మెయన్ ఫీచర్

పెట్టుబడులు కట్టుకథలు కాకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయు డు విదేశీయాత్రలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మోదీ-బాబు స్థాయి వేరయినప్పటికీ, ఇద్దరూ పోటాపోటీగా విదేశాలు చుట్టివస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం కాళ్లకు బలపాలు కట్టుకుని, బాబు చేస్తున్న విదేశీ పర్యటనలు జయప్రదమయి, రాష్ట్రంలో పెట్టుబడుల జడివాన కురిస్తే సంతోషమే. అలా కాకుండా ఆయన పర్యటనలు కేవలం ప్రచారానికే పరిమితమయి, కట్టుకథలయితే మాత్రం అది బాబు ఇమేజీకే డామేజీనే. ఎందుకంటే.. పెద్దమ్మ-చిన్నమ్మ పుణ్యాన విభజనకు గురయిన రాష్ట్రానికి, బాబు వంటి పనిమంతుడయితేనే ఒక దారి చూపిస్తారన్న ప్రజల్లోని నమ్మకమే ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిని చేసింది. లేకపోతే, బాబు కంటే ఎక్కువ మాస్ ఇమేజ్, సానుభూతి ఉన్న జగన్ సీఎం అయ్యేవారు. ఇప్పుడంటే జగన్‌లో పరిపక్వత, విషయ పరిజ్ఞానం, జనం నాడేమిటో తెలిసింది గానీ, అప్పుడు మరీ కుర్రతనం కావడం, అనుభవలేమి తదితర కారణాలతో ప్రజలు ఆయనను 64 సీట్లకే పరిమితం చేసి, ఈ ఐదేళ్లలో అనుభవం సంపాదించుకోమని ప్రతిపక్షనేతగా కూ ర్చోబెట్టారు. దాన్ని బాగానే సద్వినియోగం చేసుకున్నట్లు జగన్ అడుగులు, ఆలోచనాధోరణి చెబుతున్నాయి. బాబు విదేశీ పర్యటనలు, వాటి ఖర్చు లు, అందువల్ల రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అమరావతి భూ కుంభకోణాలు, స్విస్ ఛాలెంజ్ లొసుగులు, సదావర్తిసత్రం భూముల పందేరాలను సమర్ధవంతంగానే బయటపెట్టి, జనంలో వాటిని చర్చనీయాంశం చేయడంలో సక్సెస్ అయ్యారు. తానూ అనుభవం పొందుతున్నానని చాటగలిగారు. గడప గడపకూ వైసీపీతో జనాలకు చేరువయ్యే యత్నం చేస్తున్నారు.
రాష్ట్రాన్ని నెంబర్‌వన్, ప్రపంచంలోనే టాప్‌టెన్ రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నానంటున్న బాబు ప్రయత్నం నెరవేరాలని అంతా కోరుకుంటారు. ఎందుకంటే అనాధగా మారిన ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా మారితే, అన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్న ఆశ. కానీ, ఇప్పటివరకూ వచ్చిన పెట్టుబడులు, కుదిరిన ఒప్పందాలు, ప్రారంభమైన కంపెనీలను పరిశీలిస్తే సర్కారు చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకూ కొన్ని వందల కిలోమీటర్ల వ్యత్యా సం కనిపిస్తోంది. అందుకే పెట్టుబడులపై అందరి అనుమానాలు!
చైనా, దావోస్, సింగపూర్‌లో పర్యటించి, ఇప్పుడు రష్యాలో ఉన్న చంద్రబాబు కృషి, మేనేజ్‌మెంట్, ఇమేజ్ వల్ల ఇప్పటివరకూ దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయని ప్రభుభక్తులు తరచూ చెబుతున్నారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ముందు సర్కారు వారు చెప్పిన పెట్టుబడుల లెక్క రూ. 3-4 లక్షల కోట్లు. విశాఖ పెట్టుబడుల సదస్సులో నాలుగున్నర లక్షల కోట్ల మేర ఒప్పందాలు జరిగాయన్నది స్వయంగా సచివులే సెలవిచ్చారు. అంటే సుమారుగా రూ. 8లక్షల కో ట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్న మాట. 32 వేల కోట్ల అంచనాగల 38 కంపెనీలకు అనుమతులిచ్చామని, వచ్చే రెండు, మూడు నెల ల్లో మరో 25 వేల కోట్లతో 19 సంస్థలకు అనుమతులు ఇస్తామని ప్రభుత్వమే సెలవిచ్చింది. 16 వేల కోట్లతో 109 చిన్న చిన్న కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయన్నది ప్రభుత్వం చేస్తున్న ప్రచారం. అంటే సర్కారు గళధారులు చెబుతున్న దాని ప్రకారమే, రాష్ట్రంలో బాబు చెబుతున్న స్థాయిలో పెట్టుబడులు రావడం లేదన్న మాటే కదా?!
బాబుకు ఐటి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆయన సీఎం అయిన తర్వాతనే రాష్ట్రంలో ఐటి పరుగులు పెట్టింది. సత్య నాదెండ్ల వంటి ప్రముఖులు తన వల్లే ఐటిలో దిగ్గజాలయ్యారని బాబు చెబుతుంటారు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ రెండేళ్లలో బాబు మార్కు ఐటి కనిపించడం లేదు. ఒక్క ఐటి కంపెనీ కూడా రాకపోవడం, దానిని ప్రమోట్ చేసిన బాబుకే అవమానం కదా? ప్రస్తుతం చంద్రబాబునాయుడు రష్యాలో పర్యటిస్తున్నారు. అక్కడి నుంచి ఎన్ని వేలు, లక్షల కోట్ల పెట్టుబడుల హమీలు మోసుకువస్తారో ఇంకా తెలియదు. బాబు ప్రయత్నాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు. ఏ రాష్ట్రానికయినా పెట్టుబడులు, పరిశ్రమలు ముఖ్యం. అవి లేకపోతే పురోభివృద్ధి కష్టం. అయితే, వైకాపా నేత అంబటి రాంబాబు చెప్పినట్లు మన దేశానికి విదేశీ పెట్టుబడుల రాక చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా గుజరాత్, కర్నాటక వం టి రాష్ట్రాలకే ఎక్కువగా వెళుతున్నాయి. ఈ క్ర మంలో బాబు ప్రయత్నం ఏవిధంగా నెరవేరుతుందన్నదే ప్రశ్న.
సహజంగా ఇలాంటి భారీ లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఒక సీనియర్ అధికారినో, అనుభవం ఉన్న అధికారినో పరిశ్రమల శాఖకు సర్వాధికారిగా నియమిస్తారు. కానీ బాబు మాత్రం తన కొడుకు వయసున్న అధికారిని ఆ పనికి నియమించుకున్నారు. పోనీ, బాబు చేసిన సాహసానికి సదరు అధికారి..విదేశీ ప్రయాణాలు తప్ప సాధించింది శూన్యమన్న విమర్శలు సర్కారుకు మచ్చ.
***
భారతీయ జనతాపార్టీ పరిస్థితి పీక సన్నం ఆశ లావు అన్నట్లుంది. రాష్ట్రంలో తెదేపా తరహా లో ఆపరేషన్ ఆకర్షను మొదలుపెట్టాలనేది కమల దళపతి అమిత్ షా కోరిక. అయతే పార్టీలోకి ఇతరులు ఎందుకు చేరడం లేదని కోర్ కమిటీ సభ్యులను ప్రశ్నిస్తే నోరెళ్లబెట్టడం వారి వంతయిందట. తాము చచ్చీ చెడి ఇతర పార్టీ నేతలను బుజ్జగించి పార్టీలోకి తీసుకువస్తామంటే, వారంతా కళంకితులని, పనికిరానివారంటూ సవాలక్ష సందేహాలు చెబుతుంటే ఇక పార్టీలో చేరేదెవరన్నది రాష్ట్ర నేతల వాదన. తాము చేర్చుకుంటామన్న నేతలను తెదేపా ఎలా చేర్చుకుంటున్నదో, అసలు ఎవరు విభీషణులో అర్ధం కాని పరిస్థితి కమలదళాలది. ఏపిలో బిజెపి పెద్ద మోతుబరి పార్టీ ఏమీ కాదు. పేరుకు జాతీయ పార్టీ అయినా రాష్ట్రంలో దాని పాత్ర స్వల్పం. సంసారపక్షంగా ఉన్న బిజెపిలో విభజన పుణ్యాన పెద్ద పర్సనాలిటీలు చేరడంతో దానికి ఇమేజ్ వచ్చింది. కన్నా, కావూరి, పురంధ్రీశ్వరి వంటి సీఎం, పీసీసీ అధ్యక్షుడు, కేంద్రమంత్రుల స్థాయి నేతలే కావడంతో బిజెపికి ఆ ఇమేజ్ తోడయింది. నిజానికి వీరు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే బిజెపిలో ఇప్పుడు మతాబుల్లా వెలుగుతున్న ప్రముఖులు, వారి అపాయింట్‌మెంట్ల కోసం పడిగాపులుకాసిన స్థాయి నేతలు.
నోరు-అనుభవంతోపాటు విషయ పరిజ్ఞానం కూడా దండిగా ఉండటం, రెండేళ్ల క్రితం వరకూ వారంతా వెలిగిన ప్రభలే కావడంతో, మీడియా కూడా వారి చుట్టూనే తిరుగుతోంది. ఆ ప్రముఖులంతా బిజెపిలో చేరినందుకే ఆ పార్టీ ఇప్పుడు మీడియాలో చోటు సంపాదించుకుంది. లేకపోతే నెల్లూరు నాయుడు గారు తప్ప, బిజెపిలో ఒక్క రూ మీడియాలో కనిపించిన దాఖలాలు లేవు. రెండేళ్ల క్రితం వరకూ మీడియా దృష్టిలో బిజెపి జిల్లాకు ఎక్కువ రాష్ట్రానికి తక్కువ. ఇప్పుడు పార్టీ అధిపతులు, వారి రాజగురువులు కూడా భయపడే స్థాయికి చేరింది. మీడియాలో బిజెపి చోటు కు అదీ అసలు కారణం! అంటే బిజెపిలో ఈ ప్రముఖులకు పాతకాపు సోమువీర్రాజు కూడా తోడవడం, వీరంతా చంద్రబాబును వ్యతిరేకించేవారు కావడం బిజెపి ప్రాధాన్యం పెరగడానికి మరో కావడం. నిజానికి ఇప్పుడు బాబుకు తన రాజకీయ విరోధులెవరో, ఎవరితో పోరాడాలో కూడా తెలియని పరిస్థితి. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలో ఎవరు పార్టీ పగ్గాలు చేపట్టినా, అప్పుడు బాబు.. ఆ ఇద్దరిలో ఒకరితోపాటు జగన్‌లో ఎవరిని శత్రువుగా ఎంచుకోవాలో అర్ధం కా ని అయోమయంలో పడటం ఖాయం. అందుకే, బిజెపి పగ్గాలు తన విరోధులకు అందకూడదని పాకులాడుతున్నారు. తన మేలు కోరే ఢిల్లీ మిత్రులతో కలసి, వారికి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్ కమిటీలో బాబు మిత్రులు సోము వీర్రాజును వద్దు, హరిబాబు ముద్దని వాదించి బాబు పెదవులపై చిరునవ్వులు పూయించారు.
రాష్ట్రంలో తమ పార్టీ స్థానమేమిటో బిజెపికి తెలియదనుకుంటే పొరపాటు. తమ పార్టీలో ఉంటూనే బాబు క్షేమం కోరే విభీషణులు, తెదేపాను విమర్శిస్తే ఆ పార్టీ నేతల కంటే తమ నేతల్లో ఎవరు ఎక్కువ బాధపడతారో కూడా తెలుసు. తెదేపాతో ఒకవైపు స్నేహంగా ఉంటూనే సొంతం గా ఎదగడం, ఎన్నికల సమయంలో రెండు డజన్ల అసెంబ్లీ, ఓ నాలుగయిదు ఎంపీ సీట్లు గెలవడమే బిజెపి అసలు లక్ష్యం. ఇప్పటికిప్పుడు తెదేపాను దూరం చేసుకుంటే వచ్చే లాభమేమి లేదు. అం దుకే ఆ పార్టీతో సఖ్యత ప్రదర్శిస్తోంది. జాతీయ పార్టీలు అవకాశం వస్తే ప్రాంతీయ పార్టీలను మిం గేయాలనే చూస్తుంటాయి. బిజెపి అందుకు మినహాయింపేమీ కాదు.
బిజెపి తాను జట్టు కట్టిన పార్టీలతో కలసి నడిచి తర్వాత, సొంతంగా అధికారం సాధించిన చరిత్ర రెండు, మూడు రాష్ట్రాల్లో చూసినదే. అది తెలిసిన బాబు ఒకవైపు కేంద్రం నిధులివ్వడం లేదని జనంలో ప్రచారం చేస్తూనే, మరోవైపు సఖ్య త నటిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్ద రూ మహానటుల్లా జీవిస్తున్నారు. ఈ ఆట మరో రెండేళ్లు ఉంటుంది.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144