మెయిన్ ఫీచర్

మహదాత్మ వెంకటచలం పంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల తెలుగునాట ఒక గొప్ప పెద్ద నగరంలో పుస్తక ప్రదర్శనోత్సవాన్ని సందర్శించాను. చాలా విస్మయం, విడ్డూరం అనిపించిన విషయమేమంటే ఈ పుస్తక ప్రదర్శనా ఆవరణ ప్రాంగణంలో వివిధ పుస్తక విక్రయ అంగళ్ళలో పూర్తిగా ఒక అంగడి మొత్తానికి మొత్తం ఒకనాటి ఘనత వహించిన రచయిత గుడిపాటి వెంకట చలానికి కేటాయించి ఉంది. అంటే ఆ అంగడిలో ఇతర పుస్తకాలేవీ దొరకవన్నమాట. చలం పుస్తకాలే గంపగుత్తగా ప్రదర్శితమై ఉన్నాయి. ఆశ్చర్యమేమంటే గుడిపాటి వెంకట చలానికి ఈ వర్తమాన పరిస్థితులలోనూ అంత గిరాకి ఉన్నదని, ఉంటుందని ఆ అంగడిదారుడు భావించటం. విడ్డూరమేమిటంటే చలం రచనలకు ఈ కాలపు ప్రాసంగికత, ప్రయోజనం, ప్రబోధపరత, సామాజికావసరం ఏమిటని? ఆయన ఆశించిన స్ర్తి స్వాతంత్య్రం ఇంకా ఇప్పుడు ప్రబోధించాల్సిన అక్కర లేదు. స్వేచ్ఛ ప్రణయ సిద్ధాంతం తప్పూ, తప్పున్నర అని ఏనాడో తేలిపోయింది. గొల్లపూడి మారుతీరావు మనందరికీ బాగా తెలిసిన రచయిత. బహుశా ఈతరం రచయితలలో ఆయనంత విస్తారంగా రాసిన వారు మరొకరులేరేమో! ఆయన నాకు కూర్పు స్నేహితుడే. హితుడే. ఆయన స్వీయ చరిత్ర పేరు ‘అమ్మ కడుపు చల్లగా’. ఇటీవల ‘వందేళ్ళ వంద కథకు వందనాలు’ అనే పేరుతో దృశ్యశ్రవ్యమాధ్యమాలంకారంగా ఒక గొప్ప కథల సంపుటినాయన వెలువరించాడు. చలం పుస్తకాల అంగడి గూర్చి మొదలుపెట్టి గొల్లపూడి ప్రతిభా ప్రస్తావన ఏమిటా? అని ఎవరైనా ఆశ్చర్యపడవచ్చు.
గొల్లపూడి వారి స్వీయచరిత్రలో ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. అదేమంటే కడప ఆకాశవాణి కేంద్రంలో పనిచేసేప్పుడో లేదా పైలాపచ్చీసు వయసు ప్రేరేపిస్తున్నప్పుడో శ్రీ మారుతీరావు చలం గారికి ఓ లేఖ రాశాడు (1965). మీరు రాసిన పుస్తకాల గూర్చి మీ భావన ఏమిటి? అని. చలంగారి పుస్తకాలు రెండుమూడు ఉటంకించినట్లు కూడా ఉన్నది. దీనికి చలంగారు ‘వాటిని బుద్ధిలేఖ రాశాను. అవన్నీ ఎందుకు రాశానా?’ అనుకుంటున్నాను (పుట 120) అని స్ఫురింపచేసే మాటలతో సమాధానం రాశారు. చలంగారి సొంత అక్షరాలతో ఆయన లేఖా ప్రతికృతి మారుతీరావు స్వీయచరిత్రలో ఉదహరించారు. ఈమధ్య పిల్లుట్ల ఆంజనేయులుగారనే వారు (వీరిది బాపట్ల) స్వీయ చరిత్ర వెలువరించారు. ఇందులో చలం ప్రబోధాలకు లోనై కష్టాలపాలైన ఒకరి జీవితోదంతం చదవవచ్చు. ఆత్మహత్యలు వగైరా చాలామంది తెలుగు పాఠకులకు గుడిపాటి వెంకటచలం భగవాన్ శ్రీరమణ మహర్షి ప్రభావితుడై గడపిన జీవితం తెలియదు.
ఈమధ్య నా ఈ జన్మో, పూర్వజన్మో సుకృతంవల్ల ‘శ్రీరమణ కరుణా విలాసం’ అనే పుస్తకం చదివాను. భగవాన్ శ్రీ రమణ మహర్షిని దర్శించిన వారు, దర్శించనివారూ, తమ అనుభూతులను తెలియజేయగా ఎం.నాగేశ్వరరావుగారు వీటిని సేకరించారు. వారణాసి భావనారాయణగారు వీటిని చక్కగా కూర్పుచేశారు. ఈ పుస్తకం ఐదేళ్ళకిందట అంటే 2013లో వచ్చింది. ఇది నాలుగువందల పేజీల డెమీ పరిమాణంతో ఉన్న పుస్తకం. ఈ పుస్తకం 295వ పుటంలో చలం అనుభవం ఒకటి ఇట్లా అక్షరాకృతి పొందింది.
‘‘శ్రీ చలం అరుణాచలం వచ్చేశాక పాత స్నేహితులైన శ్రీశ్రీ మొదలగు మిత్రులు చలానికి స్కాచ్ విస్కీ త్రాగి ఉత్తరం రాస్తున్నాము’’ అని ఉత్తరం రాశారు- హేళనగా వ్యంగ్య ధ్వని పూర్వకంగా. చలం జవాబు ఇట్లా వ్రాశాడు. ‘ఇక్కడ సాటిలేని దిన్యోన్మత్తతను ప్రసాదించే పానీయాన్ని కనుగొన్నాను. దీనిని ఒకసారి సేవిస్తే శాశ్వత ఆనందంలో నిలిచిపోతారు. అనంతర దుష్ఫలితాలు ఉండవు. ఇది స్వయంప్రకాశమానమైనది. మీరుకూడా ధైర్యం ఉంటే వచ్చి సేవించండి’ అని వాళ్ళలాగే ధ్వని పూర్వకంగా వ్రాశాడు.
అసలు చలం ఎందుకు ఎట్లా అరుణాచలం చేరగలిగాడో ఈ ఉదంతం చదవండి. చింతాదీక్షితులు, చలం పరమమిత్రులు. ఇద్దరూ విద్యాశాఖలో ఉద్యోగులుగా పనిచేసేవారు. దీక్షితులుగారు రమణమహర్షి పరమభక్తులు. ఎట్లానైనా చలాన్ని ఒకసారి అరుణాచలం దర్శింపచేయాలని తెగ ఆరాటపడేవారు దీక్షితులు. ఎన్నిసార్లో ప్రయత్నించాడు చలాన్ని శ్రీరమణ దర్శనం చేయించాలని. ఒకరోజున ఏ కళనున్నారో చలం... తన ఇష్టం వచ్చినట్లు శ్రీ రమణాశ్రమంలో ప్రవర్తించటానికి ఒప్పుకుంటే (అంటే దీక్షితులు ఒప్పుకోవాలని భావం) వస్తానన్నాడు.
ఇద్దరూ అరుణాచలం చేరారు. ఒకరోజు శ్రీ రమణుడు అరుణగిరి దిగి వస్తుండగా అందరూ భక్తితో ఆయనకు దారి ఇచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. మన కథానాయకుడు చలం ఆయన వచ్చేదారికి అడ్డం నిలబడి నిర్లక్ష్యంగా సిగరెట్టు పొగ వదులుతున్నాడు. చింతాదీక్షితులు ‘‘ఈ దుర్మార్గుణ్ణి ఎందుకు తీసుకుని వచ్చాను?’’ అని తల పట్టుకున్నాడు.
శ్రీరమణుడు చలం దగ్గరకు రానే వచ్చాడు. శ్రీరమణుడి ముఖం మీద సిగరెట్టు పొగ వదులుదామనుకున్నాడు. శ్రీరమణుడు ప్రక్కకు తప్పుకుని ఒక్క క్షణం సూటిగా చలం కళ్ళలోకి చూశారు. ఆ క్షణంలో ఏమి జరిగిందో తెలియదు. నేలమీద దుమ్మూ, ధూళిలో ఆయన కాళ్ళమీద పడి ఉన్నాడు చలం. ఏం జరిగిందో చలమే చెపుతున్నాడు.
‘‘ఆకాశాన్నంటే ఆ గంభీర శ్యామలాకృతి నాపై దృష్టినిలిపింది. ఇనుమును చీల్చే విపరీతాగ్నికీల వలె, పాషాణాన్ని కరిగించే కేంద్రీకృత సూర్యరశ్మివలె ఆ తేజోమయ వీక్షణం నా హృదయాంతరాళంలోకి దూకి భగ్గున మండింది. ‘నేను లేను, నేను లేను, నేను భావించుకున్నది ఏదీ లేదు’’ అంటున్నాడు చలం.
ఆ క్షణంనుండి చలం జీవితం అరుణాచల రమణునికి అంకితం అయిపోయింది. అక్కడే తనువు చాలించాడు. అదృష్టవంతుడు. ఆ అదృష్టం చింతాదీక్షితులకు పట్టలేదు. శ్రీశ్రీ మొదలగు చలం నాస్తిక మిత్రులు ఆయనను (చలాన్ని) ఎంతో హేళన చేశారు. చలం వాటిని పట్టించుకోలేదు. చలం, చింతాదీక్షితులు మొదలైన మిత్రులకు రాసిన ఉత్తరాలను చలం చేతనే చదివించుకొని ఎంతో ఆనందించేవారు (పుట 121). బహుశా చలం స్వభావ తీవ్రత, విద్యుత్ ప్రసార చైతన్యం చూసి శ్రీ రమణులు చలాన్ని కరుణించి, అనుగ్రహించి ఉంటారు. ‘ఏది భావించినా అగ్నితీక్షణమైన హృదయ స్పందన చలానికి సహజ స్వభావ సిద్ధం కాబట్టి ఈ మార్గంలోనూ దూసుకొని పోగలడు అని భగవాన్ భావించారేమో!
ఇకపోతే ఒకమాట చెప్పాలి. శ్రీరామకృష్ణ పరమహంస, భగవాన్ రమణ మహర్షి, అరవిందయోగి, పరమహంస యోగానంద, కంచి పరమాచార్యులు వంటి దివ్యులు, ప్రాచీన కాలపు ఋషి సమానులు ఈనాటికీ ఈ హిందూ దేశంలో ప్రభావిస్తూ ఉండటంవల్లనే ఈ దేశం అన్యమతాక్రాంతం కాలేదు. ఏనాటికీ కాలేదు.
మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కాలంలోనే ఏడెనిమిది దేశాలు అన్యమతాక్రాంతం అయిన వైనం, అవి ఎట్లా అయినవో ఆ కుతంత్రాలు, కూహకాలు వి.ఎస్.నయపాల్ అనే నోబుల్ పురస్కార (సాహిత్యానికి) గ్రహీత తన ‘బియాండ్ బిలీఫ్’ అనే గ్రంథంలో వివరించాడు. ఆ పాపం మన దేశానికి ఏనాటికీ కలుగకుండుగాక.

- అక్కిరాజు రమాపతిరావు