మెయిన్ ఫీచర్

ఇక భరించకండి.. బయట పెట్టండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ పెరిగింది. నాగరికత పెరిగింది. మానవుడు చంద్రమండలంలో ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాడు. కాని మనిషిలోని రావణాసురుని ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ చూసినా నరకాసురులు, రావణాసురులే కనిపిస్తున్నారు. చిన్న పెద్దా తేడాల్లేదు. వావివరుసలు అసలే లేవు. తండ్రి, అన్న, మామ, బావ, ఇలా ఏ సంబంధం ఉన్నవారైనా సరే ఆడపిల్లల్ను చూడగానే చొంగ కార్చేవారే ఎక్కువ కనబడుతున్నారు.
పూర్వకాలంలో స్ర్తిలు ఎక్కడ పూజించబడుతారో అక్కడే దేవతలు ఉంటారని నమ్మేవారు. అలాంటిరోజుల్లోనూ కీచకులున్నా ఎవరైనా పెద్దవారు చూస్తున్నారనో, లేక ఈమె వరుసకు కూతురవుతుందనో ఊరుకొండేవాళ్లు.
నానాటికీ తీసికట్టు నాగం బొట్టు అన్నట్టు తండ్రి కూడా కూతురిపై కామంధతను వెళ్లగక్కుతున్నాడు. కూతురు వంటి కోడలిపై మామ లైంగిక దాడి చేస్తున్నాడు. పరువు కోసం ఎన్నాళ్లు ఈ హింసను మహిళ భరిస్తుంది. వీధిలోకి వెళ్లితే ఏ ప్రక్క నుంచి ఏ కీచకుడు వస్తాడో ఎపుడేమి చేస్తాడో అని ప్రాణాలను మానాన్ని అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది మహిళ.
ఇది కేవలం వయస్సులో ఉన్నవారికే ఈ బెడద అంటే అదీకాదు ఈ కామాంధతతో కళ్లు మూసుకొని పోయిన వారి ఆరాచకాలు ఆరునెలల పసికందు నుంచి డెబ్బై ఏళ్ల ముదుసలిను కూడా వీరు వదలడం లేదు.
ఏదో ఒక నిర్మానుషమైన ప్రదేశాల్లో ఈ కీచకులుంటున్నారో అక్కడ భద్రంగా జాగ్రత్తలు తీసుకొందాం అనుకొంటే పొరపాటే. నలుగురున్నచోట కూడా వీరి ఆగడాలకు అంతుండడం లేదు. ఆఫీసుల్లోను, తోటివారు , ఆఫీసర్లు కూడా ఈ బాపతువారుండడం శోచనీయం.
ఇంట్లో ను, బయట, బస్సులోను, క్యాబ్‌ల్లోను, ఆఫీసుల్లోను, అసలు ఇక్కడ అక్కడ అనే వ్యత్యాసం ఏమీ లేకుండా ఆడపిల్ల అని కనిపిస్తే చాలు వీరి కుళ్లు వెదజల్లుతున్నారు. కొందరు ప్రేమ పేరుతో మరికొందరు పెళ్లి పేరుతో మరికొందరు ఆర్థిక సహాయం పేరుతో ఇలా ఎన్నో మోసాలు ఆడవారు ఎదుర్కొంటునే ఉన్నారు.
అందుకే అటువంటి ఆడవారికోసం తెలంగాణ ప్రభుత్వం విన్నూత్న శైలిలో భద్రత కల్పించడానికి ముందుకొచ్చింది. ఇప్పటికే ఉన్న షీటీమ్స్ వారు మరికొంత ముందుకు వెళ్లి భద్రతా భరోసా కేంద్రాలు సంచార వ్యాన్స్‌లో నడుపుతున్నారు. ఈ భరోసా కేంద్రాలు ఎక్కడిక్కడే సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నాయి.
ఇవి గత సంవత్సరమే ప్రారంభించినా వీటి గురించి తెలిసిన వారు తక్కువగా ఉన్నారు. అందుకే మరింత ప్రచారం చేసి ఆడవారికి అండగా ఉండాలన్న థ్యేయంతో షీటీమ్స్ తెలంగాణ పోలీసు వారు లఘుచిత్రాలను రూపొందించారు. ఇందులో లైంగిక వేధింపులూ, అత్యాచారాలు, అత్యాచార యత్నాలూ, భౌతిక దాడులూ, వేధింపులు ఎలా ఉంటాయి.. వాటిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను రూపొందించారు. ఈ సంచార భరోసా కేంద్రాలు వీధి వీధి తిరిగి ఆడవారికి భరోసా కల్పిస్తున్నారు.
పార్కుల దగ్గర, ఆఫీసుల్లోను, బస్‌స్టాప్స్‌లోను పోకీరీ వేషాలు వేసే పోకిరీ రాయుళ్లను అప్పటికప్పుడు పట్టుకొని షీ బృందాలు పోలీస్ వ్యాన్ ఎక్కిస్తాయి. వేధింపులనుభవిస్తున్న ఆమెకు భరోసా కల్పిస్తాయి. ఆమెకు భద్రతనిస్తున్నాయి.
ఇలాంటివి కూడా లఘు చిత్రాలు తీసి అందరికీ చూపించడం వల్ల ఆడపిల్లల్లో మంచి ఆత్మస్థైర్యం పెరుగుతుంది అని మానసిక వైద్యులు చెబుతున్నారు. అందుకే
ఇక భరించకండి.. బయట పెట్టండి అన్న నినాదాలతో షీ బృందాలు యువతులకు అండగా నిలుస్తున్నాయి. ఇనఫ్ .. ఈజ్ ఇనఫ్.. చాలు .. ఇక చాలు అనే ప్రచారంతో ఈ భరోసా కేంద్రాలు స్ర్తి భద్రతకు హామీ ఇస్తోంది.
సంచార వాహనాలు
ఈ భరోసా కేంద్రాలు వీధి వీధి తిరుగుతూ ఎక్కడ ఆకతాయిలుంటే వారిని పట్టుకొని శిక్షిస్తున్నారు. వేధింపులకు గురైన మహిళలకు ఆస్వాదన కల్పిస్తున్నారు. లైగింక వేధింపులకు ఎలా స్వస్తి చెప్పాలో వారిని ఎలా ఎదుర్కోవాలో ఉన్న లఘుచిత్రాలను అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారని షీ బృందాలు చెబుతున్నాయి. ఈ సంచార వాహనాల గురించి ప్రతి మహిళకు అవగాహన కల్పించాలని పోలీసు శాఖ భావిస్తోంది. దానికోసం ప్రతివీధిలోను సంచార వాహనాలు నిలుపుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ముఖ్యంగా స్ర్తిలు ఎక్కువ గా ఉన్న చోట వెళ్లి వారికి ఆరాచకాలను సృష్టించే కీచకులను ఎలా బుద్ధి చెప్పాలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సంచార వాహనాలు తిరిగే ప్రదేశాల్లో ఉన్నవారికి కరపత్రాలు పంచుతున్నారు. ఈ కరపత్రాల వల్ల షీ బృందాల సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. బాధితులు మా సేవలను వినియోగించుకోగలుగుతారు అని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ సంచార వాహనాలు ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ప్రముఖుల చేత సందేశాల వీడియోలను కూడా ప్రదర్శిస్తున్నారు.
భరోసా కేంద్రం
భరోసా కేంద్రాలు సంచార వాహనాల్లో తిరుగుతూ ఉంటాయి. వేధింపులను పరిష్కరించుకునేందుకు వాహన బృందాలు మహిళలకు అతిచేరువులో ఉంటాయి. చాలావరకు మహిళలు ఏం చేయాలో వారికి వివరిస్తాయి. వారి ఇచ్చిన సమాచారంతో దుండగులను అప్పటికప్పుడు పట్టుకుంటారు. ఈ కేంద్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనుకున్నవారు 100 .. కి ఫోను చేసినా .. లేకుంటే నెట్‌లో సంప్రదించి నా వారు చెబుతారు. సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం లభ్యమవుతుంది. ఈ సంచార వ్యాన్లు అవగాహన కోసం ప్రదర్శిస్తున్న లఘు చిత్రాలు , సందేశాల వీడియోలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు వీటి వల్ల తమకు భరోసా లభిస్తుందన్న నమ్మకాన్ని కలిగించుకుంటున్నారు. చాలామంది వారిని లైంగిక వేధింపులకు గురి చేసేవారి గురించి నిర్భయంగా ఈ సంచార వాహనభరోసా కేంద్రాల వారికి చెబుతున్నారు. ఈ వేధింపు చర్యలనుంచి తమను కాపాడుకుంటున్నారు.
ఇప్పటి వరకు సుమారుగా 720 ప్రాంతాల్లో ఈసంచార వాహన ప్రదర్శనలు జరిగాయని పోలీసు శాఖ చెబుతోంది. అపార్ట్‌మెంట్స్‌లో పక్క పక్కన ఉంటూ కూడా కొందరు దుర్మార్గులు వారి లైంగిక కోర్కెలు తీర్చమని అతివలను ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సంచార భరోసాకేంద్రాలు అపార్ట్‌మెంట్స్ దగ్గర గా కూడా నిలిచి ఉంటాయి. ఏ మహిళ అయినా సరే వెంటనే ఈ సంచార వాహనం దగ్గరకు వచ్చి సమస్య చెప్పుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే వారికి పరిష్కారం దొరుకుతుంది. ఆకతాయిలకు శిక్షకూడ పడుతుంది. ఇక మైనర్లను, చిన్నారులను, యువతులను, వృద్ధులకు కూడా భయం అక్కర్లేదు. వారిలో కీచకుల మదం అణచవచ్చుననే ధీమా కలిగించడంలో భరోసా కేంద్రాలు షీ బృందాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఎల్లవేళలా తయారుగా ఉన్నారు. కనుక మహిళలూ భద్రంగా ఉండండి. ఇక ఏ వేధింపులనూ భరించకండి. బయటపెట్టండి. ఆ దుర్మార్గుల ఆట కట్టించండి.

-మానస