మెయిన్ ఫీచర్

స్నేహితులుగానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు ఎదుగుతున్నప్పుడు కొత్త స్నేహితులు ఏర్పడుతుంటారు. నేటి ఆధునిక టెక్నాలజీని వారు త్వరగా అర్థం చేసుకొంటూ ముందుకువెళ్తుంటారు. అట్లాంటపుడు వారి చేతుల్లో ఎప్పుడూ ఫోను ఉంటుంది. వాట్స్‌అప్‌లోనో , ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలాంటివాటిల్లో వారు తలమునకలైనట్టే ఉంటారు.
కాని పెద్దవారు వారితో చాలా స్నేహంగా ఉండాలి. స్నేహితులతో మసలినట్టు ఉండాలి. కాని వారిపైన ఆజామాయిషీ చేస్తున్నట్టు లేక వారిని గదమాయిస్తున్నట్టు, అనుమానిస్తున్నట్టు ఉండకూడదు. వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి.
పిల్లలు పెద్దలు.. వీరిద్దరిలో ఎప్పుడూ ఏదో ఒక భేదం ప్రతి తరంలోనూ ఉంటుంది. ప్రతి తరంలో పిల్లలు పెద్దవాళ్లను మీకేం తెలియదులే అంటారు. ఏ అమ్మాయో ఏ అబ్బాయినో ‘నీకేం తెలియదు లే అమ్మా’అంటే అమ్మలు చిన్న బుచ్చుకోకూడదు. అయ్యో నన్ను అంత మాట అన్నారే అనుకోగూడదు. ఎందుకంటే ఇదే మాట మీరు మీ అమ్మనే అనే ఉంటారు. ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోండి.
అది పిల్లల తప్పు కాదు. వారు ఎదిగే కొద్దీ కొత్త విషయాలు తెలుసుకొంటూ ఉంటారు. కాని వారు ఎక్కువగా పెద్దవాళ్లలాగా ఆలోచించలేరు. అందుకే మాకు తెలిసింది చాలా ఎక్కువ అని భ్రమలో ఉంటారు. అందుకే నీకేం తెలియదులే అని సులభంగా అనేస్తుంటారు.
అట్లాంటి పిల్లలను బుజ్జగించి మాట్లాడాలి కాని వారిని తిట్టడమో కోపగించుకోవడమో , విసుక్కోవడమో చేయగూడదు.
పిల్లలు ఎదుగుతున్నప్పుడు కొత్త స్నేహితులు ఏర్పడుతుంటారు. నేటి ఆధునిక టెక్నాలజీని వారు త్వరగా అర్థం చేసుకొంటూ ముందుకువెళ్తుంటారు. అట్లాంటపుడు వారి చేతుల్లో ఎప్పుడూ ఫోను ఉంటుంది. వాట్స్‌అప్‌లోనో , ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలాంటివాటిల్లో వారు తలమునకలైనట్టే ఉంటారు.
కాని పెద్దవారు వారితో చాలా స్నేహంగా ఉండాలి. స్నేహితులతో మసలినట్టు ఉండాలి. కాని వారిపైన ఆజామాయిషీ చేస్తున్నట్టు లేక వారిని గదమాయిస్తున్నట్టు, అనుమానిస్తున్నట్టు ఉండకూడదు. వారిని ప్రోత్సహించేలా మాట్లాడాలి కాని వారిని హేళన చేసినట్టు అసలు మాట్లాడకూడదు.
వారికి తెలిసింది తక్కువే అయినా వయస్సుప్రభావం, చుట్టు ఉన్న వాతావరణం వారు చూస్తున్న ప్రపంచం అంతా తమకు తెలుసునన్న భ్రమను కల్పిస్తాయి. కనుక వారిని ఎంతో శాంతంగా ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. వారు ఏకాంతంగా ఉండాలనుకోవడం చాలా సహజం. తమ స్నేహితుల గురించి తాము చేసే పనుల గురించి తల్లిదండ్రులకు ఎందుకు చెప్పాలిలే అనే మనస్తత్వం పిల్లల్లో సహజంగా ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులు గుర్తించినట్టుకాకుండా వారితో మాట్లాడాలి. వారు చెడు దోవన పోకుండా చూసుకోవాలి. వారి స్నేహితుల గురించి ఆరాతీసినట్టు గాక సాధారణంగా తెలుసుకొన్నట్టు ఉండాలి. ప్రపంచంలో జరిగే మోసాల గురించి వారికి తెలియజేయాలి. వారిలో వచ్చే శారీరిక మార్పుల గురించి ముందే వారికి చెబుతూ ఉండాలి. లేకుంటే కొంతమంది ఆత్మనూన్యతను పాల్పడే అవకాశాలుంటాయి.
కనుక పిల్లలతో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటూనే వారిని అన్ని వేళలా కాపాడుకోవాలి. అపుడే తల్లిదండ్రులు పిల్లల మధ్య అంతరాలు ఏర్పడవు.

-లక్ష్మీ ప్రియాంక