ్దికోసం ఆయన పాకిస్తాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకున్నాడు. ముస్లిం రిజర్వేషన్ల కోటాను పెంచాడు. కైరానా వంటి చోట్ల దాదాపు నాలుగు వందల హిందూ కుటుంబాలు కాందిశీకులై పారిపోతే వారు ఉద్యోగానే్వషణలో వెళ్లారే కాని మత ఘర్షణ వల్ల కాదంటూ స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాదులను బహిరంగంగా బలపరచాడు.
అన్సారీ అనే ఉగ్రవాది ‘క్వామీ ఏకతా’ పార్టీ పెట్టాడు. అతనికి ఒకటో రెండో అసెంబ్లీ సీట్లున్నాయి. అన్సారీకి భారీగా డబ్బు ఇచ్చి మొత్తం పార్టీని ములాయం కొనుక్కున్నాడు. ఫలితంగా 2016, జూన్ 16న ఈ పార్టీ సమాజ్‌వాది పార్టీలో విలీనమైంది. రాజకీయాల్లో ఎవరు ఎవరినైనా కొనవచ్చు. వ్యక్తులను కొనడం ఒక పద్ధతి, ఐతే ఏకంగా పార్టీనే కొనేయడం తాజా పద్ధతి. ముక్తార్ అన్సారీ హత్యానేరంపై జైల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి చెందిన క్వామ్ ఏకతా పార్టీని సమాజ్‌వాదీ పార్టీలో విలీనం చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కార్యకర్తలు అఖిలేశ్ యాదవ్‌కు తెలిపారు. ‘‘మనం ఇప్పుడు చేర్చుకున్నది అన్సారీ పార్టీని కాని అన్సారీని కాదు. అదీకాకుండా అతని తమ్ముడిపై క్రిమినల్ కేసులేమీ లేవు కదా’ అన్నది అఖిలేశ్ సమాధానం. పైకి ఏం చెప్పినా ఆంతరంగికంగా ఆయనకు ఈ విలీనం ఎంతమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇదిలావుండగా స్వామి ప్రసాద్ వౌర్య అనే సీనియర్ నాయకుడు బహుజన సామాజ్‌వాది పార్టీ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పించాడు. ‘అవినీతికి బిఎస్‌పి పర్యాయపదంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి సీట్లు అమ్ముకుంటుంది’ అని ఆరోపించాడు. వౌర్య ఇప్పుడు ఏ పార్టీలో చేరతాడో చూడాలి. యుపిలో వౌర్య నిష్క్రమణతో బిఎస్‌పిని కొనే యొజన మొదలైంది. సమాజ్‌వాది అంటే సోషలిస్టు అని అర్థం. కానీ ములాయం విలాస జీవితం అనువంశిక రాజకీయాలు సోషలిజానికి విరుద్ధం. అమర్‌సింగ్-జయప్రదలను పార్టీ నుంచి తరిమేశాడు. మళ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అమర్‌సింగ్‌కు ఆహ్వానం పంపాడు.
విచిత్రమేమంటే యుపి రాజకీయాల్లో ములాయంకు, మాయావతి మధ్య ఉప్పు నిప్పు చందంగా ఉంటుంది. మాయావతి మీద తాజ్ కారిడార్ కేసు కుంభకోణం ఆరోపణలు వచ్చాయి. తనకు రాజకీయంగా మద్దతిస్తే కేసులు నీరుకారుస్తానని సోనియా హామీ ఇచ్చింది. ఒకదశలో మాయావతి, భాజపాలు చెట్టాపట్టాలేసుకున్నాయి. కారణం సోనియా, ములాయంలను నిరోధించడానికి. ఇంతవరకు బాగానే ఉందికాని, ఆమె హిందూత్వ సిద్ధాంతానికే తూట్లు పొడిచేసరికి, భాజపా మాయావతికి తన మద్దతు ఉపసంహరించుకుంది. కొద్దిరోజుల క్రితం ఉత్తరాంచల్‌లో జరిగిన రాజకీయ సంక్షోభంలో కూడా బిఎస్‌పి, భాజపాకు మద్దతివ్వకపోవడం గమనార్హం.
ఇక కమ్యూనిస్టులకు అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆశాకిరణంగా కనిపించాడు. ఆయనను శిఖండిలా వాడుకొని, భాజపాను నిలువరించాలని వామపక్షాలవారు వ్యూహరచన చేశారు. వారణాసిలో నరేంద్ర మోదీ ఎన్నికల్లో నిలబడితే, ఆయనమీద కేజ్రీవాల్ పోటీకి నిలబడి ఓడిపోయాడు. అయితే ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించి కక్ష తీర్చుకున్నాడు. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కుంభకోణంపై కేజ్రీవాల్, శీలాదీక్షిత్‌లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. అంటే 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేజ్రీవాల్, శీలాదీక్షిత్‌లు పాటియాలా కోర్టు బోనులో నిలబడవచ్చు. సోనియాగాంధీ తన పూర్వ వైభవాన్ని పొందడానికి విశ్వప్రయత్నం చేస్తున్నది. అందుకని బిఎస్‌పితో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానిక ఉవ్విళ్లూరుతోంది. గులాం నబీ ఆజాద్‌ను ఎన్నికల గోదాలోకి దించారు. అంటే ములాయం నుంచి ముస్లిం ఓట్లను చీల్చడానికి ఇదొక వ్యూహం. అదేవిధంగా హైదరాబద్‌కు చెందిన మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల బరిలోకి దిగుతున్నాడు. దీనివల్ల ఓట్ల సమీకరణలు మారిపోతాయి.
తాను అగ్రకులాల పార్టీ కాదని చెప్పుకోవడానికి భాజపా ఎన్నో ప్రయత్నాలు చేసింది. లోగడ కూర్మీ అనే వెనుకబడిన తరగతికి చెందిన కళ్యాణ్ సింగ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. అయినా సోనియాగాంధీ అర్థాంతరంగా అతడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయించింది. పివి నరసింహారావును దారుణంగా అవమానించింది. దీనివల్ల బ్రాహ్మణ ఓట్లు చీలిపొయ్యాయి. ఐనా మనీష్ తివారి, సుప్రియా చతుర్వేది, సంజయ్ బారువా వంటి బ్రాహ్మణ కుటుంబాలు ఇప్పటికీ కాంగ్రెస్‌నే అంటిపెట్టుకొని తిరుగుతున్నాయి.
స్వాతంత్య్రానంతరం యుపిలో దరిద్రమూ, మూఢ విశ్వాసాలు తగ్గలేదు. స్వామి దయానంద సరస్వతి ప్రభావం కొన్ని భాగాల్లో ఉన్నది కాని, సనాతన ధర్మ సంస్థలు ఆర్య సామాజికాలు పరస్పరం కలహించుకుంటున్నాయి. విచిత్రమేమంటే ఈ రెండు సంస్థలకూ వేదమే పరమ ప్రామాణికం. యుపిలో పోలరైజేషన్ పూరి తగా జరిగింది. ముస్లిం ఓట్లను చీల్చడానికి భాజపా తన సరస్వతీ శిశుమందిర విద్యాసంస్థల్లో పెద్ద ఎత్తున ముస్లిం విద్యార్థులను చేర్చుకుంటున్నది. ఇండియాలోని ముస్లింలంతా భారతీయులే అన్న ఎన్నికల నినాదాన్ని భాజపా ఇచ్చింది. దీన్ని ములాయం సిగ్ యాదవ్ ఒప్పుకోవడం లేదు. ‘‘హిందువులు మస్లింలు ఒకటి కాదు. ఈ రెండు మతస్థుల ఆర్థిక పరిస్థితులు ఒకటి కాదు’ అనేది ములాయం రాజకీయ ప్రతిపాదన. ఆర్య సామాజీకులు ఇటీవల శుద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టారు. దీన్ని ములాయం సింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. కారణం తన ఓటు బ్యాంకును కాపాడుకోవాలనే యత్నం. ఇప్పుడు మాయావతి ‘దళితులు హిందువులు కాదు’ అని ప్రచారం చేయడం కూడా రాజకీయ లబ్దికోసమే.
అఖిలేశ్ యాదవ్‌కు, రాహుల్ గాంధీకి మధ్య ఒక రహస్య చర్చ జరిగింది. ‘కేంద్రంలో నాకు మద్దతివ్వండి. రాష్ట్రంలో సమాజ్‌వాదీ పార్టీకి మేం మద్దతిస్తాం’ అని రాహుల్ ప్రతిపాదించాడు. దీన్ని అఖిలేష్ తిరస్కరించాడు. ‘‘మా నాన్నను ప్రధానమంత్రి కుర్చీలో చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అందుకని ఆయన ప్రధాని అవుతాడు. కాంగ్రెస్ బలం పెంచుకొని యుపిలో ముఖ్యమంత్రి కావచ్చు’ అన్నాడు అఖిలేశ్. ఇదెలాసాధ్యం తృతీయఫ్రంట్ అని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. వారి మద్దతుతోములాయంసింగ్ ప్రధానమంత్రి కావాలని కోరిక. ఎందుకంటే ఇతను అర్థనారీశ్వరుడు. సగం యాదవుడు, సగం ముస్లిం పక్షపాతి. మరి ఈ అడ్డంకి లేకపోతే తృతీయ ఫ్రంట్ ప్రముఖులు నితీశ్‌కుమార్, జయలలిత, మమతాబెనర్జీ వంటి వారు ఎవరికివారే 2019లో భారత ప్రధానిగా తమ ముఖం అద్దంలో చూసుకోవాలని అనుకుంటున్నారు. ఈ సంభాషణకు కాంగ్రెస్ పురిట్లోనే సంధి కొట్టింది. ప్రియాంక గాంధీని యుపి ముఖ్యమంత్రిగా రంగంలోకి దింపి తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నది. ఇది అహ్మద్ పటేల్ యోచన కావచ్చు. ఇదిలావుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రియాంక భర్త, రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. సందర్భమేమిటంటే, వ్యవసాయ భూములను కారు చౌకగా వాద్రాకు కట్టబెట్టారని. ఆ పని చేసింది నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. అదేవిధంగా బికనీర్ (రాజస్థాన్)లోని 275 ఎకరాల భూమి కొనుగోళ్లలో మనీ లాండరింగ్ జరిగిందనే నేరారోపణ. ‘స్కైలైన్ హాస్పిటాలిటీ’ కాంప్లెక్స్‌లు ఇందులో వెలిసాయి. ఈ బినామీ వ్యవహారంపై గత ఏడాదికి పైగా పరిశోధన నడుస్తున్నా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సక్రియాత్మకంగా వ్యవహరించింది. ఇది ప్రియాంక అరంగేట్రాన్ని అడ్డుకునేందుకు బిజెపి అనుసరిస్తున్న వ్యూహమంటూ, కాంగ్రెస్ ప్రవక్త సంజయ్ ఝా మండిపడ్డారు. హాస్పిటాలిటీ కుంభకోణం బయటకు వస్తే, సోనియా, నరేంద్ర మోదీని శాపనార్థాలు పెట్టడం తగునా?

- ముదిగొండ శివ ప్రసాద్