మెయిన్ ఫీచర్

తల్లీ బైలెల్లినాదో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. తెలంగాణ సంస్కృతికి దర్పణం పట్టే అమ్మవారి బోనాలు జాతర ఆషాఢంలో ప్రారంభమై శ్రావణమాసం వచ్చేవరకూ జరిగే అమ్మవారి బోనాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కారణం అమ్మవారు పుట్టింటికి వచ్చే మాసంగా భావిస్తారు. అమ్మవారి బోనాలకు ఘనమైన చరిత్ర వున్నది.
బోనాల జాతరలో బోనం, సాక సమర్పణ, ఫలహారం బండ్లు, తొట్టెల సమర్పణ, శివసత్తుల, పోతరాజుల విన్యాసాలు ప్రముఖ ఆకర్షణగా వుం టాయి. అమ్మవారికి బోనం సమర్పించే స్ర్తిలు తెల్లవారు జామున తలార స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి, మడి కట్టుకుని ‘బోనం’ తయారుచేస్తారు. ‘బోనం’ అంటే ‘్భజనం’ అని అర్థం. ఈ భోజనాన్ని కొత్త కుండలో వండి, పాలు, బెల్లం జత చేసి తయారుచేసేదే ‘బోనం’. వండిన నైవేద్యాన్ని ఒక కొత్త కుండకు పసుపు, కుంకుమ, సున్నం బొట్లు పెట్టి వేప ఆకులు, వేప మండలు కుండకు తోరణంగా చుట్టి, కుండలో నైవేద్యం పెట్టి తలపై పెట్టుకొని డప్పులు మ్రోగిస్తుండగా అమ్మవారి ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు.
సాక
కొత్త చెంబులో పసుపు నీళ్లు పోసి అందులో వేప మండలను ఉంచి దాన్ని ఆలయం ఎదుట- ‘అమ్మా మమ్ము చల్లంగా చూడు తల్లి’ అంటూ వేడుకొని పోయడాన్ని సాక అంటారు. ఈ సాకలో వేపాకు ఉంచిన పసుపు నీటిని సమర్పిస్తే అమ్మవారు తమను చల్లగా చూస్తుందని భక్తుల విశ్వాసం.
ఫలహారం బండ్లు
బోనాల రోజు, ఆ మరుసటి రోజు భక్తులు తమ ఇళ్ళలో అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్ని సిద్ధం చేస్తారు. వాటిని బండిలో ఉంచి ఊరేగిస్తారు. తాము తెచ్చిన పదార్థాల్లోంచి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన అనంతరం మిగిలింది ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి స్వీకరిస్తారు.
తొట్టెల సమర్పణ
ఇది బోనాల జాతర ఘట్టాల్లో ప్రధానమైనది. సంతానం లేని భక్తులు సంతానం ఇమ్మని అమ్మని వేడుకుంటారు. సంతానం కలిగిన తర్వాత తొట్టెల సమర్పిస్తామంటూ మొక్కుకుంటారు. సంతానం పొందినవారు తమ ఇంటి నుండి తొట్టెలను ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు.
ఘటం
ఇది బోనాల రంగం తర్వాత మరో ముఖ్య వేడుక. అమ్మవారి ఆకారంలో అలంకరించిన రాగి కలశాన్ని ఘటం అంటారు. సంప్రదాయ వస్తధ్రారణ, ఒళ్ళంతా పసుపు పూసుకున్న పూజరి ఈ ఘటాన్ని మోస్తాడు. నిమజ్జనం వరకు ఈ ఘటాన్ని డప్పుల వాద్యాల నడుమ ఊరేగిస్తారు.
రంగం
బోనాల జాతరలో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ భవిష్యవాణి జాతర మరుసటి రోజు నిర్వహిస్తారు. దేవాలయం గర్భగుడిలోని మాతంగేశ్వరీ అమ్మవారి ముందు బ్రహ్మచారిణి పచ్చి మట్టి కుండపైన నిలబడుతుంది. భక్తులు మేళతాళాలు మంగళవాయిద్యాలు డప్పుల చప్పుడు చేస్తుండగా ఆమెకు అమ్మవారు ఆవహిస్తారు. ఆ సంవత్సరకాలంలో జరుగబోయే ప్రకృతి స్థితిగతులను, సామాజిక, రాజకీయాలను గురించి జోస్యం చెబుతుంది. భవిష్యవాణి పలికిన తరువాత ఆమెపైన వున్న అమ్మవారిని సోదరుడైన పోతరాజు గుమ్మడికాయతో శాంతింపజేస్తాడు. అమ్మవారిని శాంతింపజేయడానికి పూర్వం మేకపోతును గొంతుపట్టి గావుపట్టి పోతరాజు అమ్మను శాంతింపజేసేవారు. జంతుబలిని ప్రభుత్వం నిషేధించడంతో అమ్మవారిని గుమ్మడికాయతో గావుపట్టి శాంతింపజేయుచున్నారు.
తెలంగాణ ప్రాంతంలో కరువు కాటాలు వచ్చినపుడు గ్రామ దేవతలను కొలిచే ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం అభినందనీయం.

- కావ్యసుధ