మెయిన్ ఫీచర్

పిల్లలకోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదిగే చిన్నారుల్లో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, కోరిక ఎక్కువగా ఉంటాయి. విసుక్కోకుండా వారు తెలుసుకోవాలనుకునే విషయాలను తెలియజెపితే వారిలో మరింత కుతూహలం, జిజ్ఞాస పెరుగుతుంది. ఇలా వారికి విజ్ఞాన సముపార్జనతో పాటు, సృజనాత్మకంగా ఆలోచించడం వంటివాటిని కూడా పిల్లలకు అలవాటు చేస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లవుతుంది. దీంతో పాటు పిల్లలు నివసించే పరిసరాలు కూడా అందంగా, ఆహ్లాదకరంగా ఉంటే వారిలో సృజనాత్మకత మరింత పెరుగుతుంది. అందుకే పిల్లలు నివసించే గదులను అందంగా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతే వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు వారిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అని చిన్నపిల్లల వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వారి గదులు ఎలా ఉండాలో తెలుసుకుందామా..
నిజానికి పిల్లల గది ఇలానే ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు. కాకపోతే పిల్లల గదిని అలంకరించేటప్పుడు వారి అభిరుచులకు, ఆసక్తులకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పిల్లల చదువు, ప్రవర్తన, అలవాట్లను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా వారి అభిరుచులనన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తయారుచేసిన వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అంతేకాదు దీనివల్ల వారు మంచి దృక్పథంతో మసలుకుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. అలాగే భవిష్యత్తు గురించి మనం చెప్పే సలహాలను చక్కగా విని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తారు.
రంగులతో..
పిల్లల గది సర్దడంలో రంగులదే మొదటి ప్రాధాన్యం. పిల్లల సైకాలజీ ప్రకారం ఎక్కువమంది పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారట. మరికొంతమంది పింక్, గీ న్‌లను కూడా ఇష్టపడతారు. వారికిష్టమైన రంగు కదాని గది మొత్తానికి ఒకే రంగు పులిమేయకుండా ఒక గోడకు వారికిష్టమైన రంగును వేసి మిగిలిన గోడలకు లేత రంగులను ఎంచుకోవాలి. ఎందుకంటే ముదురు రంగులు గదిని ఇరుకుగా మార్చేస్తాయి. అలాగే వెలుతురు సరిగా లేనట్లు ఉంటుంది. గదిలో వారికిష్టమైన రంగులతో పాటు లేత రంగుల కలగలుపు, కార్టూన్స్, వారికి నచ్చిన బొమ్మలను స్టిక్కర్స్ రూపంలోగానీ, పెయింటింగ్స్ రూపంలోగానీ వేస్తే వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. అలాగే వారి గదిలో తప్పనిసరిగా బెడ్‌లైట్ ఉండాలి. అది కూడా వారికి నచ్చిన బొమ్మ అయితే వారికి మరింత ఇష్టం.
ఎందుకంటే పిల్లలు చీకటిని ఎప్పుడూ ఇష్టపడరు. అలాగే సీలింగ్‌కి అంతరిక్షం, చందమామ, నక్షత్రాలు.. ఇలా వారికి నచ్చిన స్టిక్కర్లనో, లేదా పెయింటింగో వేయిస్తే పడుకునేటప్పుడు వాటిని చూస్తూ ఆనందంగా, మైమరిచిపోతూ నిద్రలోకి జారుకుంటారు.
పిల్లల గది లేనిపోని వస్తువులతో హడావుడిగా, స్టోర్‌రూములా ఉండకూడదు. అవసరమైన వస్తువులను మాత్రమే ఉంచినట్లయితే గది విశాలంగా కనిపించడమే కాకుండా శుభ్రం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. పిల్లలు సాధారణంగా ఉన్న వస్తువుల కంటే డిజైనర్ వస్తువులనే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి పిల్లలగదిని వీలైనంతవరకూ డిజైనర్ వస్తువులతోనే సర్దితే బాగుంటుంది. బెడ్‌షీట్లుకానీ, దిండ్లు కానీ గది రంగులకు సరిపడేలా ఉంటే గది మరింత అందంగా ఉంటుంది. పిల్లల చదువుకునేటప్పుడు గదిలో లైటింగ్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కువ లైటింగ్, లేదా తక్కువ లైటింగ్.. ఈ రెండూ కంటికి హానికారకాలే.. స్టడీ టేబుల్ వెలుతురు, గాలి రెండూ ఉండే సౌకర్యవంతమైన ప్రదేశంలో వేస్తే వారి కంటికి ఎలాంటి హాని జరగదు. ఆ గదిలో డస్టింగ్ చేసిన ప్రతిసారీ పిల్లల సహాయం కూడా తీసుకుంటే.. కొద్దిగా పెద్దవాళ్లయ్యాక వారే గదిని శుభ్రంగా ఉంచుకుంటారు.
ఇలా పిల్లల గదిలో వారికి ఇష్టమైనవాటిని అమర్చడమే కాదు.. వాటిని ఎలా సర్దుకోవాలో వారికి నేర్పిస్తే.. చదువుకోవడానికి అవసరమైన ప్రశాంత వాతావరణాన్ని వారికి వారే ఏర్పరచుకోగలుగుతారు.

--మహేశ్వరి