మెయిన్ ఫీచర్

గోరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సాంప్రదాయంలో ఉదయాన్ని నిద్రలేవగానే మున్ముందుగా భూమాతకు వందన మాచరించి, కన్నతల్లి పాదాలకు నమస్కరించి, గోశాలలో ఉన్న గోమాత పృష్ఠ భాగాన్ని కనులకద్దుకుని భక్తిని ప్రకటించడం విధిగా పేర్కొనడం జరిగింది. పలు పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవా కాలంలో గోమాతను స్వామివారి సన్నిధిలోనుంచిన తరువాతనే తలుపులు తీస్తారు. అంటే భగవంతునికే భగవత్స్వరూపం గోమాత.
పూర్వకాలంలో గోవు లేని ఇల్లు ఉండేది కాదు. గోవు ఇచ్చిన పాడిపంటలతో పసిపాపల మొదలుకొని వృద్ధుల వరకు నిండు ఆరోగ్యంతో మసిలేవారు. ఏనాడు సిరి లేదు వాపోయేవారు కారు. వశిష్ఠుడు తన దగ్గర ఉన్న కామధేనువు వల్లే విశ్వామిత్రుని వంటి మహారాజును కూడా ఓడించగలిగాడు. కేవలం సిరిసంపదలకే కాదు గోవు ఇచ్చే సంపదలకు అపార ధైర్యసాహసాలను ప్రదర్శించడానికి కూడా పనికి వస్తాయ.
‘‘్ధను సదనం రజీణాం’’- సర్వసంపదలకు మూలము గోవు అన్నది అధర్వణ వేదం.
‘‘మహాస్తపేవ గోర్మహిమా’’- గోవును గురించి ఎంత చెప్పినా అది తక్కువే అంటుంది శతపథ బ్రాహ్మణం.
‘‘తృణోదకాది సంయుక్తం యః ప్రపద్యాత్ గవాహ్నికమ్
సోగ్మేధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయః’’
పరాశర స్మృతి వచనం. అంటే రోజూ కాస్త గడ్డి తినిపించి, నీరు త్రాగిస్తే అలా సంరక్షించే వానికి అశ్వమేధయాగం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. రాజులున్న కాలంలో గోసంపద ననుసరించే వారి భోగభాగ్యాలు వర్థిల్లేవి.
గోమాతపై గౌరవం పూజ్యభావం భారతీయుల రక్తంలో అణువణువునా ప్రవహిస్తూ ఉంటుంది. కన్నతల్లికిచ్చే గౌరవానే్న గోమాతకు కూడా ఇస్తారు. కనుక కన్నతల్లిని ఏవిధంగా రక్షించుకుంటామో గోమాతను కూడా రక్షించుకోవలసిన అవసరం నేడు కనిపిస్తోంది.
‘‘లోక కళ్యాణం కోసం భగవంతుడు మానవులకిచ్చిన వరప్రసాదం గోవు. గోవు పట్ల మానవులు చూపే ప్రేమను గ్రహించి అంతకు పలు రెట్లు అధికంగా మనకు ఫలాలను ఇస్తుంది గోమాత’’ అంటారు ఆచార్య వినోబాభావే.’’
మన ప్రాచీన ఋషులు గోమాతను గురించి ఆధ్యాత్మిక పరంగా, విజ్ఞాన శాస్తప్రరంగా చెప్పిన విషయాలు పాశ్చాత్య పండితులు, విజ్ఞాన శాస్తవ్రేత్తలు పరిశీలించి, పరిశోధించి భారతీయ ఋషుల ప్రజ్ఞను కొనియాడేరు.
గోవును దేవుని స్వరూపంగా భావించిన భారతీయులు నేడు గోవులను అభివృద్ధి పరుచుకోవడం లేదు. కనీసం వాటిని రక్షించు కోవడం లోను వెనుకబడి ఉన్నారు. పాశ్చాత్యు లు గోసంపదపై కన్ను వేశారు. ఆ సంపదను కొల్లగొట్టడంలో ఎన్నో ఉపాయాలను పన్ను తున్నారు. అటువంటి వారి నుంచి మన గోవులను మనం రక్షించుకుని తీరాలి. గోమాంస విక్రయం, భక్షణలతో సంపదను పెంచుకోవచ్చునని చెప్పడం హాస్యాస్పదం. గోవులను రక్షించుకోవడంలోనే సంపదవృద్ధి చెందుతుందని చరిత్ర చెబుతుంది. చరిత్ర పుటలను తిరగవేస్తే గోసంరక్షణ ఎంత అవసరమో తెలుస్తుంది. కనుక ఎవరికి వారు ప్రతిన బూని గోరక్షణ చేయాలి.
ఎందరో మహానుభావుల గోసంరక్షణ గురించి వారి వారి అభిప్రాయాలను వెలి బుచ్చారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థలే కాక ప్రతి మనిషి కూడా గోసంరక్షణ చేయ డానికి అప్రమత్తుడై ఉండాలి. గోసంరక్షణను సగర్వంగా భావించి అవశ్యం చర్యలు చేపడితే, గోసంతతి అభివృద్ధి ప్రకాశవంతమవడమేకాక పాలకులు- పాలితులు ఒక మహాశక్తిగా రూపొందుతారు.