మెయిన్ ఫీచర్

సర్వ రోగ నివారిణి ఈ గడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసిడిటీ, మలబద్ధకం, ఫైల్స్, కొలైటిన్, అల్సర్స్ , కిడ్నీసమస్యలు, అలర్జీ, సొరియాసిస్, మొటిమలు, ఎగ్జిమా అనేకానేక చర్మరోగాలు చాలామందిని పీడిస్తుంటాయి. రోగాలు వచ్చిన తరువాత మందులు వేసుకోవడం కన్నా రోగాలు రాకుండా చేసుకోవడం మేలు. ఇలా ఆలోచిస్తే మనం తినే ఆహారమే మనకు ఆరోగ్యాన్నిస్తుంది. ఒక్కోసారి మనం తీసుకొన్న ఆహారం మనకు అనుకోని అనారోగ్య సమస్యలను కూడా తెస్తుంది. ఎంత మంచి పౌష్ఠికాహారం తీసుకున్నా కూడా వాతావరణమూ సరిలేక ఒక్కోసారి అనారోగ్యం కలుగవచ్చు. పౌష్ఠికాహారంతోపాటుగా కొంత వ్యాయామం చేస్తే అనారోగ్యాన్ని రాకుండా చేసుకోవచ్చు. దానితో పాటుగా గోధుమ నారు రసం. లేదా పొడి రోగనివారిణిగా పనిచేస్తుంది. అంతేకాదు ఈ గోధుమ నారు రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఈ శక్తితో అనారోగ్యాల బెడదను తగ్గించుకోవచ్చు. గోధుమ నారు 111 పోషక పదార్థాలుంటాయి. సుమారుగా 23 కిలోల కూరగాయలు ఇచ్చే శక్తిని కేవలం ఒక కిలో గోధుమనారు ఇస్తుంది. గోధుమ నారులో ఎ, బి.సి,ఇ అనే విటమిన్లు ఉన్నాయి. ప్రోటీన్లు , అమినో యాసిడ్లు, ఎంజైములు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఉన్నాయి. ఇంకా సోడియం, పోటాషియం, జింక్, భాస్వరం, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. శరీరానికి 22 అమినో యాసిడ్స్ అవసరమైతే వాటిల్లో 19 ఒక్క గోధుమ నారునుంచి లభిస్తాయి. గోధుమనారును సేవించడం వల్ల రక్తహీనత రాదు. గోధుమ నారులో చిన్నపేగులో, జీర్ణకోశంలో ఆహరపు కదిలిక జరిగేలా చేస్తుంది. దీనివల్లే మలబద్ధక సమస్య దూరం అవుతుంది. గోధుమనారు రక్తంలోని చక్కెరస్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులోని పీచు పదార్థం కేన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.
గోధుమ నారు స్ర్తిల అనారోగ్య సమస్యలనూ దూరం చేస్తుంది. కీళ్లనొప్పులు, అర్థరైటిస్, నిద్రపట్టకపోవడం అనే సమస్యలను కూడా తరిమేస్తుంది. కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. అధిక బరువును, బానలా పెరిగిన పొట్టనుగోధుమ నారు రసం తగ్గిస్తుంది. చర్మంపై ముడతలు రాకుండా కూడా చేస్తుంది. కంటి కింద నల్లని వలయాలు పోగొట్టి చర్మం కాంతి వంతగా కూడా చేస్తుంది. గోధుమ గడ్డి సర్వ రోగ నివారిణిగా పరిశోధకులు చెప్తారు. రోజూ గోధుమ నారు రసాన్ని 10.మి.లీ. తీసుకొంటే చాలు. ఒకవేళ రోగగ్రస్తులైతే మాత్రం డాక్టర్లు చెప్పి న మోతాదుకు మించకుండా తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమ నారును తయారు చేసుకొన్న వెంటనే తీసుకోవాలి. లేకపోతే ఇందులో ఉండే ఔషధగుణాలు తగ్గుముఖం పడతాయి. ఈ గోధుమనారు వగరుగాను, ఘాటుగా కూడా ఉంటుంది కనుక తేనెను కలుపుకుని తీసుకోవచ్చు. ఇన్ని ఔషధగుణాలున్నప్పటికీ వైద్యుల సలహాతీసుకున్న తర్వాతనే గోధుమనారురసాన్ని తీసుకోవాలి.
గోధుమ నారు పెంపకం:
గోధుమ నారు ఎక్కువ కష్టపడకుండానే పెంచుకోవచ్చు. కొన్ని గోధుమలను తీసుకొని వాటిని ముందురోజు రాత్రినీళ్లలో నానబెట్టాలి. తెల్లారిన తరువాత నీళ్లను వంపేసి ఒక కాటన్ వస్త్రంలో పోసి మూటగట్టి ఒక బరువు కింద పెట్టాలి అప్పుడప్పుడు ఆ మూటను నీటితో తడుపుతుండాలి. లేదా చల్లని నీటిని మారుస్తూ సీసాల్లో కూడా గోధుమ నారును పెంచుకోవచ్చు. మరుసటి రోజును మూట విప్పితే గోధుమలన్నీ మొలకెత్తి ఉంటాయ. వీటిని కుండీల్లో గాని వెడల్పాటి చిల్లులున్న ట్రేలో కాని మట్టి నింపి దానిలో విత్తుకోవాలి. రెండువారాల్లోనే మంచినారు వస్తుంది.

--వాణి ప్రభాకరి