మెయిన్ ఫీచర్

గోడల అందాన్ని పెంచే గడియారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయ్యారాలఇంటిని అలంకరించాలంటే ఎంత పెద్ద ఇల్లైనా ఎంత చిన్న ఇల్లైనా ఇంట్లో అలంకరణ వస్తువులు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ వస్తువుల తక్కువ ఖర్చుతో ఇంటి అలంకరణకు వినియోగించే వివిధ వస్తువులను తెచ్చుకొని అలంకరించుకోవచ్చు. అందులో మార్బల్ తో చేసిన కళాఖండాలు, పూలతొట్టెలు, పెన్ బాక్సులు, జంతువులు అలంకరణ వస్తువులు స్టాండ్లు మనకు నచ్చిన రీతిలో అలంకరించుకోవచ్చు. వీటిల్లో ముఖ్యంగా ఇప్పుడెన్నో రకాల మోడల్లో దొరికేవి గోడ గడియారాలు. ఎన్నో వయ్యారాలు ఒలకబోస్తూ ఠీవిగా గోడకి అతుక్కుని మెరుపులంస్తున్నాయి. గోడ గడియారం అనేది ఓ అద్భుతమైన ప్రకృతి చిత్రంగానో సుందర అలంకారం గానో మారిపోయింది. ఎందుకంటే గోడల్నే కాదు, గోడకు అమర్చే గడియారాల్నీ వినూత్నంగా అలంకరించడమే గృహాలంకరణలో సరికొత్త ట్రెండ్.
చేతికి వాచ్ లేకపోతే ఎంత వెలితిగా ఉంటుందో గోడలకు వాల్‌క్లాక్ లేకపోతే అంతే బోసిగా ఉంటుంది. వాల్‌క్లాక్ కేవలం సమయానే్న కాక ఇంటీరియర్ డిజైనింగ్‌లో భాగమైతే మరింత నాణ్యంగా అనిపిస్తుంది. ఇందుకోసమే వాల్‌క్లాక్ సెలక్షన్ చేయడంలో చిట్కాలు తప్పనిసరి అంటారు ఇంటీరీయర్ డిజైనర్స్.
వాకిలికి ఎదురుగా లేదా లివింగ్ రూమ్‌లో పెద్ద రస్టిక్ క్లాక్ ను ఏర్పాటు చేయాలి. ఆకారంలో పెద్దదిగా ఉండి అంకెలు కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఫ్లోటింగ్ నంబర్స్ మోనోక్రొమాటిక్ కలర్ స్కీమ్ కలిగి ఉండే ఫర్నిచర్ ను డామినేట్ చేసేలా ఉండకుండా చూసుకోవాలి. గదిలోని మిగతా వస్తువులతో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఇతర ఆర్ట్‌పీస్‌లు ఫోటోగ్రాఫ్స్ ఏవీ లేకుండా ఖాళీగా ఉండే గోడ మీద ఓవర్‌సైజ్ రైట్రో క్లాక్ ను అమరిస్తే లివింగ్ రూమ్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
గోడమీద ఓ అందమైన చిత్రాన్ని చేత్తో గీసినట్లో లేదా స్టిక్కర్లు అంటించినట్లో ఉండే గడియారాలు మరో రకం. చెక్క ప్లాస్టిక్ ఇలాంటి వాటిల్లో కేవలం వాటి మధ్యలోని ముళ్లు మాత్రమే లోహంతో చేసినవి ఉంటున్నాయి. గడియారానికి చుట్టూ దానికి సంబంధించిన పెయింటింగ్ స్టిక్కర్లు ఉంటాయి. దూరం నుంచి చూస్తే అది మొత్తంగా గీసిన బొమ్మేమో అనిపిస్తుంది. వీటిల్లోనూ పిల్లల పడక గదులూ పెద్దవాళ్ల పడక గదులూ వంటగదీ, హాలూ ఇలా అలంకరించే గదిని బట్టి ఆయా బొమ్మలూ చిత్రాలూ కూడా మారిపోతుంటాయి. చిన్నారుల అభిరుచి తగ్గట్టుగా పిల్లల గదుల్లో అయితే స్పైడర్‌మ్యాన్ జంతువుల బొమ్మలూ , ఉన్న వాల్‌క్లాక్ లను చిత్రించడం, అంటించడం చేస్తున్నారు. వీటిల్లో కొన్ని నేరుగా తగిలించే బొమ్మల్లాంటివీ నియాన్ రంగుల్లో చూడగానే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
పెద్ద గడియారం దాని అడుగు నుంచి వేలాడుతూ రెండు వైపులకూ ఊగుతూ ఉండే పెండ్యులమ్ ఇలాంటి పాతకాలం నాటి గడియారాలే లేటెస్టే ఫ్యాషన్ గా మారాయి. నిశ్శబ్దంగా పనిచేస్తూ పోయే గోడ గడియారాల కంటె కదలికలతో చూపరులను ఆకర్షించే పెండ్యులమ్ వాల్‌క్లాక్ లివింగ్ రూమ్ కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చి పెడతాయి. అలాగే టిక్ టిక్ శబ్దం ఈ క్లాక్ లకు మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణం.
నాన్ స్టిక్ పాన్‌లూ, పండ్లూ, కూరగాయలూ, స్పూన్లు ఫోర్కుల రూపాల్లో తయారు చేసినవయితే వంటింటి సామాన్లల్లో అందంగా ఇమిడిపోతూ వంటింటికో కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి. ఇప్పుడు గోడ గడియారం కేవలం సమయాన్ని చూపించే ఓ వస్తువు మాత్రమే కాదు ఇంటి అందాన్ని పెంచే సరికొత్త అలంకారం.

--తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి